
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హోసూరు(కర్ణాటక): మనోవేదనతో ఓ కార్మికుడు నాలుక కోసుకున్నాడు. ఈఘటన హోసూరులో చోటు చేసుకుంది. వసంతనగర్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగేషన్(58)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మురుగేషన్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం మురుగేషన్ కత్తి తీసుకొని నాలుకను కోసుకున్నాడు. గమనించిన పిల్లలు నాలుకను ప్లాస్టిక్ కవర్‌లో భద్రపరచి తండ్రిని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుకను అతికించడం సాధ్యం కాదని, అయితే మాట్లాడేందుకు ఇబ్బంది ఉండదని చెప్పి వైద్యం చేస్తున్నారు.
చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు