![TDP Chief Chandrababu Naidu Frustrated On Party Leaders Video Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/13/chandra-babu-naidu.jpg.webp?itok=CYvIAdsG)
ఇవే ఆఖరు ఎన్నికలంటూ తరచుగా ప్రకటనలు చేస్తోన్న చంద్రబాబుకు అసలు మనసులో ఏముంది? ఎందుకు ఆఖరు ఎన్నికలని చెబుతున్నారు? ఇంతకీ ఆఖరు ఎన్నికలు రాష్ట్రానికా? లేక చంద్రబాబుకా? ఇవన్నీ ఆయన సొంత పార్టీ తెలుగుదేశంలోనే తమ్ముళ్లకు వస్తోన్న సందేహాలు. వీటికి జవాబుగా ఆయన తన మదిలో మాటను బహిరంగంగా ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే చక్కర్లు కొడుతోంది.
చంద్రబాబు మాటలు
►రోజురోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుంటే.. మీరు అక్కడ పోరాడకుండా.. చెప్పిన పని చేయకుండా.. ఇక్కడికి వచ్చి నాపై ప్రెషర్ చేస్తారా?
ఎనకాల ఎల్లో ఉండగా.. పాడాలి అబద్దాల పాట
టిడిపి గ్రూప్‌ల్లో సర్క్యులేట్ అవుతోన్న ఈ వీడియో 13సెకన్ల నిడివి ఉంది. అందులో చంద్రబాబు.. సొంత పార్టీ నేతలపై రుసరుసలాడుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సొంత పార్టీకి అంత సీన్ లేదన్న విషయం తెలిసిన చంద్రబాబు.. ఆ విషయం దాచిపెట్టి ఎల్లోమీడియా సహకారంతో జనాల్లో బాకాలు ఊదుతున్నారని తమ్ముళ్లు అనుకుంటున్నారు. పార్టీ లేదు బొక్కా లేదు.. అని అచ్చన్న చెప్పినప్పుడే సగం అర్థమయిందని, ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోందనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment