tongue cut
-
చనువుగా ఉన్న సమయంలో భర్త నాలుక కొరికిన భార్య..!
కర్నూలు: గొడవ పడి భర్త నాలుకను భార్య కొరికిన ఘటన తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్టతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన పుష్పావతికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చందూనాయక్తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తండాలోనే నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చందూనాయక్ నాలుకకు తీవ్ర గాయమైంది. చనువుగా ఉన్న సమయంలో భార్యనే భర్త నాలుక కొరికి గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జొన్నగిరి ఎస్ఐ రామాంజినేయులు తెలిపారు. -
అయ్యో నాగరాజా! జ్యోతిష్యుడు చెప్పాడని..
క్రైమ్: దైవ భక్తి మంచిదే. కానీ, ఆ భక్తి ముసుగులో మూఢనమ్మకాల్ని ప్రచారం చేసేవాళ్లను నమ్మడం ఏమాత్రం మంచిదికాదు. పైగా బాగా చదువుకున్న వాళ్లు కూడా ఆ మత్తులో మోసపోతుండడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి మోసపోయి జేబు గుల్లజేసుకోవడంతోనే ఆగిపోలేదు. గుడ్డిగా జ్యోతిష్యుడు చెప్పింది చేసి వారంపాటు ఆస్పత్రి పాలయ్యాడు. తమిళనాడు ఈరోడ్ జిల్లా, కోపిచెట్టిపాళయం సత్తి రోడ్డు నివాసి రాజా(54) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన కలలో పాములు కనిపిస్తున్నాయట. ఆ దెబ్బకి ఆయన నిద్రపోవడమే మానేశాడు. నిద్రలేమితో ఆయన ఆరోగ్యం దెబ్బ తింటూ వచ్చింది. ఈ క్రమంలో.. ఓ జ్యోతిష్యుడ్ని కలిశాడు. తనకు నాగదోషం ఉందని చెప్పాడు. అదే అదను అనుకున్నాడేమో.. దోష పరిహారానికి ప్రత్యేక పూజలు చేయాలని ఏర్పాట్ల కోసం గట్టిగా డబ్బులు తీసుకున్నాడు. సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి.. నాగదోష పరిహార పూజలు చేయించాడు. ఆఖరి ఘట్టంగా.. తన వెంట బోనులో తెచ్చిన ఓ రస్సెల్ వైపర్ పామును రాజా ముందు ఉంచి.. మూడుసార్లు పాములా నాలుక ఆడించమన్నాడు. ఆయన నాలుక ఆడిస్తుండగా.. జ్యోతిష్యుడు ఏవో మంత్రాలు వల్లించాడు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి నాలుక ఆడించడగా.. బోనులోంచి సర్రుమని తల బయట పెట్టిన పాము, రాజా నాలుక మీద కాటేసింది. ఆ దెబ్బకు నొప్పితో విలవిలలాడిపోయాడు ఆయన. ఇది గమనించిన ఆ ఆలయ పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి.. రాజాను రక్షించే ఉద్దేశంతో ఓ కత్తితో నాలుక కత్తిరించాడు. ఆలస్యం జరగకపోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి. కానీ, నాలుక పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాము విషానికి అతని నాలుక కణజాలం దెబ్బతింది. అయినప్పటికీ.. నాలుకను తిరిగి విజయవంతంగా సర్జరీ ద్వారా అతికించారు. వాపు తగ్గిన తర్వాత ఆయన ఇప్పుడు సాధారణంగా మాట్లాడగలిగే స్థితికి చేరడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్‌ను కలిగి ఉండడం, అంతకు మించి మోసం చేయడం తదితర నేరాల కింద ఆ జ్యోతిష్యుడిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. -
ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.. నాలుక కోసుకున్నాడు..
సాక్షి, హోసూరు(కర్ణాటక): మనోవేదనతో ఓ కార్మికుడు నాలుక కోసుకున్నాడు. ఈఘటన హోసూరులో చోటు చేసుకుంది. వసంతనగర్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగేషన్(58)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మురుగేషన్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మురుగేషన్ కత్తి తీసుకొని నాలుకను కోసుకున్నాడు. గమనించిన పిల్లలు నాలుకను ప్లాస్టిక్ కవర్లో భద్రపరచి తండ్రిని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుకను అతికించడం సాధ్యం కాదని, అయితే మాట్లాడేందుకు ఇబ్బంది ఉండదని చెప్పి వైద్యం చేస్తున్నారు. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
స్టాలిన్ వీరాభిమాని: నాలుక కోసుకుని అమ్మవారికి నైవేద్యం
చెన్నె: సినీ, రాజకీయ ప్రముఖుల కోసం తమిళనాడు ప్రజలు చచ్చిపోయేంత అభిమానం చూపిస్తారు. తమిళుల అభిమానం మామూలుగా ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో ఓ మహిళా అభిమాని చేసిన పని చూస్తే ఇదేం పిచ్చిరా అనక మానరు. డీఎంకే పార్టీ గెలిచిందని ఓ మహిళ తన నాలుకను కోసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది. అలా చేస్తానని ఎన్నికల ముందు మొక్కు తీసుకుందంట. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయి డీఎంకే 133 సీట్లు సంపాదించి ఇంకా తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 159 స్థానాలతో అధికారంలోకి వస్తోంది. దీంతో 32 ఏళ్ల వనిత తెగ సంబరపడిపోయింది. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుండడంతో సోమవారం ఉదయం వెంటనే ముత్తలమ్మాన్ అమ్మవారి ఆలయానికి వెళ్లింది. అయితే కరోనా నేపథ్యంలో ఆలయం మూసివేసి ఉండడంతో గేటు బయట నిల్చుని తన నాలుక కోసుకుంది. తెగిన నాలుకను అమ్మవారికి నైవేద్యంగా గేటు బయట పెట్టేసి వెళ్లిపోయింది. ఆమె నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. డీఎంకే గెలవాలని.. గెలిస్తే తన నాలుక కోసుకుంటానని ముత్తలమ్మాన్ అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనిత -
భార్యతో వాదించలేక నాలుక కోసుకున్న భర్త
లక్నో: తరచూ భార్యతో గొడవ.. ఇంటికొస్తే చాలు రోజు పేచీనే. దీంతో ఆమె తీరుతో విసుగు చెందాడు. అయినా కూడా ఆ భర్త పుట్టింటికి వెళ్లిన భార్యను పిలిచి కలిసి ఉందామని ప్రేమగా కోరాడు. కానీ ఆమె వినిపించుకోకుండా మళ్లీ గొడవకు దిగింది. ఆమెతో వాదించడమే వేస్ట్.. అని భావించి ఇక ఆమెతో వాదన దిగకుండా ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు ఆ భర్త. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాన్పూర్ జిల్లా గోపాల్పూర్ గ్రామంలో నిషా, ముకేశ్ భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే భార్య కొన్ని రోజులుగా భర్తతో గొడవపడుతోంది. దీంతో విబేధించి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం భార్యకు ఫోన్ చేసి ముకేశ్ పిలుపించుకున్నాడు. వచ్చాక మళ్లీ కలిసి జీవించుదామని కోరాడు. అయితే ఆమె అప్పుడు కూడా గొడవ పెట్టుకుంది. దీంతో అతడు విసుగు చెంది వెంటనే బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు లబోదిబోమన్నాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని కాన్పూర్‌లోని పెద్దాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. చదవండి: అమ్మ, అక్కను చితకబాదిన యువకుడు -
యువతిపై అత్యాచారం.. నాలుక కోసి..
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతంలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్రాస్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో ఉన్న ఆ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఈ ఘటన సెప్టెంబర్ 14న చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయని.. నాలుకను కూడా కోసినట్లు యువతిని పరీక్షించిన డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉందని సౌకర్యాలున్న పెద్దాసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని సూచించారు. యువతి షెడ్యూల్ కులానికి చెందినది కావడం.. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు అగ్రవర్ణ కులానికి చెందినవారు కావడంతోనే మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. అయితే యువతి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు తొలుత తమకు సహకరించలేదని.. ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని యువతి సోదరుడు ఆరోపించారు. యువతి సోదరుడు మాట్లాడుతూ.. నా సోదరి తల్లితో పాటు పొలం పనులు చేయడానికి వెళ్లింది. మా పెద్దన్న అప్పటికే గడ్డి కోసుకొని ఇంటికి వచ్చాడు. అయితే గడ్డంతా ఏపుగా పెరగడంతో మా అమ్మ, చెల్లి దానిని కోసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మా చెల్లి పొలం పనులు చేస్తుండగా నలుగురు యువకులు వచ్చి ఆమె తలకు ఉన్న దుప్పటను లాగి మెడకు చుట్టి అక్కడినుంచి లాక్కెల్లారు. ఆ తర్వాత ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డ ఆ నలుగురు ఆమెపై దాడి చేసి తమ పేర్లు ఎక్కడ బయటపెడుతుందోనని బయపడి నాలుకను కోసేశారు. నా చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డవారు మా ఊరి యువకులే అని తర్వాత తెలిసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువతి సోదరుడు ఆవేదనతో పేర్కొన్నాడు. -
ఆ కేంద్రమంత్రి నాలుక కట్ చేస్తే.. !
సాక్షి, బెంగళూరు(కలబుర్గి): కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.1 కోటి నగదు బహుమానం అందిస్తామంటూ కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్ పట్టేదార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనవరి 26వ తేదీ లోపు కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించి తమకు అందించిన వ్యక్తులకు కోటి రూపాయల నగదు బహుమానం అందిస్తామంటూ షరతు విధించారు. ప్రస్తుతం దేశ ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్న తరుణంలో ఎన్నికల్లో ఓట్ల కోసం కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అందుకే ఆయన నాలుక కత్తిరించిన వ్యక్తులకు బహుమానం ప్రకటించామంటూ తమ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తూ అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలు చేశారని, రాజ్యాంగాన్ని విమర్శించే వారెవరైనా సరే దేశ ద్రోహులేనని అన్నారు. ఇటీవల అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య వైషమ్యాలను రగిలిస్తున్న కేంద్ర మంత్రి హెగ్డేపై తక్షణం ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని గురుశాంత్ పట్టేదార్ డిమాండ్ చేశారు. -
ఏజెంట్ నాలుకను కత్తిరించేశారు..
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. గత శుక్రవారం జరిగిన పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు ఎన్నికల ఏజెంట్ నాలుకను కత్తిరించారు. ఈ ఘటనపై పోలీసులు 11 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. రాణీగంజ్ ప్రాంతంలోని ప్రజాపతి పోలింగ్ బూత్‌లో స్థానిక సంస్థ మాజీ అధ్యక్షుడు రమాకాంత్ తన కుమారులతో కలసి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న ముస్తక్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రమాకాంత్, ఆయన కొడుకులు.. ముస్తక్ నాలుకను కత్తిరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉమర్ ఫిర్యాదు మేరకు రమాకాంత్, ఆయన కొడుకులు దినకర్, దుర్గేష్, వినోద్, ఆదర్శ్, బబ్లూతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. -
నాలుక కోసుకున్న క్రికెట్ అభిమాని
వేలూరు : ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్జట్టు విజయం సాధించాలని కోరుతూ తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడికి చెందిన ఓ యువకుడు గురువారం నాలుక కోసుకున్నా డు. వేలూరు జిల్లా వానియంబాడి మిడె న్స్ కుప్పం గ్రామానికి చెందిన సుధాకర్(27) భవన నిర్మాణ కార్మికుడు. ఇతను క్రికెట్ అభిమాని. గురువారం ఉదయం జోలార్‌పేటలోని అత్తగారింటికి వె ళ్ళిన సుధాకర్ అక్కడున్న పొన్నేరి వేడియప్పన్ ఆలయం వద్దకు వెళ్లి బ్లేడుతో నాలుక కోసుకుని ఆలయంలోని పీఠంలో ఉంచాడు. దీన్ని గమనించిన భక్తులు ఆ యువకుని బంధువులకు సమాచారం అందించారు. అప్పటికే సుధాకర్ సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ నాలుకను స్థాని కులు ఆసపత్రికి తీసుకువచ్చారు. ఎండకు వాడి పోయి ఉన్న నాలుకను వేలూరులోని వైద్య బృందం అధునూతన పద్ధతిలో ఆపరేషన్ చేసి అమర్చింది. సుధాకర్ మాట్లాడుతాడా అనే విషయం చెప్పడానికి కొద్ది రోజులు పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. క్రికెట్ పోటీల్లో భారత్ టీమ్ గెలవాలని నాలుక కోసుకున్నట్టు సుధాకర్ పైపర్‌పై రాసి వివరించాడు. ఇదిలా ఉండగా కుటుంబ సమస్యల వల్ల కూడా సుధాకర్ ఇలా చేసి ఉండవచ్చునని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సుధాకర్ కత్తిని నోటిలో పెట్టుకుని చెట్టు ఎక్కుతున్న సమయంలో జారి నాలుక తెగిపోయినట్టు కేసు నమోదు చేశారు.