క్షమించమని కుటుంబ సభ్యులకు లేఖ రాసి అదృశ్యమైన యువకుడు
ఆత్మకూరురూరల్: ఆన్‌లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు సర్వం పోగొట్టుకుని కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఓ ఫైనాన్స్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 13 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.
ఈ మొత్తాన్ని క్రెడిట్ కార్డులు, ప్రైవేట్ చీటీల ద్వారా తీసుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం రాత్రి ఆరు పేజీల లేఖ రాసి ఇంట్లో పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, భార్యను క్షమించమని, ఇక నుంచి ఎవరికీ కనపడనని లేఖలో రాశాడు. నిరంజన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాము తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment