woman bites
-
చనువుగా ఉన్న సమయంలో భర్త నాలుక కొరికిన భార్య..!
కర్నూలు: గొడవ పడి భర్త నాలుకను భార్య కొరికిన ఘటన తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్టతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన పుష్పావతికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చందూనాయక్తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తండాలోనే నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చందూనాయక్ నాలుకకు తీవ్ర గాయమైంది. చనువుగా ఉన్న సమయంలో భార్యనే భర్త నాలుక కొరికి గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జొన్నగిరి ఎస్ఐ రామాంజినేయులు తెలిపారు. -
నీళ్ల గొడవ.. కొరుక్కున్న మహిళలు
కుత్బుల్లాపూర్ : వేసవి కావడంతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నీటి కోసం మహిళలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. నీటి ట్యాంకర్ కనిపిస్తే చాలు.. అది తమ బస్తీకి వచ్చిందంటే తమ బస్తీకి వచ్చిందంటూ అక్కడివారు ఘర్షణ పడుతున్నారు. శనివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ బాలయ్యనగర్‌లో ట్యాంకర్ వద్ద దేవాబాయి అనే మహిళ ఎక్కువ సమయం నీటిని పట్టుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన పార్వతి ఆగ్రహంతో దేవాబాయి చేతిని గట్టిగా కొరికింది. దీంతో ఆమె చేతికి తీవ్రమైన గాయమైంది. ఈ ఘటనతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఈ నీటి పంచాయతీ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ చేసి పంపించారు.