![Woman Assaulted For Questioning Public Urination - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/19/crime.jpg.webp?itok=2qS3R2pO)
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయోద్దన్నందుకు ఓ మహిళపై దాడికి తెగబడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు కాదుబీసనహల్లి రెసిడెంట్‌కు చెందిన ఓ మహిళ ఈ నెల 10న పని మీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఆరుగురు మందు తాగుతూ ఉన్నారు. ఆమె వారిని అక్కడ మందు తాగొద్దని హెచ్చరించింది. అయితే వారు ఆమె మాటలను లెక్క చేయలేదు. దీంతో ఆమె వారి ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని స్థానిక రెసిడెంట్స్ అసోషియేషన్ గ్రూపులో షేర్ చేసింది. ‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది
ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా జయరామ్ నాయుడు అనే వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. ఆమె అతడ్ని ప్రశ్నించగా ఆగ్రహించిన అతడు ఆమెపై దాడి చేశాడు. ఆమె జట్టుపట్టుకుని కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment