world cup cricket
-
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్‌పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్ (18), మ్యాక్స్‌వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్‌వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డ్‌ను తుడిచిపెట్టేశాడు. (ఇది చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టాడానికి. కానీ కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డును బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాదిలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement. And the KING emerged. 🔥🔥 KOHLI 🙏🏻🙏🏻 — rajamouli ss (@ssrajamouli) November 15, 2023 -
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్ చేశాడు. ఆ రోజున వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్ 10న పన్నున్ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. If this guy was a Palestinian who operated in Canada & was targeting a Western or Israeli airport, Justin Trudeau would have arrested him & banned his organisation But Khalistani terrorists can say & do what they like in Trudeau’s Canada as long as they only target India https://t.co/4ZfZyDzeOr — vir sanghvi (@virsanghvi) November 4, 2023 -
టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన న్యూజిలాండ్.. క్రికెట్‌తో పాటు హాకీలోనూ..!
భారత దేశంలోని చిన్న రాష్ట్రాల జనాభా కంటే తక్కువ జనాభా ఉండే న్యూజిలాండ్ దేశం క్రీడల్లో మన పాలిట కొరకరాని కొయ్యలా మారింది. పురుషుల వరల్డ్‌కప్ హాకీలో నిన్న (జనవరి 22) బ్లాక్ క్యాప్స్ చేతిలో ఊహించని ఎదురుదెబ్బ తిన్న తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ విషయానికొస్తే.. కివీస్ చేతిలో భారత్‌కు ఇలాంటి షాక్‌లు తగలడం షరా మామూలే అయినప్పటికీ.. హకీలో మాత్రం మనకంటే కింది స్థాయి జట్టైన కివీస్ చేతిలో ఇలాంటి ఊహించని పరాభవం ఎదురుకావడం ఇదే మొదటిసారి. సునాయాసంగా క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై కావాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఏమరపాటుగా వ్యవహరించడంతో తగిన మూల్యమే చెల్లించుకున్నారు. చిన్న జట్టే కదా అని తేలిగ్గా తీసుకోవడంతో కివీస్ 3-3 (5-4) తేడాతో (పెనాల్టీ షూటౌట్లో) భారత్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడినప్పటికీ.. నిర్ణీత సమయంలో చేసిన అనవసర తప్పిదాల కారణంగా, పెనాల్టీ షూటౌట్లో ఆఖరి ఛాన్స్‌ను షంషేర్ మిస్ చేయడం కారణంగా భారత్ వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్ హాకీలో కివీస్ చేతిలో ఎదురైన ఈ ఊహించని పరాభవం.. భారత క్రీడాభిమానులకు 2019 వన్డే వరల్డ్‌కప్ (క్రికెట్)లో ఇదే జట్టు చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాజయాన్ని గుర్తు చేసింది. నాటి మ్యాచ్‌లోనూ భారత్ విజయానికి చేరువగా వచ్చినా అదృష్టం కివీస్ వైపే నిలిచింది. ఆ మ్యాచ్‌లో ధోని రనౌట్ అయిన దృశ్యం భారత క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో నేటికీ మెదలుతూనే ఉంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారత్‌కు 240 పరుగుల టార్గెట్ నిర్ధేశించగా, ఛేదనలో తడబడిన భారత్ విజయానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ధోని (50), జడేజా (77), హార్ధిక్ (32) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కివీస్ చేతిలో ఇలాంటి అపజయాలు (క్రికెట్) ఏదో నిన్న మొన్న మొదలయ్యాయని అనుకుంటే పొరబడ్డట్టే. వరల్డ్‌కప్ టోర్నీల్లో ఈ పరాభవాల పరంపర ఎప్పుడో 70ల్లోనే మొదలైంది. 1975, 1979, 1992 వరల్డ్‌కప్‌ల్లో న్యూజిలాండ్.. భారత్‌కు ఇలాంటి షాకులే ఇచ్చింది. అలాగే 2021లో జరిగిన ఐసీసీ తొట్టతొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండ్.. భారత్‌ను భారీ దెబ్బేసింది. -
T20 World Cup 2022: ‘పెర్త్’లో పైచేయి ఎవరిదో?
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆట కట్టించేశాం... ఆపై చిన్న జట్టయిన నెదర్లాండ్స్‌ను ఓడించేశాం... లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్, జింబాబ్వేలతోనే కాబట్టి బెంగ పడాల్సిందేమీ లేదు... అటు రెండు మ్యాచ్‌లు, ఇటు రెండు మ్యాచ్‌ల మధ్య మరో కీలక సమరానికి భారత్ సన్నద్ధమైంది. పటిష్ట జట్టయిన దక్షిణాఫ్రికా మనకు సవాల్ విసురుతోంది. టి20 ప్రపంచకప్‌లో రికార్డు, ఇరు జట్ల మధ్య ఇటీవలి సిరీస్, తాజా ఫామ్... ఎలా చూసినా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా, అనుకూల పిచ్‌పై సఫారీ పేస్ బౌలింగ్ బలగం చెలరేగితే గెలుపు అంత సులువు కాబోదు. గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన దక్షిణాఫ్రికా కూడా పాకిస్తాన్‌తో ‘నాకౌట్’ సమస్య రాకుండా ఇక్కడ గెలిచి తమ సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పెర్త్: టి20 ప్రపంచకప్‌లో గత ఆదివారం భారత అభిమానులకు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందిస్తే... ఇప్పుడు మరో ఆదివారం సాయంత్రం అందరికీ అదే స్థాయి వినోదం అందించేందుకు వచ్చేసింది. గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మూడో ‘సూపర్ 12’ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోవడంతోపాటు గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది. అదే జట్టుతో... భారత జట్టు ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులకు ఎలాంటి అవకాశం కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ మినహా ప్రతీ ఆటగాడు తమదైన రీతిలో గత రెండు విజయాల్లో తగిన పాత్ర పోషించారు. దాంతో రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా పంత్ ఆడవచ్చని వినిపించింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేశాడు. పంత్ ఎడంచేతి వాటం అదనపు ప్రయోజనమే అయినా, రాహుల్‌కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో అసలు సవాల్ భారత టాపార్డర్‌కు ఎదురు కానుంది. 140–150 కిలోమీటర్ల వేగంతో పాటు బంతిని స్వింగ్ చేస్తున్న రబడ, నోర్జేలను సమర్థంగా ఎదుర్కోవడంపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయంటే తప్పు లేదు. బౌన్సీ పిచ్‌పై ఆరంభంలోనే కోహ్లి, రోహిత్, సూర్యకుమార్ ఎదురు దాడి చేస్తారా లేక సగం ఇన్నింగ్స్ వరకు జాగ్రత్తగా నిలబడి ఆపై దూకుడు ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరం. మన బౌలర్లలో షమీ మంచి వేగంతో పాటు బౌన్స్ రాబట్టగలడు. భువనేశ్వర్, అర్‡్షదీప్ల వేగం ఎంత వరకు ఇక్కడ పనికొస్తుందో చూడాలి. ప్రత్యర్థి జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు ఎడంచేతి వాటం కావడంతో అక్షర్ పటేల్‌కు బదులు చహల్‌ను ఆడించే అవకాశం ఉన్నా... అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటింగ్ జట్టుకు కీలకమే. బవుమా మినహా... దక్షిణాఫ్రికా ప్రధాన బ్యాటర్లంతా దూకుడుగా ఆడగల సమర్థులే. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన రెండో ఆటగాడైన రిలీ రోసో సమరోత్సాహంతో ఉన్నాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి టి20లోనే అతను శతకం బాదాడు. డికాక్, మిల్లర్ రూపంలో ఇద్దరు మెరుపు బ్యాటర్లు ఉండగా, మార్క్రమ్ మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముక. యువ ఆటగాడు స్టబ్స్ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే వరుసగా విఫలమవుతున్నా, కెప్టెన్ బవుమా విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. పిచ్‌ను బట్టి చూస్తే స్పిన్నర్ షమ్సీని తప్పించి రబడ, నోర్జేకు తోడుగా మూడో పేసర్‌గా ఇన్‌గిడి లేదా జాన్సెన్లలో ఒకరు జట్టులోకి రావడం ఖాయం. పిచ్, వాతావరణం పేస్, బౌన్స్, ఆరంభంలో స్వింగ్... ఇలా పేసర్లకు అన్ని రకాలుగా అనుకూలమైన పిచ్. ఇరు జట్ల బౌలర్లు దీనిని ఎలా వాడుకుంటారనేది కీలకం. శనివారం పెర్త్‌లో వర్షం కురిసినా, మ్యాచ్ రోజు ఇబ్బంది ఉండకపోవచ్చు. టి20 ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్ vs జింబాబ్వే (ఉ.గం. 8:30 నుంచి) పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (మ.గం. 12:30 నుంచి) భారత్ vs దక్షిణాఫ్రికా (సా.గం. 4:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ICC Cricket World Cup: 11 మంది ప్లేయర్లు లేక టోర్నీ మధ్యలోనే నిష్క్రమణ
Canada Under 19 Cricket Team To Fly Back Home: అండర్-19 ప్రపంచ కప్ 2022 టోర్నీపై కరోనా కన్నెర్ర చేసింది. టోర్నీలో పాల్గొనేందుకు కరీబియన్ దీవులకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు క్యూ కట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడి, కోలుకోగా.. తాజాగా కెనడా జట్టులో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ మధ్యలోనే తప్పుకుంది. స్కాట్లాండ్తో ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌కు ముందు కెనడా జట్టుకు ఈ దుస్థితి ఎదురైంది. మహమ్మారి కారణంగా పరిస్థితులు చేజారుతుండటంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ కెనడా ప్రకటించింది. కాగా, టోర్నీ లీగ్ దశలో ఉండగా టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు భారత్ జంబో జట్టుతో ప్రపంచకప్ బరిలోకి దిగడంతో ఆటగాళ్ల కొరత ఏర్పడలేదు. ఈ దశలో ప్రధాన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నా టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఉగాండా, ఐర్లాండ్‌లపై భారీ విజయాలు నమోదు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇవాళ క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న యువ భారత్.. 2019 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతుంది. కాగా, గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. గ్రూప్ 2 నుంచి రెండో బెర్తు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. చదవండి: IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..! -
స్వదేశం చేరుకున్న మొదటి క్రికెటర్
సాక్షి, ముంబై: ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి కంటే ముందు ఓపెనర్ రోహిత్ శర్మ ఇండియాకు వచ్చేశాడు. శనివారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రోహిత్ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య రితిక, కూతురు సమైరా ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. -
డివిలియర్స్‌ను తీసుకోలేదని చింతించడం లేదు
జొహన్నెస్‌బర్గ్: ఈ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా దయనీయ పరిస్థితిని చూసి జాలిపడని వారు లేరు. ప్రధాన పేసర్లు స్టెయిన్, ఇన్‌గిడి గాయాలతో దూరం కావడం, బ్యాట్స్‌మెన్ వైఫల్యాలతో ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సహా ప్రతి ఒక్కరూ అంటున్న మాట... ‘ఏబీ డివిలియర్స్ (ఏబీడీ) ఉంటే ఇలా జరిగేదా?’ అని. తనదైన శైలిలో విరుచుకుపడి ఆడే డివిలియర్స్ అవసరమైతే ఇన్నింగ్స్‌లనూ నిర్మించగలడు. అలాంటి ఆటగాడు 2018 మేలో సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపించి ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలసిపోవడంతో పాటు తనలో తపన లేదంటూ ఈ సందర్భంగా ఏబీడీ పేర్కొన్నాడు. నాడు ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యపర్చింది. కనీసం అతడు ప్రపంచ కప్ వరకైనా కొనసాగి ఉండాల్సిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, తర్వాత ఏమనుకున్నాడో ఏమో... పునరాగమనం చేయాలని డివిలియర్స్ భావించాడు. సరిగ్గా ఏప్రిల్ 18న ప్రస్తుత కప్‌నకు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించే సమయానికి కెప్టెన్ డు ప్లెసిస్, ప్రధాన కోచ్ ఒటిస్ గిబ్సన్, సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జొండిలతో కూడిన జట్టు యాజమాన్యాన్ని కలిసి తన అభిమతం వెల్లడించాడు. కానీ, గత ఏడాది కాలంగా ఎంపిక ప్రక్రియకు ప్రామాణికమైన దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో వారు ఏబీ ప్రతిపాదనను కనీసం పరిగణించలేదు. అతడిని తిరిగి తీసుకోవడం భావ్యంగా ఉండదని, ముఖ్యంగా నిలకడగా ఆడుతున్న డసెన్ వంటి ఆటగాళ్ల అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుందని కూడా భావించారు. దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ కప్ సన్నాహాల్లో ఉంటే, డివిలియర్స్ ఐపీఎల్ ఆడిన వైనాన్నీ వారు దృష్టిలో పెట్టుకున్నారు. ఇటీవల భారత్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ తాను ప్రపంచ కప్ బృందంలో ఉండాల్సిందన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. మరోవైపు... కప్‌లో దెబ్బతిని ఉన్న తమ జట్టుకు ట్విట్టర్ ద్వారా డివిలియర్స్ ధైర్యం చెప్పాడు. ‘మనం జట్టుకు అండగా నిలవడంపై దృష్టిపెట్టడం ముఖ్యం. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. కుర్రాళ్లు ఆ పని చేస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. మా నిర్ణయం సరైనదే: జొండి ఈ మొత్తం వ్యవహారంపై సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జొండి స్పందిస్తూ... ‘రిటైర్ కావొద్దంటూ గతేడాది ఏబీడీని నేను బతిమాలాను. అప్పటికీ ప్రపంచ కప్‌నకు తాజాగా ఉండేలా రాబోయే సీజన్‌ను ప్లాన్ చేసుకోమని అవకాశం కూడా ఇచ్చాను. కప్ కోసం పరిగణనలో ఉండాలంటే స్వదేశంలో శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడాలనీ చెప్పాం. అతడు వాటిని పట్టించుకోలేదు. రిటైర్మెంట్ ప్రకటనతో తాను ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పాడు. తీరా ఏప్రిల్ 18న డివిలియర్స్ ఆలోచన చెప్పేసరికి మేం షాక్ అయ్యాం. అతడి లోటు తీర్చలేనిదే. కానీ, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొందరు కుర్రాళ్లు తీవ్రంగా శ్రమించారు. వారికి అవకాశం ఇవ్వాల్సిందే. ఏదేమైనా మా నిర్ణయం విధానాల ప్రకారమే తీసుకున్నాం’ అని వివరించాడు. -
నాలుక కోసుకున్న క్రికెట్ అభిమాని
వేలూరు : ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్జట్టు విజయం సాధించాలని కోరుతూ తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడికి చెందిన ఓ యువకుడు గురువారం నాలుక కోసుకున్నా డు. వేలూరు జిల్లా వానియంబాడి మిడె న్స్ కుప్పం గ్రామానికి చెందిన సుధాకర్(27) భవన నిర్మాణ కార్మికుడు. ఇతను క్రికెట్ అభిమాని. గురువారం ఉదయం జోలార్‌పేటలోని అత్తగారింటికి వె ళ్ళిన సుధాకర్ అక్కడున్న పొన్నేరి వేడియప్పన్ ఆలయం వద్దకు వెళ్లి బ్లేడుతో నాలుక కోసుకుని ఆలయంలోని పీఠంలో ఉంచాడు. దీన్ని గమనించిన భక్తులు ఆ యువకుని బంధువులకు సమాచారం అందించారు. అప్పటికే సుధాకర్ సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ నాలుకను స్థాని కులు ఆసపత్రికి తీసుకువచ్చారు. ఎండకు వాడి పోయి ఉన్న నాలుకను వేలూరులోని వైద్య బృందం అధునూతన పద్ధతిలో ఆపరేషన్ చేసి అమర్చింది. సుధాకర్ మాట్లాడుతాడా అనే విషయం చెప్పడానికి కొద్ది రోజులు పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. క్రికెట్ పోటీల్లో భారత్ టీమ్ గెలవాలని నాలుక కోసుకున్నట్టు సుధాకర్ పైపర్‌పై రాసి వివరించాడు. ఇదిలా ఉండగా కుటుంబ సమస్యల వల్ల కూడా సుధాకర్ ఇలా చేసి ఉండవచ్చునని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సుధాకర్ కత్తిని నోటిలో పెట్టుకుని చెట్టు ఎక్కుతున్న సమయంలో జారి నాలుక తెగిపోయినట్టు కేసు నమోదు చేశారు. -
క్రికెట్ ఫీవర్!
