సాక్షి, అమరావతి : పాత గుంటూరులో అత్యాచారయత్నం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులతో మాట్లాడారు. ఆడపిల్లల జోలికి వచ్చే వారిని ఉపేక్షించవద్దన్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఒక్కరిద్దరిని కఠినంగా శిక్షిస్తేనే మిగిలినవారికి బుద్ధి వస్తుందని ఆయన పేర్కొన్నారు. (గుంటూరులో మరో దారుణం)
ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరగాలని చంద్రబాబు ఆదేశించారు. నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయనే జ్ఞానం పెరగాలని అన్నారు. అదే సమయంలో పాత గుంటూరులోని పరిస్థితలుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. అశాంతి, అభద్రత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment