బాలానగర్: పాతకక్షలకు ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. భార్యాపిల్లలు వేడుకున్నా వారి కళ్లముందే తోటికులస్తులే దారుణంగా మాతమార్చారు.
కళ్లముందే కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటనను చూసిన ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు.. బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.. పాతకక్షల నేపథ్యంలో అన్నదమ్ములను తోటి కులస్తులే హత్య చేయడంతో గ్రామస్తులు భయం గుప్పిట కాలం వెల్లదీస్తున్నారు.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు..
బాలానగర్: పాతకక్షలకు ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. భార్యాపిల్లలు వేడుకున్నా వారి కళ్లముందే తోటికులస్తులే దారుణంగా మాతమార్చారు. స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బాలానగర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దఎల్లయ్య (48), చిన్నఎల్లయ్య (42), కృష్ణయ్య అన్నదమ్ములు. వీరిలో పెద్దఎల్లయ్య ఏడేళ్లక్రితం సొంత బావ హన్మయ్యను హత్యచేసి జైలుకెళ్లాడు. రెండేళ్లకు బయటకు వచ్చిన తర్వాత అదే గ్రామానికి చెందిన దేవ్లానాయక్‌ను హత్యచేసి తిరిగి జైలుపాలయ్యాడు.
నెల రోజులక్రితమే పెరోల్‌పై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి తమ కులానికి చెందిన ఇంటిపక్కనే ఉన్న వెంకటమ్మ, ఎల్లమ్మ, వెంకటయ్యపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున బాధితుల బంధువులు రాళ్లు, రాడ్‌తో దాడిచేయడంతో పెద్దఎల్లయ్యపై దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని మరో తమ్ముడు కృష్ణయ్య ప్రాణభయంతో వేరేచోటకు వెళ్లి తలదాచుకున్నాడు. పక్కింట్లో ఉన్న చిన్నఎల్లయ్యను బయటికి లాగి దాడిచేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అతని భార్య చెన్నమ్మను కూడా తీవ్రంగా కొట్టడంతో ఆమె గాయపడింది. తమ గ్రామానికి చెందిన కాశయ్య, ఊశయ్య, తిరుపతయ్య, వడ్డె కృష్ణ, రాము లు, కృష్ణయ్య చంపివేసి పారిపోయారని మృతుడు చిన్నఎల్లయ్య కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సంఘటన స్థలాన్ని షాద్‌నగర్ రూరల్‌సీఐ గంగాధర్, ఎస్‌ఐ మనోజ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటన సంచలనం రేపింది.