frustation
-
చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోజురోజుకు చిత్రాచిత్రంగా, పట్టరాని అసహనంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన విషయాలు గమనిస్తే ఆయన ఏదో తేడాగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం సహజంగానే వస్తుంది. చంద్రబాబు అన్న మాటలు ఏమిటో చూడండి. దొంగాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం రండి.. తాడోపేడో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి.. అని అంటున్నారంటే ఏమని అనుకోవాలి. ఇది అసలు ఒక సీనియర్ నేత మాట్లాడవలసిన తీరేనా!పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అర్దం, పర్దం లేకుండా ఆవేశపడడం ఒక ఎత్తు అయితే రండి.. కొట్టుకుందాం అని అంటున్నారంటే ఏమనాలి? ఆయనకు నిజంగా అంత భయం లేకపోతే తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోస్‌కు చెందిన వంద మంది భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. ఆయన కూడా తనకు ఆస్థాయి భద్రత అవసరం లేదని, సాధారణ భద్రత సరిపోతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఆయనకు భద్రత వద్దనడం లేదు. కాని తానేమో పూర్తి భద్రత వలయంలో ఉండి, టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్న తీరు చాలా దారుణంగా ఉంది. గన్నవరంలో ఆయన పర్యటనలో స్థానికులు పెద్దగా పాల్గొనలేదట. ఆయనేదో నాలుగు డైలాగులు చెప్పి, యధా ప్రకారం ముఖ్యమంత్రిపైన, వైసీపీపైన దూషణలకు పాల్పడి నోటి తీట తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు. అన్ని చోట్ల పోలీసులను బెదిరించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం మద్దతుదారులుగా పోలీసులు మారకపోతే ఆయన ఊరుకోరట. ప్రభుత్వం వైపు ఉండకూడదట. నిజానికి గన్నవరం లో జరిగిన ఘటనలో పోలీసులు తమ బాధ్యత నిర్వహించకుండా ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేది. అలా జరగలేదన్నదా చంద్రబాబు బాద అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తీవ్రమైన ఘటన జరిగి ఉంటే, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రచారం మరింతగా చేయవచ్చన్నదా ఆయన ఆలోచన అనిపిస్తుంది. ఒకవైపు టిడిపి కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిని దూషించడం అన్నిటికి చంద్రబాబే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన ఒక టార్గెట్ పెట్టుకుని టీడీపీ వారిని రెచ్చగొడుతున్నారు. మీరేమైనా చేయండి, కేసుల సంగతి మేం చూసుకుంటాం అని ఆయన గతంలోనే చెప్పారు. పోలీసులను ఏకంగా సంఘ విద్రోహ శక్తులంటూ ఇష్టారాజ్యంగా అనపర్తిలో, ఇతర చోట్ల మాట్లాడారు. తద్వారా తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులపైన దాడులు చేయాలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. చుట్టూ భద్రతా వలయం ఉంది కనుక తన జోలికి రావాలంటే అంత ఈజీకాదని ఆయన భావన కావచ్చు. అందువల్ల ఆయన అందరిని రెచ్చగొట్టి తాను మాత్రం సేఫ్ గా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు తనను సీబీఐ అరెస్టు చేస్తుందని, అందరు వచ్చి తన చుట్టూ ఉండాలని అంటుండేవారు. ఇప్పుడు ఏమో తేల్చుకుందాం రండి, లగ్నం పెట్టుకుందాం రండి అంటున్నారు. ఆ లగ్నానికి ఆయన పార్టీ నేత పట్టాభి వంటివారిని కూడా తీసుకువస్తారేమో తెలియదు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. పట్టాభి పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించి అరెస్టు అయిన తర్వాత మామూలుగా అయితే వెంటనే బెయిల్ పిటిషన్ వేసేవారు. అలాంటిది ప్రస్తుతం మాత్రం అంత తొందరేమీ లేదని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిద్వారా సానుభూతి సంపాదించాలన్నది టీడీపీ ప్లాన్ అట. అంటే తన దిక్కుమాలిన రాజకీయం కోసం తన పార్టీవారిని సైతం బలి చేయడానికి చంద్రబాబు వెనుకాడరా అని టీడీపీలోనే చర్చ జరుగుతోందట. వైఎస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకుగాను ఆయనను అయితే జైలులో పెట్టాలి.. లేదా పిచ్చాసుపత్రిలో చేర్చాలి అని అన్నారు. చంద్రబాబు లగ్నం పెట్టాలని అంటున్నారని అందుకు తాము సిద్దమేనని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను వదలిపెట్టి రావాలని నాని సూచించారు. మరి ఇందుకు చంద్రబాబు సిద్దపడతారా? ఇవేవి జరిగేవి కావు. కేవలం కార్యకర్తలను దాడులకు పురికొల్పడానికే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు కు బాలకృష్ణ పూనినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగానే బాలకృష్ణకు సినిమా డైలాగులు తప్ప రాజకీయ డైలాగులు చెప్పడం అంతగా చేతకాదు. ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన కోవలోకి చంద్రబాబు వచ్చారన్నది నాని అభిప్రాయం కావచ్చు. ఇక వివేకా హత్య కేసుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఇన్నీ ,అన్నీ కావు.. వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా! మరి అప్పుడు తన ప్రభుత్వంలోని పోలీసు అదికారులు విచారణ సరిగా చేయలేకపోయారని అది తమ ప్రభుత్వ అసమర్థత అని ఒప్పుకుంటున్నారా? ఎలాగొలా ముఖ్యమంత్రి జగన్‌పైన బురద పూయాలని నానా పాట్లు పడుతున్నారు. సిబిఐ తీరు కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది. అన్ని కోణాలలో ఎందుకు విచారణ చేయడం లేదో తెలియడం లేదని ఆ కేసును పరిశీలిస్తున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్ కేసులలో అచ్చంగా టిడిపి, కాంగ్రెస్ నేతలు సూచించిన విధంగా సీబిఐ డీల్ చేసిందని ప్రజలంతా నమ్మారు. సీబీఐ విచారణను జనం నమ్మలేదు కాబట్టే 2019లో ప్రజలంతా జగన్ కు పట్టం కట్టారు. ఇప్పుడు కూడా సిబీఐ అలాగే అతిగా ,ఏకపక్షంగా దర్యాప్తు చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడకపోగా, అది మరింత నష్టం చేసే అవకాశం ఉందని కొందరు ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది కార్యక్రమాల ఎజెండానుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబుతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా విపరీతంగా శ్రమిస్తోంది. అదికారంలోకి వస్తే తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతరత్రా జగన్ ను ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చా అని ఆలోచించి కుట్ర ప్లాన్ లను ముందుకు తీసుకు వస్తున్నది. ఇలాంటివి ఫలిస్తాయని అనుకోవడం భ్రమే అవుతుంది. ప్రజలంతా అమాయకులని భావిస్తే పప్పులో కాలేసినట్లే అవుతుందని చెప్పవచ్చు. -హితైషి చదవండి: హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి? -
Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!
ఇవే ఆఖరు ఎన్నికలంటూ తరచుగా ప్రకటనలు చేస్తోన్న చంద్రబాబుకు అసలు మనసులో ఏముంది? ఎందుకు ఆఖరు ఎన్నికలని చెబుతున్నారు? ఇంతకీ ఆఖరు ఎన్నికలు రాష్ట్రానికా? లేక చంద్రబాబుకా? ఇవన్నీ ఆయన సొంత పార్టీ తెలుగుదేశంలోనే తమ్ముళ్లకు వస్తోన్న సందేహాలు. వీటికి జవాబుగా ఆయన తన మదిలో మాటను బహిరంగంగా ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు మాటలు ►రోజురోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుంటే.. మీరు అక్కడ పోరాడకుండా.. చెప్పిన పని చేయకుండా.. ఇక్కడికి వచ్చి నాపై ప్రెషర్ చేస్తారా? ఎనకాల ఎల్లో ఉండగా.. పాడాలి అబద్దాల పాట టిడిపి గ్రూప్‌ల్లో సర్క్యులేట్ అవుతోన్న ఈ వీడియో 13సెకన్ల నిడివి ఉంది. అందులో చంద్రబాబు.. సొంత పార్టీ నేతలపై రుసరుసలాడుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సొంత పార్టీకి అంత సీన్ లేదన్న విషయం తెలిసిన చంద్రబాబు.. ఆ విషయం దాచిపెట్టి ఎల్లోమీడియా సహకారంతో జనాల్లో బాకాలు ఊదుతున్నారని తమ్ముళ్లు అనుకుంటున్నారు. పార్టీ లేదు బొక్కా లేదు.. అని అచ్చన్న చెప్పినప్పుడే సగం అర్థమయిందని, ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోందనుకుంటున్నారు. చదవండి: (ఆయుష్ ఔషధాల ప్రమాణాల నియంత్రణకు చర్యలు) -
ఆ ఫ్రస్టేషన్ తోనే అబ్బాకొడుకులిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి రాంబాబు
-
ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.. నాలుక కోసుకున్నాడు..
సాక్షి, హోసూరు(కర్ణాటక): మనోవేదనతో ఓ కార్మికుడు నాలుక కోసుకున్నాడు. ఈఘటన హోసూరులో చోటు చేసుకుంది. వసంతనగర్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగేషన్(58)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మురుగేషన్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మురుగేషన్ కత్తి తీసుకొని నాలుకను కోసుకున్నాడు. గమనించిన పిల్లలు నాలుకను ప్లాస్టిక్ కవర్లో భద్రపరచి తండ్రిని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుకను అతికించడం సాధ్యం కాదని, అయితే మాట్లాడేందుకు ఇబ్బంది ఉండదని చెప్పి వైద్యం చేస్తున్నారు. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
కొంపముంచుతున్న ‘ఒత్తిడి’!
బిజీ లైఫ్ కొందరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అనేక కారణాలతో ఒత్తిడికి గురై భార్యాభర్తల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఇవి విడాకుల కోసం కోర్టు మెట్ల వరకు తీసుకెళ్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, ఆర్థిక స్వాతంత్య్రం రావడం, భేషజాలు పెరిగిపోతుండటంతో ‘కొంప’ మునిగే పరిస్థితులు దాపురిస్తున్నాయి. లబ్బీపేట (విజయవాడ తూర్పు) :గుణదలకు చెందిన వెంకటేష్, శ్రీసుధ భార్యభర్తలు. మహేష్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. శ్రీసుధ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఇద్దరూ కలిపి నెలకు రూ.40 వేలు సంపాదించుకుంటున్నారు. ఉద్యోగరీత్యా షిప్ట్ డ్యూటీలతో ఇద్దరూ ఇంట్లో కలిసి ఉండేది చాలా తక్కువే. ఇటీవల కాలంలో వారు తీవ్ర అసహనానికి, వత్తిడికి గురవుతున్నారు. దీంతో చిన్న విషయాలకే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంపత్య జీవనంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇటీవల ఇద్దరూ కలిసి మానసిక వైద్యుడిని సంప్రదించారు. గాంధీనగర్‌కు చెందిన యువకుడు ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది కిందట పెళ్లయింది. వారు ఉండే అపార్ట్మెంట్ పక్క ఫ్లాట్ వాళ్లు కారులో తిరగడంతో, తాము కూడా కారు కొనాలని తరచూ భార్య అడగడం ప్రారంభించింది. ఇలా ప్రతిదీ ఇతరులతో పోల్చుకుంటూ ఉండటంతో ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు తలెత్తాయి. ఫలితంగా విడాకులు కోరే పరిస్థితి దాపురించింది. ..కాలంతో పాటు పరిగెడుతున్న సిటీ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. సిటీలో మధ్య తరగతి వర్గాలు జీవనం సాగించాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దంపతులిద్దరూ ఉద్యోగులు కావడం, విధి నిర్వహణలో ఒత్తిడితో చికాకు, కోపం పెరగడం దాంపత్య జీవనంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. మరో వైపు సెల్‌ఫోన్, కంప్యూటర్లు కూడా భార్యాభర్తల మధ్య వివాదాలకు తెర లేపుతున్నాయి. భర్త తనతో కన్నా కంప్యూటర్, సెల్‌ఫోన్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడని, ఎవరెవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నాంటూ ఐదు నెలల కిందట పెళ్లైన ఓ యువతి విడాకులకు పిటిషన్ దాఖలు చేసిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. నూతన దంపతుల్లో లైంగిక సమస్యలు తలెత్తుతుండగా, భార్యాభర్తల మధ్య పంతాలు (ఇగోస్), వ్యక్తిత్వ వికాస లోపం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి. అంతరించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఇళ్లలో అమ్మమ్మ, బామ్మలు, తాతయ్యలు ఉంటే వారే ఇలాంటి సమస్యలను పరిష్కరించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి విభేదాలు పోలీసు కేసుల వరకూ దారి తీస్తున్నాయి. అక్కడ వరకూ వెళ్లిన తర్వాత కానీ తమ తప్పును తెలుసుకుని మనస్థాపం చెందుతూ కౌన్సిలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నగరంలో భార్యాభర్తల మధ్య సర్ధుబాటు సమస్యలతో మానసిక వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. నెలలో నగరంలోని మానసిక వైద్యులు, కౌన్సిలర్స్‌ను ఇలాంటి సమస్యలతో వంద మందికిపైగా ఆశ్రయిస్తున్నట్లు చెపుతున్నారు. ఆత్మీయ అనుబంధాలు దెబ్బ తింటున్నాయి ప్రస్తుతం యంగేజ్ దంపతుల్లో ఆత్మీయ అనుబంధాలు దెబ్బ తింటున్నాయి. పెళ్లైన ఆరేడు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తమ జీవితాలను ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువైంది. డబ్బు సంపాదనపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇతర ఆకర్షణలతో దాంపత్య జీవనం దెబ్బ తింటోంది. భార్యాభర్తల మధ్య సెక్స్ రిలేషన్స్ సవ్యంగా ఉంటే ఇగోలు పోవడంతో పాటు, ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో దాంపత్య జీవనం సరిగా లేకపోవడంతో భార్యాభర్తల మధ్య వివాదాలు. అపోహలకు తావిస్తుంది.– డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి,మానసిక వైద్య నిపుణులు కౌన్సెలింగ్తోసమస్యలు పరిష్కారం భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలకు కౌన్సెలింగ్‌తో పరిష్కారం లభిస్తుంది. ముందుగా ఇద్దరి మధ్య ఇగోలు ఉండకూడదు. ఇద్దరూ సమానం అనే భావన ఉన్నప్పుడు దాంపత్య జీవనం సవ్యంగా ముందుకు సాగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులైన వారిలోనే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. అందుకు సర్ధుబాటు కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోవడంతో తప్పొప్పులను చెప్పే వారే లేక కౌన్సిలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో భార్యార్యభర్తల మధ్య వివాదాలు పెరిగాయి.– గర్రే శంకర్రావు,కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ -
అన్నదమ్ముల దారుణహత్య
కళ్లముందే కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటనను చూసిన ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు.. బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.. పాతకక్షల నేపథ్యంలో అన్నదమ్ములను తోటి కులస్తులే హత్య చేయడంతో గ్రామస్తులు భయం గుప్పిట కాలం వెల్లదీస్తున్నారు.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.. బాలానగర్: పాతకక్షలకు ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. భార్యాపిల్లలు వేడుకున్నా వారి కళ్లముందే తోటికులస్తులే దారుణంగా మాతమార్చారు. స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బాలానగర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దఎల్లయ్య (48), చిన్నఎల్లయ్య (42), కృష్ణయ్య అన్నదమ్ములు. వీరిలో పెద్దఎల్లయ్య ఏడేళ్లక్రితం సొంత బావ హన్మయ్యను హత్యచేసి జైలుకెళ్లాడు. రెండేళ్లకు బయటకు వచ్చిన తర్వాత అదే గ్రామానికి చెందిన దేవ్లానాయక్ను హత్యచేసి తిరిగి జైలుపాలయ్యాడు. నెల రోజులక్రితమే పెరోల్‌పై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి తమ కులానికి చెందిన ఇంటిపక్కనే ఉన్న వెంకటమ్మ, ఎల్లమ్మ, వెంకటయ్యపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున బాధితుల బంధువులు రాళ్లు, రాడ్‌తో దాడిచేయడంతో పెద్దఎల్లయ్యపై దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని మరో తమ్ముడు కృష్ణయ్య ప్రాణభయంతో వేరేచోటకు వెళ్లి తలదాచుకున్నాడు. పక్కింట్లో ఉన్న చిన్నఎల్లయ్యను బయటికి లాగి దాడిచేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య చెన్నమ్మను కూడా తీవ్రంగా కొట్టడంతో ఆమె గాయపడింది. తమ గ్రామానికి చెందిన కాశయ్య, ఊశయ్య, తిరుపతయ్య, వడ్డె కృష్ణ, రాము లు, కృష్ణయ్య చంపివేసి పారిపోయారని మృతుడు చిన్నఎల్లయ్య కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సంఘటన స్థలాన్ని షాద్‌నగర్ రూరల్‌సీఐ గంగాధర్, ఎస్ఐ మనోజ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటన సంచలనం రేపింది.