
ప్రతీకాత్మక చిత్రం
మనోహరబాద్(తూప్రాన్): భార్య కాపురానికి రావడంలేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చెట్లగౌరారంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెట్ల గౌరారం గ్రామానికి చెందిన డ్రైవర్ బాబర్(30)తో తూప్రాన్‌కు చెందిన నూర్జహాన్ బేగంతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలలుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. భర్తతో గొడవపడి నూర్జహాన్ బేగం పుట్టింకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాబర్ మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈనెల 2న డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంటిలో చెప్పి తిరిగిరాలేదు. మక్సాని కుంటబావిలో ఆదివారం శవమై తేలాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. మృతుడి తండ్రి మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment