భార్యతో గొడవపడి.. కూతుర్ని నరికేశాడు!! | Man kills daughter after quarrel with wife | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవపడి.. కూతుర్ని నరికేశాడు!!

Published Mon, Jun 16 2014 11:34 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

భార్యతో గొడవపడి.. కూతుర్ని నరికేశాడు!! - Sakshi

భార్యతో గొడవపడి.. కూతుర్ని నరికేశాడు!!

భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని చంపేయడమే కాక, భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. సుబోధ్ సాహు (37) అనే ఈ వ్యక్తి తన కుమార్తె సిమ్రన్ను నరికి చంపేశాడు. ఆ తర్వాత వరుసగా  తన భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ సంఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్లో జరిగింది.

ఇదంతా అయిన తర్వాత అతడు విషం తాగి, సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, ఇరుగు పొరుగులు అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సుబోధ్ ఒక్కడూ కియోంఝర్ జిల్లాలో పనిచేస్తుండగా, మిగిలిన ఉమ్మడి కుటుంబం మొత్తం భువనేశ్వర్లో ఉంటుంది. అతడి భార్య, కుమార్తె కూడా అక్కడే ఉంటారు. అయితే, వేరు కాపురం పెట్టాలని ఎప్పటినుంచో అతడి భార్య గొడవ పెడుతోంది. కానీ అలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయన్న సుబోధ్.. ఇదే విషయంలో గొడవపడి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement