వాషింగ్టన్: నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. కానీ అనుకోని ప్రమాదం ఆ వధువు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసింది. ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆ ఇంట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు మంటల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అమెరికాలోని విస్కాన్సిస్ నగరంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. పైజీ రుడ్డీ అనే 19 ఏళ్ల యువతికి.. లోగాన్ మిచెల్ కార్డర్‌తో మే 22న వివాహం జరిగింది. అదే రోజు వరుడి తాతయ్య ఇంటికి విందుకు హాజరయ్యేందుకు ఈ దంపతులు వెళ్లారు. ఆ రాత్రంతా ఎంతో ఆనందంగా గడిపారు. మే 23న తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఆ ఇంటి రెండవ అంతస్తులో వ్యాపించాయి. ఆ సమయంలో పైజ్ రడ్డీ ఆ గదిలోనే నిద్రిస్తోంది. మంటల కారణంగా ఆ గది మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో నిద్రలో ఉన్న వధువు పొగని పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
పొగ పీల్చడం వల్ల బ్రెయిన్ హెమరేజ్‌కి గురైన ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దంపతులు ఉంటున్న ఇల్లు వరుడి తాతలకు చెందినదని, స్మోక్ డిటెక్టర్‌లు లేకపోవడంతో కుటుంబసభ్యులు సకాలంలో స్పందించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఆ ఇంట్లో అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రమాదనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: ల్యాండింగ్ టైంలో ఊపిరాడటం లేదని ఆ డోర్ తెరిచాడు..అంతే విమానం..
Comments
Please login to add a commentAdd a comment