Attempt to suicide
-
పెళ్లైన 8 రోజులకే కొత్త జంట ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగి కనీసం పది రోజులు కూడా గడవని ఓ కొత్త జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చల నడుకుడ గ్రామంలోని నవ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా మారటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి ఈ నెల 13న వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే వారు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై పోలీసుల విచారణ జరుపుతున్నామని తెలిపారు. చదవండి: భార్య కాపురానికి రావడం లేదని.. -
వసతిగృహంలో ర్యాగింగ్ భూతం
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమగోదావరి) : ర్యాగింగ్ భూతానికి అభం శుభం తెలియని ఓ విద్యార్థి విలవిల్లాడి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాలు డికి వైద్య వివరాలు బయటకు తెలియ నీయకుండా ఆసుపత్రులను మార్చుతూ జరిగిన ఘటనను కప్పిపుచ్చేం దుకు సంక్షేమ శాఖ వసతిగృహం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడానికి చెందిన పాక గంగరాజు కుమారుడు పాక శాంసన్(15) కొయ్యలగూడెం సమీపంలోని అంకాలగూడెంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కళాశాల సంక్షేమ వసతిగృహంలో విద్యనభ్యసిస్తున్నాడు. శాంసన్ నెలక్రితం వసతిగృహంలో చేరి, కొయ్యలగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్ (ప్రథమ) చదువుతున్నాడు. బయోమెట్రిక్ అమలు కాకపోతుండటంతో 15 రోజుల క్రితం వసతిగృహం అధికారి శాంసన్‌ను స్వగ్రామం పంపినట్లు తెలిసింది. సోదరి ఫంక్షన్ చల్లవారిగూడెంలో ఏర్పాటు చేయడంతో శాంసన్ అక్కడికి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం తిరిగి వసతిగృహానికి వచ్చిన శాంసన్ ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిపై సంక్షేమశాఖాధికారిని వివరణ కోరగా వసతిగృహాన్ని విడిచి ఇంటికి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఆవేదన చెందిన శాంసన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. శాంసన్‌ను వాహనంలో కొయ్యలగూడెం, అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. శాంసన్ తండ్రి గంగరాజు, ఆసుపత్రిలో కోలుకుంటు న్న తన కుమారుడు ఎదుర్కొన్న వేధిం పులను సాక్షికి వివరించారు. శాంసన్‌ను తోటి విద్యార్థులు అనాకారిగా ఉన్నావంటూ గేలి చేస్తున్నారంటూ కొద్ది రోజుల నుంచి ఫోన్లో వాపోతున్నాడని పేర్కొన్నారు. ఒకటి, రెండుసార్లు విద్యార్థులకు స్వయంగా వెళ్లి చెప్పి చూశానని ఆయన తెలిపారు. ఇంటికి వచ్చి వెళ్లిన శాంసన్‌ను విద్యార్థులు మరింత గేలి చేయడంతో ఆత్మహత్యకు ఒడిగట్టాడని గంగరాజు తెలిపారు. ఇదే విషయాన్ని శాంసన్‌ను అడగ్గా సహచర విద్యార్థులు గేలిచేయడం, అవమానకర రీతిలో మాట్లాడి దూరంగా ఉంచుతున్నారని, దీనిపై సంక్షేమశాఖాధికా రికి ఫిర్యాదు చేస్తే విద్యార్థులకు దూరంగా పడుకోబెట్టేవారని తెలిపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం సంక్షేమ శాఖాధికారులు నిజాలు బహిర్గతం చేయవద్దని, చేస్తే వసతిగృహం నుంచి పంపించేస్తామని బెది రించినట్టు శాంసన్ తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వడానికి సంబంధిత సంక్షే మ శాఖ అధికారి సుముఖత వ్యక్తం చేయకపోగా, విద్యార్థి వసతిగృహంలో చేరలేదని, అసలు తమకు, ఆ విద్యార్థికి సంబంధం లేదని, తండ్రి మందలిం చడం వల్లే ఆత్మహత్యకు ఒడిగట్టాడని పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నాని పాల్పడిన శాంసన్‌ను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రులు మార్చుతూ రహస్యంగా వైద్య చికిత్స అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వసతిగృహం విద్యార్థులను దీనిపై నోరు మెదపకుండా కఠినంగా అధికారి ఆంక్షలు విధించినట్లు తెలిసింది.కళాశాల వసతిగృహ సంక్షేమ శాఖ అధికారులు తీరును పలువురు విమర్శిస్తున్నారు. శాంసన్ కొయ్యలగూడెం– పోలవరం రోడ్డులో పురుగు మందుల షాపులో గుళికలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. -
వార్డు కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం
సాలూరు: పట్టణంలోని ఏడో వార్డు కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాంధీనగర్‌లోని ఆయన ఇంటిలో చీమలమందు తాగి బుధవారం బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. కౌన్సిలర్ భార్య తరంగణి తెలిపిన వివరాల ప్రకారం... కౌన్సిలర్ తుపాకుల రవికుమార్ ఉదయం టిఫిన్ చేసి టీవీ చూస్తున్న సమయంలో ఆమె వంట గదిలో ఉంది. వచ్చి చూసేసరికి రవికుమార్ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గట్టిగా కేకలు వేస్తూ సమీపంలో ఉన్నవారిని పిలిచింది. వారి సహకారంతో రవికుమార్‌ను పట్టణ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అయితే ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన రవికుమార్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. గాంధీనగర్‌కు చెందిన బంగారు సింహాద్రి కుటుంబ సభ్యుడికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి విశాఖలో ఉంటున్న టి. రమేష్, కె. సత్తిబాబు అతడి నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారానికి రవికుమార్ మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే టి. రమేష్, కె. సత్తిబాబులు ఉద్యోగం ఇప్పించడంలో విఫలం కావడంతో సింహాద్రి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం రవికుమార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సింహాద్రి భార్య రాములమ్మ, అల్లుడు ధనాల వినయ్, కుమార్తె హైమావతి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ పిల్లలను చంపేయమంటావా అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన రవికుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
అంకంపాలెంలో కుల బహిష్కరణ
జీలుగుమిల్లి: మండలంలోని అంకంపాలెం గ్రామంలో కోర్టు కేసులో సాక్ష్యం చెప్పిందనే నేపంతో ఓ మహిళ కుల బహిష్కరణకు గురైంది. తోడ పుట్టిన సోదరుడే అక్కను కులం నుంచి వెలి వేయడంతో మనస్తాపంతో ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘనటపై బాధితురాలి తల్లి నాలి దుర్గమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంకంపాలెం గ్రామానికి చెందిన నాలి రాఘవులు, దుర్గమ్మ దంపతులకు చెందిన 35 ఎకరాల భూమికి ఇటీవల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పరిహారం అందింది. ఆ సొమ్మును ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు పంచి మిగిలిన రూ.70 లక్షలను రాఘవులు, దుర్గమ్మ పేరు మీద బ్యాంక్ ఖాతాలో ఉంచుకున్నారు. ఈ సొమ్మును తల్లిదండ్రులకు తెలియకుండా ఒక కుమారుడు కాజేసి తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టులో కూడా కేసు వేశారు. విచారణలో భాగంగా పెద్ద కుమార్తె తోట వెంకటరమణ సోదరుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో ఆగ్రహించిన సోదరుడు కుల పెద్దలతో ఆమెను కుల బహిష్కరణ చేయించాడు. శనివారం తోట వెంకటరమణ గ్రామంలో వివాహ విందుకు భోజనం చెయ్యడానికి వెళ్ళగా అక్కడకు వచ్చిన ఆమె సోదరులు ఈమెను భోజనానికి ఎవరు పిలిచారంటూ అక్కడివారిని నిలదీశారు. ఈమెను ఇక్కడ నుంచి పంపితేనే కులస్తులంతా భోజనం చేస్తారని చెప్పడంతో.. భోజనం మధ్యలోనే ఆమెను పంపించి వేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పట్టించుకోని అధికారులు : గ్రామంలో జరిగిన కుల బహిష్కరణ సంఘటనపై అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కులపెద్దలు అన్యాయాన్ని ఖండించకుండా నిరపరాదిని శిక్షించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
భూమి పట్టా చేయడంలేదని ఆత్మహత్యాయత్నం
సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల గంగయ్య అనే వ్యక్తి 2001లో సర్వే నంబర్ 210లో ఎకరం భూమిని జితేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అతను చనిపోవడంవతో ఆ భూమి తమదేనని అతని కుటుంబ సభ్యులు అంటున్నారని, భూమి పట్టా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అతను ఆత్మహత్యకు యత్నించాడు. ఇతనిని ఆస్పత్రికి తరలించారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో..
సాక్షి, గుంటూరు: అనుమానం పెనుభూతమై తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసేందుకు యత్నించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రామాంజనేయలు, అరుణలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తె సహా తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, బాపులపాడు: ఏం కష్టమొచ్చిందో ఏమో తన బిడ్డతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆరేళ్ళ వయసున్న కుమార్తెతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించింది ఆ మాతృమూర్తి. అయితే అదృష్టవశాత్తు తల్లీబిడ్డ గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. -
ప్రేమ వివాహం.. అయినా వేరే పెళ్లిళ్లు చేశారు!
బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కిరణ్ హాస్పిటల్ వద్ద ఓ ప్రేమ జ౦ట ఆత్మహత్యాయత్న౦ చేసింది. ఖాదర్ వలీ, శాంతి అనేవారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నా మళ్లీ వేర్వేరు పెళ్లిళ్లు చేశారని వారు మనస్తాపం చెందారు. దీంతో ఆస్పత్రి వద్ద ఆదివారం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. -
'నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే'
ఏపీ ముఖ్యమంత్రి కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కర్నూలు జిల్లా అస్సారి మండలం అట్టెకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో.. జనంలో తిరగలేకపోతున్నానని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దిగానని తన లేఖలో వివరించాడు. ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే.... నా పేరు గోవింద రాజు. 2014కు ముందు నేను ఏ పార్టీలో చేరలేదు. కనీసం టీడీపీకి అభిమానిని కూడా కాదు. కానీ.. ఎలక్షన్లకు ముందు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానంతో.. ఆయన మాటలు నమ్మి టీడీపీ కోసం ప్రచారం నిర్వహించాను. దళిత సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ మా వార్డు వాళ్లందరితో టీడీపీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేశాను. అనంతరం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా టీడీపీని గెలిపించడానికి కృషి చేశాను. వార్డు పరిధిలో సిమెంట్ రోడ్డు వేయిస్తామని, పింఛన్లు ఇప్పిస్తామని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించాను. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో.. జనాల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. గతంలో చేసిన అప్పులు ... ఇప్పుడు తీర్చాలంటూ అప్పులు ఇచ్చినవాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర నాతో కలిసి ఉండాలంటే మొహం చెల్లగా నా భార్య, పిల్లలను విడిచి వెళ్లిపోతున్నాను. ఏది ఏమైనా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ మాత్రం నా గుండెల్లో ఉన్నాడు. ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నా కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా న్యాయం చెయ్యాలి.. నా మరణానికి సమాధానం చెప్పాల్సిన ఇద్దరు.. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే.. మరొకరు టీడీపీ పార్టీ అని పేర్కొన్నాడు. కాగా కటౌట్ ఎక్కిన గోవిందరాజులును పోలీసులు సముదాయించి ఎట్టకేలకు కిందకు దించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రబాబు సందర్శకులను కలుస్తారని చెప్పడంతో అతను తన పట్టువీడాడు. గోవిందరాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. -
విధుల నుంచి తొలగించారని..
పారిశుధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్: పారిశుధ్య విధుల నుంచి తొలగించారంటూ మనస్తాపానికి గురైన గర్భిణి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో కలకలం రేపింది. హైదరాబాద్ గాజులరామారం శ్రీరాంనగర్‌కు చెందిన పి.సంపూర్ణ(26) పదేళ్లుగా మున్సిపల్ కార్మికురాలిగా పని చేస్తోంది. ఇటీవల పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆమెను విధుల నుంచి తొలగించారు. సోమవారం కార్యాలయానికి వెళ్లి వచ్చిన సంపూర్ణ తీవ్ర మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో బంధువులు షాపూర్‌నగర్‌లోని రామ్ ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణి అయిన సంపూర్ణ పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే ఉద్యోగం పోయి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆమెకు జవాన్‌గా పనిచేసే ఓ వ్యక్తి నీ ఉద్యోగం నేనే తీయించా.. నీ స్థానంలో మరొకరిని పెట్టుకున్నాం.. అంటూ బెదిరిం పులకు దిగడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఏఐటీయూసీ నేత ఏసురత్నం, ఐఎఫ్టీయూ ప్రవీణ్, సీఐటీయూ లక్ష్మణ్, లింగస్వామి, బాల రాజు, కాంగ్రెస్‌నేత గుబ్బల లక్ష్మినారాయణలు సంపూర్ణకు మద్దతుగా ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించి వైద్య పరీక్షల ఖర్చంతా గ్రేటర్ అధికారులే భరించాలని డిమాండ్ చేశారు. ఎవరిని పెట్టుకోలేదు: ఉప కమిషనర్ మమత పారిశుధ్య పనులు నిర్వహించే 28 మందిని ఉన్నతాధికారుల సూచన మేరకు విధుల్లోకి తీసుకోలేదని, ప్రతి రోజు తన దగ్గరకు సంపూర్ణతో పాటు తొలగించిన కార్మికులు వస్తున్నారని కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ మమత ‘సాక్షి’కి తెలిపారు. వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకోలేదన్నారు. ఈ విషయాన్ని వారికి కూడా చెప్పామని వెల్లడించారు. -
సుబ్బారావు ఆచూకీ దొరికింది!
-
సుబ్బారావు ఆచూకీ దొరికింది!
కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్ నోట్ పెట్టిన వ్యాపారి సుబ్బారావు ఆచూకీ దొరికింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీ ప్రాంతానికి చెందిన సుబ్బారావు ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరుడికి లేఖ పెట్టి, అదృశ్యం అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అంతా కలిసి నాగ్‌పూర్ వెళ్తుండగా ఆదిలాబాద్‌లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో వాళ్ల కథ సుఖాంతం అయినట్లయింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
అమరావతి: గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాంబశివ రావు(49), భార్య కోటేశ్వరమ్మ నాలుగు ఎకరాల్లో మిరప, పత్తి పంట సాగు చేశారు. ఆయన ఆశించిన స్తాయిలో దిగుబడి రాలేదు. పంటల కోసం సాంబశివరావు రూ.4 లక్షలు పైగా అప్పు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వారికి కావాల్సింది శిక్ష కాదు..కౌన్సెలింగ్
కతువా: జీవితాన్ని ముగించుకోవాలంటూ తీవ్రచర్యలకు పాల్పడే వ్యక్తులను శిక్షించరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐపీసీ నుంచి ఆత్మహత్యా నేరం తొలగింపుపై ఆయన శనివారమిక్కడ పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారికి కావాల్సింది శిక్ష కాదని, సరైన కౌన్సెలింగ్ అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మహత్యాయత్నం నేరం కాదని ...ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309ను తొలగించాలని నిర్ణయించిన విషయం విదితమే. -
ఆత్మహత్యాయత్నాలపై చట్టం ఏమంటోంది...
-
ఆత్మహత్యాయత్నాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందా?
-
IPC 309
-
చోరీకి యత్నం, పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం
-
చోరీకి యత్నం, పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం
గుంటూరు : చోరీకి పాల్పడిన ఓ మహిళ పోలీస్ స్టేషన్లో శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా వినుకొండ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి యత్నించిందో ఓ మహిళ. ఇంతలో బాధిత మహిళ గట్టిగా అరవటంతో అప్రమత్తమైన స్థానికులు ...చోరికి యత్నించిన మహిళను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. నిందితురాలు పోలీస్ స్టేషన్లో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం
తిమ్మాజీపేట: కుటుంబ కలహాలకు తాళలేక ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లల జీవితాలకు ముగింపు పలికింది. మరో కూతురుతో పాటు ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం మరి కల్ గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మ భర్తతో గొడవపడి సోమవారం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తర్వాత తానూ అంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురినీ మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం నందిని (6), విజయలక్ష్మి (4)లు మరణించారు. తల్లి భీమమ్మతో పాటు మరో కూతురు శ్రీలక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. -
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని ఉంగటూరు మండలం మానికొండలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
-
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటగిరి అటవీ ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. అధికారులు వారిని వెంటకగిరి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లలో రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. -
సుప్రీం కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
-
కోర్టు ఆవరణలో విషం తాగిన మహిళా న్యాయవాది
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆవరణలో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన న్యాయవాది...తనపై జరిగిన గ్యాంగ్ రేసు కేసులో న్యాయం జరగలేదంటూ విషం తాగి ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. గత ఏడాది తనపై బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
భార్య కాపురానికి రావటం లేదని...
భార్య కాపురానికి రావడంలేదని వాటర్ ట్యాంకు ఎక్కి అధికారులను, గ్రామస్తులను కంగారుపెట్టాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరుకు చెందిన యర్రంశెట్టి మాచిరాజు(30) వ్యవసాయ కూలీ. అతనికి 2012లో ఆచంటకు చెందిన దుర్గాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది కొడుకు ఉన్నాడు. మాచిరాజు మద్యానికి బానిస కావడంతో దుర్గాదేవి కొన్నాళ్ల కిత్రం పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యం మానితేనే కాపురానికి వస్తానని ఆమె చెప్పింది. భార్య వదిలి వెళ్లిపోయిందని అందరూ ఏడిపించడంతో మనస్తాపం చెందిన మాచిరాజు పంచాయతీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంకు ఎక్కాడు. అక్కడ నుంచి దూకేస్తానంటూ అందరినీ కంగారు పెట్టించాడు. ఎస్సై విశ్వం వెంటనే ఘటనా స్థలానికి సిబ్బందితో వెళ్లారు.తన భార్యను కాపురానికి తీసుకువస్తేనే కిందికి వస్తానని, లేకపోతే దూకేస్తానని అతను ఎస్సైతో చెప్పాడు. చివరకు ఎస్సై పైకి వెళ్లి మాచిరాజును కిందికి దిచడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అధ్యాపకుల వేధింపులతో విద్యార్థిని మృతి
-
అధ్యాపకుల వేధింపులతో విద్యార్థిని మృతి
తాను చదువుతున్న విద్యాసంస్థకు చెందిన సిబ్బంది వేధింపులకు పాల్పడటంతో.. వాటిని భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొన్ని గంటల పాటు కొట్లాడి.. చివరకు ప్రాణాలు వదిలేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలోని గుత్తికొండ శ్రీరాములు డీఈడీ కళాశాలలో చదువుతున్న సుభాషిణి అనే విద్యార్థిని టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తోంది. అక్కడ కొంతమంది అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆమెను వేధించారు. ఆ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. విద్యార్థిని పరిస్థితి విషమించడంతో ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా, అధ్యాపకులు, సహ విద్యార్థుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు అంతకుముందు పోలీసులకు తెలిపింది. తనకు టీచర్ కావాలని చాలా ఆశగా ఉండేదని, అంతా కలిసి వేధించి ప్రాణాలు పోయేలా చేశారని వాపోయింది. -
పోలీసులతో గొడవ:నలుగురు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు: నలుగురు యువకులు పోలీసులతో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది. బంధువుల కథనం ప్రకారం ఆటోస్టాండ్ విషయమై నలుగురు యువకులు పోలీసులతో గొడవపడ్డారు. ఆ కారణంగానే వారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి
విశాఖపట్నం: రావికమతం మండలం తుమకానిపల్లె గ్రామంలో ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉంది. ఆ యువతిని కేజీహెచ్‌కి తరలించారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన మేఘావతి
విశాఖ : మెట్టినింటి ఆరళ్లకు మరో నవవధువు బలైంది. విశాఖలో గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన మేఘావతి మృతి చెందింది. ఈ నెల 15వ తేదీన అపస్మారక స్థితిలో ఉన్న మేఘావతిని ఆమె అత్త, బావ స్థానిక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పెళ్లయిన తర్వాత మేఘావతిని ఆమె భావ వేధింపులకు గురిచేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఎదురు తిరగటంతో మేఘావతిని చంపేందుకు అత్త, బావ, భర్త చంపేందుకు యత్నించారు. అనంతరం తీవ్రజ్వరమంటూ అత్తింటివారు మేఘావతిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు మేఘావతి మృతితో కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
భార్యతో గొడవపడి.. కూతుర్ని నరికేశాడు!!
భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని చంపేయడమే కాక, భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. సుబోధ్ సాహు (37) అనే ఈ వ్యక్తి తన కుమార్తె సిమ్రన్ను నరికి చంపేశాడు. ఆ తర్వాత వరుసగా తన భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ సంఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. ఇదంతా అయిన తర్వాత అతడు విషం తాగి, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, ఇరుగు పొరుగులు అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సుబోధ్ ఒక్కడూ కియోంఝర్ జిల్లాలో పనిచేస్తుండగా, మిగిలిన ఉమ్మడి కుటుంబం మొత్తం భువనేశ్వర్‌లో ఉంటుంది. అతడి భార్య, కుమార్తె కూడా అక్కడే ఉంటారు. అయితే, వేరు కాపురం పెట్టాలని ఎప్పటినుంచో అతడి భార్య గొడవ పెడుతోంది. కానీ అలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయన్న సుబోధ్.. ఇదే విషయంలో గొడవపడి ఈ దారుణానికి ఒడిగట్టాడు. -
'గొంతునులిమారు, వారిని వదలకూడదు'
విశాఖపట్నం: పెందుర్తి సింహపురి లే అవుట్లో ఓ దారుణం జరిగింది. ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవవధువు ఆత్మహత్యాయత్నం చేసిందని బంధువులు చెబుతున్నారు. అయితే అత్తింటివారే వేధింపులకు గురి చేసి గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారని, వారిని వదిలపెట్టకూడదని నవవధువు మేఘావతి బంధువులు ఆందోళనకు దిగారు. మేఘావతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. స్థానికుల కథనం ప్రకారం మేఘావతికి నెల క్రితమే పెళ్లి అయింది. వివాహ సమయంలో కట్నకానుకలు బాగానే ఇచ్చారు. అయినా అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయని మేఘావతి బంధువులు చెబుతున్నారు. తీవ్రజ్వరమంటూ అత్తింటివారు మేఘావతిని ఆస్పత్రిలో చేర్పించారు. అత్తింటివారే మేఘావతిని పీకనులిమి చంపేందుకు ప్రయత్నించారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. వారు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మేఘావతి భర్త, అత్త, బావలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా అమ్మాయి తరఫు బంధువులు అడ్డుకున్నారు. దాంతో ఆస్పత్రివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
'ఆమె అతడిని...అతడు మరో ఆమెను ప్రేమించాడు'
తిరుపతి : ఓ ట్రయాంగిల్ లవ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఆమె అతడిని ప్రేమించింది. అతను మరో అమ్మాయిని ప్రేమించాడు. అది తెలిసి కూడా... ప్రియుడి కోసం ఆ యువతి గడపదాటి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ రెండు రోజులు అతని వెంటే తిరిగింది. దాంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటూ అతడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతడు కంగారుపడి... తనకోసం వచ్చిన ఆమెను ఇంటివద్ద వదిలిపెట్టేందుకు బయల్దేరాడు. అయితే రైలు దిగగానే.. అమ్మాయి బంధువులు కన్పించారు. అంతే ఏమి చేయాలో వారిద్దరికి అర్థం కాలేదు... భయంతో పట్టాలపైకి దూకారు. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది. దీంతో అతడి కాళ్లు విరిగిపోగా, ఆమె గాయపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పలమనేరు మండలానికి చెందిన ప్రియ, గంగవరం మండలానికి చెందిన ప్రసాద్ బాబును రెండేళ్లుగా ప్రేమిస్తోంది. అయితే ప్రసాద్ బాబు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ప్రియ ఇల్లు వదిలి ప్రసాద్ దగ్గరకు వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రియ తల్లిదండ్రులు ప్రసాద్‌కు ఫోన్ చేసి... కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ప్రియను ఇంటి దగ్గర వదిలి పెట్టేందుకు తిరుపతి వచ్చాడు. అదే సమయంలో రైల్వేస్టేషన్లో ప్రియ బంధువులు కన్పించటంతో భయపడిపోయిన ప్రియ, ప్రసాద్‌లు రైలుపట్టాలపైకి దూకారు. అటుగా వచ్చిన రైలు వారిని ఢీకొనటంతో ప్రసాద్ కాళ్లు తెగిపోగా... ప్రియకు గాయలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
తిరుపతి : పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. అర్థరాత్రి వీరిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రేమజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినివారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట గంగవరం మండలానికి చెందిన ప్రసాద్, ప్రియగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
భార్యబిడ్డలను కొట్టి, భర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్ గౌతంనగర్‌లో శుక్రవారం దారుణం జరిగింది. భార్యాబిడ్డలను ఐరన్ రాడ్‌తో దారుణంగా కొట్టి అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య కృష్ణవేణి, చిన్నారి భవాని పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'కేసీఆర్‌కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని, అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని పొన్నాల శనివారమిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అయితే గెలుపు టీఆర్‌ఎస్‌దేనంటూ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. గెలిపిస్తే సేవ... లేకుంటే విశ్రాంతన్న కేసీఆర్‌కు ఇప్పుడిక విశ్రాంతే శరణ్యమని పొన్నాల ఎద్దేవా చేశారు. కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి సహకరించలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూలంకషంగా పరిశీలిస్తామన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే, వర్థన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ అస్వస్థతకు గురయ్యారన్నారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పొన్నాల తెలిపారు. -
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మురళి అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం పెట్రోల్ బంక్‌లో సిబ్బందిని బెదిరించాడు. ఆ కేసుకు సంబంధించి విశాఖ త్రీ టౌన్ పోలీసులు మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై తప్పుడు కేసు బనాయించారంటూ మురళి ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అతనిని కెజిహెచ్కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్ మాట విని మృత్యుఒడికి..
హైదరాబాద్: ఆత్మహత్యాయత్నం చేస్తే.. భయపడి ఇంట్లోని పెద్దలు మన ప్రేమ పెళ్లికి అంగీకరిస్తారని బాయ్‌ఫ్రెండ్ చెప్పిన మాటలు నమ్మి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం డబీర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన మెహరున్నీసా బేగం కుమార్తె అజ్రా ఫాతిమా (18) ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్ అక్బర్ (19)ను ప్రేమించింది. కుటుంబసభ్యులు మన పెళ్లికి అంగీకరించాలంటే నువ్వు ఆత్మహత్యాయత్నం చేసినట్టు నటించాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన ఫాతిమా ఈనెల 6వ తేదీ రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. అంతకుముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్ అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం : భర్త మృతి
-
దంపతుల ఆత్మహత్యాయత్నం : భర్త మృతి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఓ ప్రైవేట్ లాడ్జిలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని కాతేరు గ్రామానికి చెందిన శ్రీకృష్ణ, కళ్యాణి దంపతులు గత కొంతకాలంగా వీరు తణుకులో నివాసం ఉంటున్నారు. నివాసం తణుకులో ఉంటున్నా, వీరు ఆదివారం రాత్రి ఓ లాడ్జిలో రూము అద్దెకు తీసుకున్నారు. అనారోగ్యం, ఆర్థిక పరమైన కారణాల వల్ల వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరికి ఇంటర్ చదివే ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడులో అవనిగడ్డ నాగేశ్వరరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యకు కుటుంబకలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా కలిదిండి మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. నలుగురు గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే జిల్లా నూజివీడు పట్టణం పోతిరెడ్డిపల్లి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తిరుపతిరావు అనే వ్యాపారి మృతి చెందాడు. లారీ-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి తాండాలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మెదక్ జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. -
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం
* వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఖాకీల దౌర్జన్యానికి నిరసన * పురుగు మందు తాగిన రామచంద్రారెడ్డి * ఆరోగ్య పరిస్థితి విషమం * బళ్లారిలో చికిత్స.. బెంగళూరుకు తరలింపు * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిచిన పోలీసులు * ఆపై బూట్లు, లాఠీలతో చితకబాదిన ఖాకీలు * నిరసనగా స్టేషన్ ఎదుట కాపు బైఠాయింపు, ఆత్మహత్యాయత్నం * ఇది జీర్ణించుకోలేక అదే స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకున్న కార్యకర్త రాయదుర్గం/బళ్లారి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్ల పేరుతో పోలీసులు చితకబాదడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం రాయదుర్గం పోలీస్‌స్టేషన్ వద్దే ఆయన పురుగుల మందు తాగారు. అనంతరం ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి, ఆపై రాత్రి బెంగళూరుకు తరలించారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నాన్ని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త పోలీస్ స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో పోలీసులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో రాయదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసలేం జరిగింది? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయన్న నెపంతో మంగళవారం పోలీసులు దాదాపు వంద మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను స్టేషన్‌కు పిలిపించి లాఠీలు ఝుళిపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని, బూట్లు, లాఠీలతో కుళ్లబొడిచారని సర్పంచులు, వార్డు సభ్యులు ఆరోపించారు. వెంటనే ఆయన పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. స్టేషన్ లోపలికి ఎమ్మెల్యేను రాకుండా అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏ కారణంతో కొడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. తాము ఎవ్వరినీ కొట్టలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో దెబ్బలు తిన్నవారు ‘మమ్మల్ని కొట్టలేదా?’ అంటూ లేవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రపతి పాలనను ఆసరాగా చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని కాపు మండిపడ్డారు. సర్పంచులు, నాయకులను పశువులను కొట్టినట్లు చితకబాదడం ఏంటని ప్రశ్నించారు. చట్ట ప్రకారం బైండోవర్లు చేయాల్సిన పోలీసులు గూండాలు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పురుగుల మందు డబ్బా లాక్కున్నా.. ఇంతలో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలను పోలీసులు తోసివేసేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమీపంలో ని ఓ రైతు చేతిలో ఉన్న పురుగుమందు డబ్బాను లాక్కుని ‘నా వద్దకు రావద్దు.. మీరు ప్రవర్తించిన తీరుతో కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీ వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకుంటాను’ అని హెచ్చరిస్తూ మూత తీసి తాగబోయారు. పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకోవటంతో ఒక్క ఉదుటున పక్కకు వచ్చిన ఎమ్మెల్యే.. రైతు వద్ద నున్న మరో బాటిల్‌ను లాక్కుని మూత తీసి పురుగుమందు తాగారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ పోలీసుల్ని తోసేశారు. దీంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. అనంతరం కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. 50 మిల్లీలీటర్ల వరకు పురుగుల మందు తాగారని, పరిస్థితి కొంత వరకు విషమంగా ఉందని చెబుతూ బళ్లారికి తీసుకెళ్లాలని సూచించారు. ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి కాపు భారతి కన్నీరు పెడుతూ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. బళ్లారిలో చికిత్స.. బెంగళూరుకు తరలింపు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం రామచంద్రారెడ్డిని బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించాక సాయంత్రం విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా 24 గంటలు గడిచాకే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు. అయితే రాత్రి ఏడు గంటలైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఎమ్మెల్యేను బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతకు ముందు ఎమ్మెల్యేను చూసేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బళ్లారి విమ్స్‌కు తరలి వచ్చారు. కాపు రామచంద్రారెడ్డిని బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప తదితరులు పరామర్శించారు. పోలీసుల తీరు అమానుషం: గురునాథరెడ్డి, కేతిరెడ్డి అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: పోలీసుల వ్యవహార శైలి వల్ల ఒక ప్రజాప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యముంటుందా? అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? లేక పోలీసుల పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో గురునాథరెడ్డి నివాసం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. వారిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా తెలుగుతల్లి సర్కిల్ వద్దపోలీసులు అడ్డుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు రోడ్డుపైనే అరగంట పాటు బైఠాయించారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు కొందరిని మాత్రమే లోనికి పంపిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన సీఐ భాస్కర్‌రెడ్డిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కిరోసిన్ పోసుకున్న వికలాంగుడు.. ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించడాన్ని జీర్ణించుకోలేక గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వికలాంగుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజశేఖరరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోసి కిరోసిన్ బాటిల్‌ను లాక్కుకున్నారు. ఈ సమయంలో అతడి కళ్లలో కిరోసిన్ పడడంతో పోలీసులు ఆస్ప్రతికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అందుకు నిరాకరించిన అతడు.. స్టేషన్ వద్దే బైఠాయించాడు. ఎమ్మెల్యేకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని, దేవుడి లాంటి మనిషి కోసం ఎంత మంది ప్రాణాలు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నాడు. చివరకు కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించాడు. నా భర్తకు ఏమైనా జరిగితే ఆత్మహత్య చేసుకుంటాం ‘‘నా భర్త ఆత్మహత్యాయత్నానికి పోలీసులే కారణం. ఆయనకు ఏమైనా జరిగితే మా కుటుంబసభ్యులమంతా పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటాం.’’ - కాపు భారతి, రామచంద్రారెడ్డి సతీమణి -
చికిత్స పొందుతూ గర్భిణి మృతి
- అత్త, మామ, ఆడ బిడ్డలే చంపారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ చిట్టమూరు, న్యూస్‌లైన్ : అత్తింటి వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి సోమవారం మృతి చెందింది. అయితే తమ బిడ్డది ఆత్మహత్య కాదని, అత్త, మామ, ఆడ బిడ్డలు కలిసి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవినాయక్ కథనం మేరకు.. చిట్టమూరుకు చెందిన చింతాల సుబ్రహ్మణ్యం, సునీత కుమారుడు నిరంజన్‌తో చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం తీయవరం గ్రామానికి చెందిన జలగం చంద్రయ్య, భారతమ్మ కుమార్తె సుకన్య(23)కు 2011 మార్చి 11 వ తేదీన వివాహం చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. సుకన్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయితే ఏడాది నుంచి సుకన్యను అదనపు వరకట్నం తేవాలని అత్తింటి వారు వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 22వ తేదీన బంగారం విషయమై అత్త సునీత, సుకన్య మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సుకన్య ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టి సునీతను కాపాడే ప్రయత్నం చేశారు. కొనఊపిరి ఉండటంతో నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఎస్ఐ రవినాయక్, తహశీల్దార్ నెల్లూరుకు చేరుకుని పంచనామ నిర్వహించి, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా బిడ్డను పథకం ప్రకారమే హతమార్చారు మా బిడ్డను అత్త, మామ, ఆడ బిడ్డలు పథకం ప్రకారం దాడిచేసి గాయపరచడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. సుకన్య ఒంటిపై గాయాలు ఉన్నాయన్నారు. సుకన్యను ఇరుగు పొరుగు ఇళ్లకు కూడా పోనివ్వకుండా ఇంట్లోనే నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేసేవారిని ఆరోపించారు. అత్త, మామలే కాకుండా ఆడ బిడ్డ అపర్ణ కూడా సుకన్యను వేధించేదన్నారు. గతంతో ఓ సంఘటన విషయమై సుకన్యతో అత్తమామలు అపర్ణ కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారని తెలిపారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి..భార్యను రక్షించిన గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా పెద్ద ఉమ్మెంతాలలో విషాద ం పూడూరు, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాలలో దా‘రుణం’ చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. భార్య బావిలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరార్జున్‌రెడ్డి(38), లావణ్య(33) దంపతులు. వీరికి ఎకరం పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఈ ఏడాది పత్తిపంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదు. పెట్టుబడితో పాటు ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం వారు రూ. 2లక్షలకు పైగా అప్పులు చేశారు. పంట ఆశించిన స్థాయిలో పండక పోవడంతో భార్యాభర్తలు తీవ్ర మనస్తాపం చెందారు. దీనికి తోడు ఇటీవల డబ్బులు ఇవ్వాలని రుణదాతలు వేధించసాగారు. ఎప్పటిలాగే శుక్రవారం వీరార్జున్‌రెడ్డి పొలానికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న లావణ్య గ్రామ శివారులోని ఓ చేదు బావిలో దూకింది. స్థానికులు గమనించి ఆమెను రక్షించారు. విషయం చెప్పేందుకు స్థానికులు వీరార్జున్‌రెడ్డి కోసం పొలానికి వెళ్లగా రాకంచర్ల రహదారిలోని ఓ మామిడితోటలోని చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహంగా వేలాడుతూ కనిపించాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
వరంగల్: ఇద్దరు పిల్లలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గూడూరులో బానోత్ లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ తన ఇద్దరు ఆడపిల్లలకు విషం ఇచ్చాడు. తాను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడితో లక్ష్మణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
రాయగడలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం
(సిహెచ్.అప్పారావు-సాక్షి) విశాఖపట్నం: ఒడిషాలోని రాయగడలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. శరీరం తీవ్రంగా కాలిపోయి ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఇక్కడకు తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి అతి ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయగడలో ఉపాధ్యాయురాలయిన ఇతిశ్రూ ప్రధాన్ (29) ఈ నెల 27వ తేదీ రాత్రి ఒంటిపై పెట్రోల్ పో్సుకొని నిప్పంటించుకుంది. ఆమె శరీరం చాలావరకు కాలిపోయింది. వెంటనే ఆమె అక్కడ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ తీసుకువచ్చి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.