ఇటు క్రికెట్ మ్యాచ్‌లు.. అటు పరీక్షలు ఇప్పుడు వరల్డ్ కప్, ఆపై ఐపీఎల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పలమనేరు: వరల్డ్ కప్ క్రికెట్ పుణ్యమా అని విద్యార్థుల తల్లిదండ్రులకు టెన్షన్ పట్టుకుంది. విద్యార్థులకేమో క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఓవైపు క్రికెట్ మ్యాచ్‌లు.. మరోవైపు పరీక్షలు విద్యార్థులకు సవాల్‌గా మారాయి. ఇప్పటికే వరల్డ్‌కప్ పోటీలు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పోటీలు ముగియగానే ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తయ్యే వరకు క్రికెట్ సీజన్ సాగనుంది. దీంతో తల్లిదండ్రులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం తీవ్రంగా కలత చెందుతున్నాయి. విద్యార్థులకొచ్చే ర్యాంకుల ఆధారంగా వ్యాపారాన్ని చేసుకొనే ప్రైవేటు కళాశాలలకు క్రికెట్ పెద్ద తలనొప్పిగా మారింది. టీవీలు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్న విద్యార్థుల దృష్టిని పరీక్షల వైపు మళ్లించడం తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతోంది. క్రికెట్‌తోనే పరీక్షలంతా ముగిసిపోతాయి ఇప్పటికే వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. లీగ్ దశ పోటీలు వచ్చేనెల 15 వరకు జరగనున్నాయి. ఆపై సెమీస్, మార్చి 29న జరిగే ఫైనల్‌తో ఇవి ముగుస్తాయి. ఇలా ఉండ గా ఐపీఎల్-8 పోటీలు ఏప్రిల్ 8 నుంచి మే 17 వరకు కొనసాగుతాయి. మే 24న జరిగే ఫైనల్‌తో ఇవి ముగుస్తాయి. ఇక పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి 11 నుంచి ప్రాక్టికల్స్‌తో పాటు ఫైనల్ పరీక్షలు మార్చి 30 వరకు జరగనున్నాయి. డిగ్రీ విద్యార్థులకు మార్చి 28 నుంచి ఏప్రిల్ ఆఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆ లెక్కన క్రికెట్ సీజన్లోనే ఈ పరీక్షలన్నీ జరగ నున్నాయి. దీంతో క్రికెట్ ప్రభావం అందరు విద్యార్థుల మీద పడే అవకాశాలున్నాయి. స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్న విద్యార్థులు అసలే పరీక్షల సీజన్ కావడంతో ఇంట్లో టీవీలు చూడ్డానికి తల్లిదండ్రులు ససేమీరా ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు స్మార్ట్ఫోన్లలో లైవ్ క్రికెట్ చూడ్డానికి ఆసక్తి చూపుతున్నారు. మొన్న జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా విద్యార్థుల్లో క్రికెట్ ఫీవర్ ఎలా ఉందో అర్థమైంది. అంతేగాక ఏ మాత్రం సమయం దొరి కినా విద్యార్థులు బ్యాట్, బాల్ చేతబట్టి క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. వరల్డ్‌కప్ మొదలయ్యాక సందుగొందులతో పాటు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆఖరుకు చెరువుల్లోనూ క్రికెట్ ఆడుతున్న విద్యార్థులే దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన సమయమిదే విద్యార్థులకు క్రీడలకన్నా పరీక్షలే ముఖ్యం. అయితే క్రికెట్ ఇప్పుడు ఓ వైరస్‌లా మారింది. దీంతో విద్యార్థులకు ఎంతసేపూ క్రికెట్ స్కోరెంత.. ఎవరు గెలిచారు.. అనే ధ్యాసే పట్టిపీడిస్తోంది. వీరిని క్రికెట్ నుంచి పరీక్షల వైపునకు మరల్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇప్పటికే కొందరు మానసికంగా క్రికెట్ మ్యాచ్లకుబానిసలైపోయారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అసలైన సమయమిదే. -ఎన్.బి. సుధాకర్ రెడ్డి, సైకాలజిస్ట్, తిరుపతి. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ముఖ్యంగా టెన్త్ పిల్లలకు ఫైనల్ పరీక్షలే అసలైన భవిష్యత్తు. క్రికెట్ పోటీల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపేలా బడిబస అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు టెన్త్ పిల్లల ఇళ్ల వద్దకెళ్లి వారు చదువుకుంటున్నారా లేదా టీవీలు చూస్తున్నారా అని గమనించి తల్లిదండ్రులను మేల్కొల్పుతున్నాం. -వాసుదేవనాయుడు, డివైఈవో, చిత్తూరు ఈ పరీక్షలు పిల్లలకు కాదు..పెద్దలకే క్రికెట్ పోటీల కారణంగా విద్యార్థులు రాయాల్సిన పరీక్షలు వారి తల్లిదండ్రులకు పరీక్షలుగా మారాయి. వారు ధ్యాసతో చదవాలంటే తొలుత తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఇళ్లలో వారు సీరియల్స్ చూసుకుంటూ కుర్చొంటే పిల్లలు మరో చోట క్రికెట్ చూస్తుంటారు. కాబట్టి పూర్తిగా టీవీలను కట్టిపెట్టి పిల్లలపై శ్రద్ధ చూపాలి. - బాలాజీ, రచయిత, పలమనేరు. పరీక్షలను విస్మరిస్తే భవిష్యత్తు అంధకారమే వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా నాలుగేళ్లకోసారి ఆడుతూనే ఉంటుంది. కానీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం వచ్చే ఫైనల్ పరీక్షలు మళ్లీరావు. ఒక్కసారి ఫెయిలైతే మళ్లీ కట్టి రాసుకోవాల్సిందే. కాబట్టి క్రికెట్ కంటే విద్యార్థులు జీవితమే ముఖ్యమని తెలుసుకోవాలి. దీనిపై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - క్రిష్ణమూర్తిరెడ్డి, మధు కళాశాల కరస్పాండెంట్, పలమనేరు -
బెట్టింగ్
జిల్లాలో జోరుగా క్రికెట్ ‘కాయ్ రాజా కాయ్’ చేతులు మారుతున్న రూ.కోట్లు హైదరాబాద్ కేంద్రంగా బుకీ వ్యవస్థ ఏజెంట్ పద్ధతితో జిల్లాల్లో గేమింగ్ అంతా ‘ఆన్లైన్’లోనే.. ఆర్థికంగా చితికిపోతున్న మధ్య తరగతి ప్రజలు వరంగల్ క్రైం : జిల్లావాసులకు వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. మామూలు రోజుల్లోనే చాలామంది క్రికెట్ చూడటానికి టీవీలకు అతుక్కుపోతారు. ఇక సెలవు రోజుల్లో అరుుతే కదలడం కష్టం. ఉన్నత, మధ్యతరగతి వారి బలహీనతలను ఆసరా చేసుకుని బుకీ రాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు. మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన బెట్టింగ్ కాయడం పట్టణాలకు, పల్లెలకూ కూడా విస్తరించింది. హైదరాబాద్ కేంద్రంగా బుకీలు జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ‘ఆన్లైన్’ పద్ధతిలో కొనసాగుతుండటంతో పోలీసుల నిఘాకు వారు చిక్కలేక పోతున్నారు. గెలుపు గుర్రాలపైనే.. అధికంగా గెలుపు గుర్రాల మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కాస్తున్నారు. తాజాగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో రూ.కోట్లు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక వంటి ప్రధాన దేశాలు ఆడినపుడు బాల్ బాలుకు, సిక్సర్లకు, ఫోర్లకు బెట్టింగ్ కొనసాగుతోంది. ప్రధానమైన జట్టు గెలుస్తుందని రూ.10 వేలు బెట్టింగ్ పెట్టేవారు లక్షలాది మంది ఉంటారు. చిన్నజట్టు గెలుస్తుందని రూ.10 వేలు బెట్టింగ్ పెట్టే వారు వందల్లో ఉంటారు. బెట్టింగ్‌కు ముందుగానే మ్యాచ్‌పై వెస్టిండిస్ పై రూ.10వేలు పెట్టిన వారికి సుమారుగా రూ.30 వస్తుందని చెబుతారు. అదేవిధంగా ఐర్లాండ్‌పై రూ.10 వేలు పెట్టిన వారికి రూ.3 లక్షలు వస్తాయని చెబుతారు. ఈ విధంగా ఆన్లైన్, సెల్ మెసేజ్ రూపకంగా బెట్టింగ్‌లు కాస్తారు. హైదరాబాద్ కేంద్రంగా బూకీ వ్యవస్థ హైదరాబాద్ కేంద్రంగా బూకీ వ్యవస్థ నడుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బూకీలు తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి జిల్లాలవారిగా క్రికెట్ అభిమానులకు విస్తరిస్తుంటారు. హైదరాబాద్‌లోని బీబీ నగర్, నాగార్జున సాగర్ రూట్లోని మాల్ అనే ప్రాంతంతోపాటు, మేడ్చెల్, సదాశివపేట వంటి ఔట్‌కట్స్‌లో బూకీలు యథేచ్ఛగా తమ పని కానిస్తున్నారు. జిల్లాలో బెట్టింగ్‌కు సంబంధించి 2వేలకు పైగా ఏజెంట్లు ఉన్నార నేది విశ్వసనీయ సమాచారం. వీరి లావాదేవీల డబ్బులు బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ అకౌంట్ల ద్వారా చెల్లిస్తారు. ఒక ఏజెంట్ ఒక వ్యక్తిని బెట్టింగ్ టీమ్‌లో చేర్చుకుంటున్నాడంటే అతనిపై నమ్మకంతోపాటు బ్యాంకుకు సంబంధించిన బ్లాంక్ చెక్స్, డబ్బులకు సంబంధించి లీగల్ టర్మినాలజీలో లావాదేవీలు రాసుకుంటారు. కస్టమర్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయి బ్యాంక్ ద్వారా చెల్లించని పక్షంలో సదరు ఏజెంట్లు, బూకీలు చట్టపరంగా వీరిపై చర్యలు తీసుకుంటారు. వీరు చేసేది న్యాయపరమైనది కాకపోరుునా.. లీగల్‌గా కమిట్ అయిన తర్వాతనే బెట్టింగ్ టీమ్‌లో స్థానం లభిస్తుంది. ఎప్పటికప్పుడు మకాంలు మార్చడం ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు సెల్ఫోన్లు మార్చడం, ఏజెంట్లు తమ మకాంలు మార్చడం సహజం. స్టార్హోటల్లలో మకాం వేస్తూ ఏజెంట్లు జల్సాగా క్రికెట్ వీక్షిస్తూ బెట్టింగ్ కట్టేవారి కాల్స్ స్వీకరిస్తూ ఈ సమాచారంను బూకీలకు చేరవేస్తారు. దీంతో పాటు నగరంలో పరిసర ప్రాంతాలలో తమకు అనువుగా ఉన్నటు వంటి ఫామ్‌హౌస్‌లను ఎంచుకుంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లాభం వస్తే డబ్బు బ్యాంకు అకౌంట్లోకి వస్తుంది. బెట్టింగ్‌లో డ బ్బులు పోయిన పక్షంలో సదరు బెట్టింగ్ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అవుతాయి. సదరు వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేని పక్షంలో తెల్లవారి బ్యాంకు పనిచేసే వేళలో అందులో వేయాలి. అలా కాకుండా ఒక సారి నమ్మకం కోల్పోతే సదరు వ్యక్తికి జీవితకాలం బెట్టింగ్‌లలో స్థానం కోల్పోయినట్లే. కాగా, మధ్య తరగతి వారు డబ్బులు కోల్పోరుు ఆర్థికంగా చితికిపోతున్నారు. పోలీసులు బూకీ వ్యవస్థను, ఏజెంట్లను కనిపెట్టి మధ్య తరగతి వారిని రక్షించాల్సిన అవసరం ఉంది. -
బెట్టింగ్‌రాయుళ్ల బెండుతీస్తున్నారు
టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా గవర్నర్‌పేటలో ఏడుగురి అరెస్ట్ రూ.70వేల నగదు, 20 సెల్ఫోన్లు స్వాధీనం అజ్ఞాతంలోకి కీలక బుకీలు విజయవాడ సిటీ : క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో నగరంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టిసారించారు. బుకీలతోపాటు బెట్టింగ్‌రాయుళ్ల బెండు తీసేందుకు నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిపి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిని మంగళవారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ.70,350 నగదు, 20 సెల్ఫోన్లు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. అయితే, బెట్టింగ్‌ల నిర్వహణలో ప్రముఖులుగా పేరొందిన బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నగరంలో జరిగే క్రికెట్ బెట్టింగ్‌లపై రెండు రోజులుగా ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకొని బుకీలు బెట్టింగ్‌లు నిర్వహించే తీరు.. నగరంలో పేద, మధ్య తరగతి, విద్యార్థులు బెట్టింగ్ ఊబిలో చిక్కుకుంటున్న వైనాన్ని వివరించిన విషయం విదితమే. ఈ కథనాలపై స్పందించిన నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గవర్నరుపేట చేపల మార్కెట్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, మురళీధర్‌ల పర్యవేక్షణలో ఎస్ఐలు ఆర్.సురేష్‌రెడ్డి, జి.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు సహా తదుపరి విచారణ కోసం గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో వీరి నుంచి బుకీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాబట్టినట్టు తెలిసింది. గతంలో బెట్టింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పిలిపించి బైండోవర్ చేశారు. ఇదే జోరు కొనసాగిస్తే మరికొందరు బెట్టింగ్ రాయుళ్లు కూడా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కీలక మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ రోజుల్లో ఇప్పటి కంటే రెట్టింపు పందేలు జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్‌లో కీలక భూమిక పోషించే ప్రధాన బుకీలను కట్టడి చేస్తే అనేక కుటుంబాలు వీధిన పడకుండా ఉంటాయి. అజ్ఞాతంలో బుకీలు.. పోలీసులు దాడులకు దిగడంతో పలువురు ప్రముఖ బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు రెండు రోజులపాటు ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలిసిన వెంటనే ఇళ్లు వదిలి బయటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తమ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ పోలీసుల కదలికలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నూజివీడు, విస్సన్నపేట, ఇబ్రహీంపట్నం శివారుతోపాటు నగరంలోని పటమట ప్రాంతంలో ఖరీదైన అపార్టుమెంట్లలో వీరు ఆశ్రయం తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. -
పెళ్లిళ్లకూ తప్పని క్రికెట్ ఫీవర్
హైదరాబాద్: ప్రపంచ క్రికెట్ సంబరం... అందులోనూ దాయాదులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పిచ్‌పై రసవత్తర పోరును చూసే అవకాశం వస్తే ఏ ఒక్క క్రికెట్ ప్రియుడూ జారవిడుచుకోడంటే అతిశయోక్తి కాదు. ఆదివారం నాటి భారత్-పాక్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇదే వాతావరణం కనిపించింది. దాదాపుగా అభిమానులు అందరూ క్రికెట్ ఫీవర్‌తో టీవీలకు అతుక్కుపోగా ఆ సమయంలో రోడ్లన్లీ వెలవెలబోయాయి. కొన్ని కల్యాణ మండపాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించడం మరింత విశేషం. ఒకవైపు వేడుక జరుగుతుంటే... కార్యక్రమాలకు విచ్చేసిన అతిథులు పక్కనే టీవీలో వస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షిస్తుండడం కనిపించింది. ఆదివారం నగరంలోని కర్మన్‌ఘాట్‌లో చందనాగార్డెన్లో కనిపించిన దృశ్యమే ఇది.