Woman Bites Husband Tongue While Kissing In Kurnool - Sakshi
Sakshi News home page

చనువుగా ఉన్న సమయంలో భర్త నాలుక కొరికిన భార్య..!

Published Sat, Jul 22 2023 9:34 AM | Last Updated on Sat, Jul 22 2023 12:27 PM

Woman Bites Husband's Tongue in Guntur - Sakshi

కర్నూలు: గొడవ పడి భర్త నాలుకను భార్య కొరికిన ఘటన తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్టతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన పుష్పావతికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చందూనాయక్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తండాలోనే నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.

ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చందూనాయక్‌ నాలుకకు తీవ్ర గాయమైంది. చనువుగా ఉన్న సమయంలో భార్యనే భర్త నాలుక కొరికి గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జొన్నగిరి ఎస్‌ఐ రామాంజినేయులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement