
లక్నో: తరచూ భార్యతో గొడవ.. ఇంటికొస్తే చాలు రోజు పేచీనే. దీంతో ఆమె తీరుతో విసుగు చెందాడు. అయినా కూడా ఆ భర్త పుట్టింటికి వెళ్లిన భార్యను పిలిచి కలిసి ఉందామని ప్రేమగా కోరాడు. కానీ ఆమె వినిపించుకోకుండా మళ్లీ గొడవకు దిగింది. ఆమెతో వాదించడమే వేస్ట్.. అని భావించి ఇక ఆమెతో వాదన దిగకుండా ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు ఆ భర్త. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..
కాన్పూర్ జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో నిషా, ముకేశ్ భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే భార్య కొన్ని రోజులుగా భర్తతో గొడవపడుతోంది. దీంతో విబేధించి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం భార్యకు ఫోన్ చేసి ముకేశ్ పిలుపించుకున్నాడు. వచ్చాక మళ్లీ కలిసి జీవించుదామని కోరాడు. అయితే ఆమె అప్పుడు కూడా గొడవ పెట్టుకుంది. దీంతో అతడు విసుగు చెంది వెంటనే బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు లబోదిబోమన్నాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని కాన్పూర్‌లోని పెద్దాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
చదవండి: అమ్మ, అక్కను చితకబాదిన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment