బెట్టింగ్ | cricket betting | Sakshi
Sakshi News home page

బెట్టింగ్

Published Thu, Feb 19 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

బెట్టింగ్

బెట్టింగ్

 జిల్లాలో జోరుగా క్రికెట్  ‘కాయ్ రాజా కాయ్’
చేతులు మారుతున్న రూ.కోట్లు
హైదరాబాద్ కేంద్రంగా బుకీ వ్యవస్థ ఏజెంట్ పద్ధతితో
జిల్లాల్లో గేమింగ్ అంతా ‘ఆన్‌లైన్’లోనే..
ఆర్థికంగా చితికిపోతున్న మధ్య తరగతి ప్రజలు

 
వరంగల్ క్రైం : జిల్లావాసులకు వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. మామూలు రోజుల్లోనే చాలామంది క్రికెట్ చూడటానికి టీవీలకు అతుక్కుపోతారు. ఇక సెలవు రోజుల్లో అరుుతే కదలడం కష్టం. ఉన్నత, మధ్యతరగతి వారి బలహీనతలను ఆసరా చేసుకుని బుకీ రాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు. మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన బెట్టింగ్ కాయడం పట్టణాలకు, పల్లెలకూ కూడా విస్తరించింది. హైదరాబాద్ కేంద్రంగా బుకీలు జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ‘ఆన్‌లైన్’ పద్ధతిలో కొనసాగుతుండటంతో పోలీసుల నిఘాకు వారు చిక్కలేక పోతున్నారు.
 
గెలుపు గుర్రాలపైనే..


అధికంగా గెలుపు గుర్రాల మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కాస్తున్నారు. తాజాగా  ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో రూ.కోట్లు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక వంటి ప్రధాన దేశాలు ఆడినపుడు బాల్ బాలుకు, సిక్సర్లకు, ఫోర్లకు బెట్టింగ్ కొనసాగుతోంది. ప్రధానమైన జట్టు గెలుస్తుందని రూ.10 వేలు బెట్టింగ్ పెట్టేవారు లక్షలాది మంది ఉంటారు. చిన్నజట్టు గెలుస్తుందని రూ.10 వేలు బెట్టింగ్ పెట్టే వారు వందల్లో ఉంటారు. బెట్టింగ్‌కు ముందుగానే మ్యాచ్‌పై వెస్టిండిస్ పై రూ.10వేలు పెట్టిన వారికి సుమారుగా రూ.30 వస్తుందని చెబుతారు. అదేవిధంగా ఐర్లాండ్‌పై రూ.10 వేలు పెట్టిన వారికి రూ.3 లక్షలు వస్తాయని చెబుతారు. ఈ విధంగా ఆన్‌లైన్, సెల్ మెసేజ్ రూపకంగా బెట్టింగ్‌లు కాస్తారు.

హైదరాబాద్ కేంద్రంగా బూకీ వ్యవస్థ

హైదరాబాద్ కేంద్రంగా బూకీ వ్యవస్థ నడుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బూకీలు తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి జిల్లాలవారిగా క్రికెట్ అభిమానులకు విస్తరిస్తుంటారు. హైదరాబాద్‌లోని బీబీ నగర్, నాగార్జున సాగర్ రూట్‌లోని మాల్ అనే ప్రాంతంతోపాటు, మేడ్చెల్, సదాశివపేట వంటి ఔట్‌కట్స్‌లో బూకీలు యథేచ్ఛగా తమ పని కానిస్తున్నారు. జిల్లాలో బెట్టింగ్‌కు సంబంధించి 2వేలకు పైగా ఏజెంట్లు ఉన్నార నేది విశ్వసనీయ సమాచారం. వీరి లావాదేవీల డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లు, ఆన్‌లైన్ అకౌంట్‌ల ద్వారా చెల్లిస్తారు. ఒక ఏజెంట్ ఒక వ్యక్తిని బెట్టింగ్ టీమ్‌లో చేర్చుకుంటున్నాడంటే  అతనిపై నమ్మకంతోపాటు బ్యాంకుకు సంబంధించిన బ్లాంక్ చెక్స్, డబ్బులకు సంబంధించి లీగల్ టర్మినాలజీలో లావాదేవీలు రాసుకుంటారు. కస్టమర్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయి బ్యాంక్ ద్వారా చెల్లించని పక్షంలో సదరు ఏజెంట్‌లు, బూకీలు చట్టపరంగా వీరిపై చర్యలు తీసుకుంటారు. వీరు చేసేది న్యాయపరమైనది కాకపోరుునా.. లీగల్‌గా కమిట్ అయిన తర్వాతనే బెట్టింగ్ టీమ్‌లో స్థానం లభిస్తుంది.

ఎప్పటికప్పుడు మకాంలు మార్చడం
 
ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌లు మార్చడం, ఏజెంట్‌లు తమ మకాంలు మార్చడం సహజం. స్టార్‌హోటల్‌లలో మకాం వేస్తూ ఏజెంట్‌లు జల్సాగా క్రికెట్ వీక్షిస్తూ బెట్టింగ్ కట్టేవారి కాల్స్ స్వీకరిస్తూ ఈ సమాచారంను బూకీలకు చేరవేస్తారు. దీంతో పాటు నగరంలో పరిసర ప్రాంతాలలో తమకు అనువుగా ఉన్నటు వంటి ఫామ్‌హౌస్‌లను ఎంచుకుంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లాభం వస్తే డబ్బు బ్యాంకు అకౌంట్‌లోకి వస్తుంది. బెట్టింగ్‌లో డ బ్బులు పోయిన పక్షంలో సదరు బెట్టింగ్ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అవుతాయి. సదరు వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేని పక్షంలో తెల్లవారి బ్యాంకు పనిచేసే వేళలో అందులో వేయాలి. అలా కాకుండా ఒక సారి నమ్మకం కోల్పోతే సదరు వ్యక్తికి జీవితకాలం బెట్టింగ్‌లలో స్థానం కోల్పోయినట్లే. కాగా, మధ్య తరగతి వారు డబ్బులు కోల్పోరుు ఆర్థికంగా చితికిపోతున్నారు. పోలీసులు బూకీ వ్యవస్థను, ఏజెంట్లను కనిపెట్టి మధ్య తరగతి వారిని రక్షించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement