వేలూరు : ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్‌జట్టు విజయం సాధించాలని కోరుతూ తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడికి చెందిన ఓ యువకుడు గురువారం నాలుక కోసుకున్నా డు. వేలూరు జిల్లా వానియంబాడి మిడె న్స్ కుప్పం గ్రామానికి చెందిన సుధాకర్(27) భవన నిర్మాణ కార్మికుడు. ఇతను క్రికెట్ అభిమాని. గురువారం ఉదయం జోలార్‌పేటలోని అత్తగారింటికి వె ళ్ళిన సుధాకర్ అక్కడున్న పొన్నేరి వేడియప్పన్ ఆలయం వద్దకు వెళ్లి బ్లేడుతో నాలుక కోసుకుని ఆలయంలోని పీఠంలో ఉంచాడు. దీన్ని గమనించిన భక్తులు ఆ యువకుని బంధువులకు సమాచారం అందించారు. అప్పటికే సుధాకర్ సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సుధాకర్ నాలుకను స్థాని కులు ఆసపత్రికి తీసుకువచ్చారు. ఎండకు వాడి పోయి ఉన్న నాలుకను వేలూరులోని వైద్య బృందం అధునూతన పద్ధతిలో ఆపరేషన్ చేసి అమర్చింది. సుధాకర్ మాట్లాడుతాడా అనే విషయం చెప్పడానికి కొద్ది రోజులు పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. క్రికెట్ పోటీల్లో భారత్ టీమ్ గెలవాలని నాలుక కోసుకున్నట్టు సుధాకర్ పైపర్‌పై రాసి వివరించాడు. ఇదిలా ఉండగా కుటుంబ సమస్యల వల్ల కూడా సుధాకర్ ఇలా చేసి ఉండవచ్చునని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సుధాకర్ కత్తిని నోటిలో పెట్టుకుని చెట్టు ఎక్కుతున్న సమయంలో జారి నాలుక తెగిపోయినట్టు కేసు నమోదు చేశారు.
నాలుక కోసుకున్న క్రికెట్ అభిమాని
Published Sat, Mar 28 2015 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM
Advertisement
Advertisement