
సాక్షి, గుంటూరు: అనుమానం పెనుభూతమై తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసేందుకు యత్నించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రామాంజనేయలు, అరుణలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment