పెళ్లిళ్లకూ తప్పని క్రికెట్ ఫీవర్ | cricket feaver for marriages also | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లకూ తప్పని క్రికెట్ ఫీవర్

Published Sun, Feb 15 2015 4:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

పెళ్లిళ్లకూ తప్పని  క్రికెట్ ఫీవర్

పెళ్లిళ్లకూ తప్పని క్రికెట్ ఫీవర్

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్ సంబరం... అందులోనూ దాయాదులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పిచ్‌పై రసవత్తర పోరును చూసే అవకాశం వస్తే ఏ ఒక్క క్రికెట్ ప్రియుడూ జారవిడుచుకోడంటే అతిశయోక్తి కాదు. ఆదివారం నాటి భారత్-పాక్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇదే వాతావరణం కనిపించింది. దాదాపుగా అభిమానులు అందరూ క్రికెట్ ఫీవర్‌తో టీవీలకు అతుక్కుపోగా ఆ సమయంలో రోడ్లన్లీ వెలవెలబోయాయి. కొన్ని కల్యాణ మండపాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించడం మరింత విశేషం. ఒకవైపు వేడుక జరుగుతుంటే... కార్యక్రమాలకు విచ్చేసిన అతిథులు పక్కనే టీవీలో వస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షిస్తుండడం కనిపించింది. ఆదివారం నగరంలోని కర్మన్‌ఘాట్‌లో చందనాగార్డెన్‌లో కనిపించిన దృశ్యమే ఇది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement