విశాఖ : మెట్టినింటి ఆరళ్లకు మరో నవవధువు బలైంది. విశాఖలో గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన మేఘావతి మృతి చెందింది. ఈ నెల 15వ తేదీన అపస్మారక స్థితిలో ఉన్న మేఘావతిని ఆమె అత్త, బావ స్థానిక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పెళ్లయిన తర్వాత మేఘావతిని ఆమె భావ వేధింపులకు గురిచేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఆమె ఎదురు తిరగటంతో మేఘావతిని చంపేందుకు అత్త, బావ, భర్త చంపేందుకు యత్నించారు. అనంతరం తీవ్రజ్వరమంటూ అత్తింటివారు మేఘావతిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు మేఘావతి మృతితో కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మృత్యువుతో పోరాడి ఓడిన మేఘావతి
Published Wed, Jun 18 2014 9:11 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM