పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.
తిరుపతి : పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. అర్థరాత్రి వీరిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రేమజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినివారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట గంగవరం మండలానికి చెందిన ప్రసాద్, ప్రియగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.