గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది.
సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎనిమిదిమందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మిగతా వారిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటానాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.