quarrel with wife
-
పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది! క్షణికావేశంలో..
ఆనందపురం (భీమిలి): క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. భార్యాభర్తల మధ్య జరిగిన వాదోపవాదాలు తారాస్థాయికి చేరి హత్యకు పురిగొల్పాయి. పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది. మండలంలోని శొంఠ్యాంలో శనివారం మధ్యాహ్నం జరిగిన హత్య ఘటన రాత్రి వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన పంతుల సూర్య తీర్ధ ప్రసాద్ 20 ఏళ్ల కిందట మండలంలోని శొంఠ్యాం గ్రామానికి వలస వచ్చారు. ఆయనకు విశ్వనాథశాస్త్రి అనే కుమారుడు, వెంకట లలితాదేవి(35) అనే కుమార్తె ఉన్నారు. కాగా వెంకట లలితాదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు కలిగిన తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయారు. మళ్లీ ఎనిమిదేళ్ల కిందట విజయనగరానికి చెందిన ఆండ్ర రవికుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, కుమారుడుతో వెంకట లలితాదేవి శొంఠ్యాంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలు స్థానికంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడే వారని స్థానికులు అంటున్నారు. శనివారం ఆ దంపతుల పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో పెళ్లి రోజునాడు కూడా భర్త తనకు అచ్చటా, ముచ్చటా చూడలేదని సరదాగా కనీసం బయటకు కూడా తీసుకెళ్లలేదని వెంకట లలితాదేవి భర్తతో గొడవ పడింది. ఇంటి వద్దే ఉన్న వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని ఆపుకోలేని రవికుమార్ సుత్తితో లలితాదేవి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయింది. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన జరిగిన తర్వాత రవికుమార్ పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రవి చేరుకుని విచారణ జరిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే.. -
భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
మనోహరబాద్(తూప్రాన్): భార్య కాపురానికి రావడంలేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చెట్లగౌరారంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెట్ల గౌరారం గ్రామానికి చెందిన డ్రైవర్ బాబర్(30)తో తూప్రాన్‌కు చెందిన నూర్జహాన్ బేగంతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలలుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. భర్తతో గొడవపడి నూర్జహాన్ బేగం పుట్టింకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాబర్ మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈనెల 2న డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంటిలో చెప్పి తిరిగిరాలేదు. మక్సాని కుంటబావిలో ఆదివారం శవమై తేలాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. మృతుడి తండ్రి మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యతో వాదించలేక నాలుక కోసుకున్న భర్త
లక్నో: తరచూ భార్యతో గొడవ.. ఇంటికొస్తే చాలు రోజు పేచీనే. దీంతో ఆమె తీరుతో విసుగు చెందాడు. అయినా కూడా ఆ భర్త పుట్టింటికి వెళ్లిన భార్యను పిలిచి కలిసి ఉందామని ప్రేమగా కోరాడు. కానీ ఆమె వినిపించుకోకుండా మళ్లీ గొడవకు దిగింది. ఆమెతో వాదించడమే వేస్ట్.. అని భావించి ఇక ఆమెతో వాదన దిగకుండా ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు ఆ భర్త. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాన్పూర్ జిల్లా గోపాల్పూర్ గ్రామంలో నిషా, ముకేశ్ భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే భార్య కొన్ని రోజులుగా భర్తతో గొడవపడుతోంది. దీంతో విబేధించి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం భార్యకు ఫోన్ చేసి ముకేశ్ పిలుపించుకున్నాడు. వచ్చాక మళ్లీ కలిసి జీవించుదామని కోరాడు. అయితే ఆమె అప్పుడు కూడా గొడవ పెట్టుకుంది. దీంతో అతడు విసుగు చెంది వెంటనే బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు లబోదిబోమన్నాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని కాన్పూర్‌లోని పెద్దాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. చదవండి: అమ్మ, అక్కను చితకబాదిన యువకుడు -
భార్యతో గొడవపడి.. కూతుర్ని నరికేశాడు!!
భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని చంపేయడమే కాక, భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. సుబోధ్ సాహు (37) అనే ఈ వ్యక్తి తన కుమార్తె సిమ్రన్ను నరికి చంపేశాడు. ఆ తర్వాత వరుసగా తన భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ సంఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. ఇదంతా అయిన తర్వాత అతడు విషం తాగి, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, ఇరుగు పొరుగులు అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సుబోధ్ ఒక్కడూ కియోంఝర్ జిల్లాలో పనిచేస్తుండగా, మిగిలిన ఉమ్మడి కుటుంబం మొత్తం భువనేశ్వర్‌లో ఉంటుంది. అతడి భార్య, కుమార్తె కూడా అక్కడే ఉంటారు. అయితే, వేరు కాపురం పెట్టాలని ఎప్పటినుంచో అతడి భార్య గొడవ పెడుతోంది. కానీ అలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయన్న సుబోధ్.. ఇదే విషయంలో గొడవపడి ఈ దారుణానికి ఒడిగట్టాడు. -
భార్యతో గొడవ వల్లే ఆత్మహత్య
టాటా మోటార్స్ ఎండీగా పనిచేసిన కార్ల్ స్లిమ్ మొన్నామధ్య ఆత్మహత్య చేసుకున్నారు గుర్తుందా? అందుకు కారణాలేంటో తెలియక అప్పట్లో అంతా ఊరుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసింది. భార్యతో గొడవపడిన తర్వాత.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 'కుటుంబంలో కలతలు' అంటూ ఆమె రాసిన మూడు పేజీల లేఖను థాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ హోటల్లో వీరిద్దరు విడిది చేసిన గదిలో ఉన్న ఈ లేఖ పోలీసులకు చిక్కింది. తామిద్దరం గొడవ పడినట్లు ఆ లేఖలో శాలీ స్లిమ్ రాశారని పోలీసు అధికారి సామ్యట్ బుయక్యూ తెలిపారు. దాంతో పాటు ఆయనది హత్య కాదని కూడా తేలిపోయిందని చెప్పారు. తాము బసచేసిన షాంగ్రి-లా హోటల్లోని 22వ అంతస్థు కిటికీ నుంచి కిందకి దూకి స్లిమ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కిటికీ చిన్నది కావడంతో, అందులోంచి ఎవరైనా పొరపాటున జారి కిందపడటం అసాధ్యమని, కావాలనే దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. అంత ఎత్తునుంచి కిందకి దూకడం వల్ల ఆయన కపాలం పగిలిపోయింది. నాలుగో అంతస్థు బాల్కనీలో ఆయన మృతదేహం పడి ఉండగా హోటల్ సిబ్బంది కనుగొన్నారు. టాటా మోటార్స్ సంస్థకు చెందిన థాయ్ సబ్సిడరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు స్లిమ్ బ్యాంకాక్ వెళ్లారు. ఆయన భార్య రాసిన లేఖను పోలీసులు దర్యాప్తు కోసం థాయ్ భాషలోకి అనువదిస్తున్నారు. ఒకానొక సమయంలో టాటా మోటార్స్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోతున్న సమయంలో బాధ్యతలు చేపట్టి, మళ్లీ భారతీయ మార్కెట్లో నిలదొక్కుకునేలా చేసిన ఘనత స్లిమ్దే. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం సంక్షోభంలో ఉన్న సమయంలో కార్ల్ స్లిమ్ తమ సంస్థలో చేరి సమర్థ నాయకత్వం అందించారని, ఆయన మృతి తీరని లోటని టాటా మోటార్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు.