ఏజెంట్ నాలుకను కత్తిరించేశారు.. | 11 booked for cutting off poling agent's tongue in UP | Sakshi
Sakshi News home page

ఏజెంట్ నాలుకను కత్తిరించేశారు..

Published Mon, Oct 12 2015 6:24 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

ఏజెంట్ నాలుకను కత్తిరించేశారు.. - Sakshi

ఏజెంట్ నాలుకను కత్తిరించేశారు..

ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. గత శుక్రవారం జరిగిన పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు ఎన్నికల ఏజెంట్ నాలుకను కత్తిరించారు. ఈ ఘటనపై పోలీసులు 11 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

రాణీగంజ్ ప్రాంతంలోని ప్రజాపతి పోలింగ్ బూత్లో స్థానిక సంస్థ మాజీ అధ్యక్షుడు రమాకాంత్ తన కుమారులతో కలసి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ఏజెంట్గా ఉన్న ముస్తక్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రమాకాంత్, ఆయన కొడుకులు.. ముస్తక్ నాలుకను కత్తిరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉమర్ ఫిర్యాదు మేరకు రమాకాంత్, ఆయన కొడుకులు దినకర్, దుర్గేష్, వినోద్, ఆదర్శ్, బబ్లూతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement