ఆటో డ్రైవర్‌ పాడుపని.. యువతి కేకలు వేయడంతో.. | Attempt To Assault Young Woman In Guntur | Sakshi
Sakshi News home page

యువతిపై లైంగిక దాడికి యత్నం 

Published Sun, May 9 2021 11:39 AM | Last Updated on Sun, May 9 2021 11:39 AM

Attempt To Assault Young Woman In Guntur - Sakshi

చినకాకాని సర్వీసు రోడ్డులో ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన యువతి గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో  విధులు నిర్వహిస్తుంటుంది. శుక్రవారం నైట్‌ డ్యూటీ కావడంతో యువతి రాత్రి 7 గంటల సమయంలో మంగళగిరి నుంచి ఆటోలో గుంటూరు బయలుదేరింది.

మంగళగిరి(గుంటూరు జిల్లా): చినకాకాని సర్వీసు రోడ్డులో ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన యువతి గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో  విధులు నిర్వహిస్తుంటుంది. శుక్రవారం నైట్‌ డ్యూటీ కావడంతో యువతి రాత్రి 7 గంటల సమయంలో మంగళగిరి నుంచి ఆటోలో గుంటూరు బయలుదేరింది. ఆటోలో అప్పటికే ఉన్న ఓ పెద్ద వయస్సు వ్యక్తి పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న ఏపీఐఐసీ వద్ద దిగిపోయాడు. ఇక ఆటోలో డ్రైవర్‌తో పాటు యువతి మాత్రమే ఉంది. చినకాకాని గ్రామం వద్దకు వచ్చేసరికి సర్వీసు రోడ్డులో డ్రైవర్‌ చీకట్లో ఆటోను ఆపాడు.

యువతి ఇక్కడెందుకు ఆపావని అడగ్గా వెనుక ప్రయాణికులు వస్తున్నారని చెప్పాడు. ఇంతలో ఆటో వద్దకు మరో యువకుడు చేరుకున్నాడు. అనుమానం వచ్చిన యువతి కేకలు వేయబోగా ఇద్దరూ కలిసి నోరు నొక్కి, కాళ్లు చేతులు పట్టుకుని ఆటోలోకి నెట్టారు. యువతి మెడలోని బంగారు గొలుసును లాగిపడేసి యువతిపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె మరింత పెద్దగా కేకలు వేయడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి అనుమానం వచ్చి ఆటో వద్దకు రావడంతో ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితుడు పరారయ్యారు. ఆటో వద్దకు వచ్చినవారి సహాయంతో బాధితురాలు మంగళగిరి రూరల్‌ పోలీస్టేషన్‌కు చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో      
బావిలో నుంచి కేకలు.. అసలు ఏం జరిగిందంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement