
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగి కనీసం పది రోజులు కూడా గడవని ఓ కొత్త జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చల నడుకుడ గ్రామంలోని నవ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు.
భార్యాభర్తల పరిస్థితి విషమంగా మారటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి ఈ నెల 13న వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే వారు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై పోలీసుల విచారణ జరుపుతున్నామని తెలిపారు.
చదవండి: భార్య కాపురానికి రావడం లేదని..
Comments
Please login to add a commentAdd a comment