టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డ్‌ను తుడిచిపెట్టేశాడు.
(ఇది చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!)
రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టాడానికి. కానీ కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డును బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాదిలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది.
Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement.
— rajamouli ss (@ssrajamouli) November 15, 2023
And the KING emerged. 🔥🔥
KOHLI 🙏🏻🙏🏻
Comments
Please login to add a commentAdd a comment