బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కిరణ్ హాస్పిటల్ వద్ద ఓ ప్రేమ జ౦ట ఆత్మహత్యాయత్న౦ చేసింది. ఖాదర్ వలీ, శాంతి అనేవారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నా మళ్లీ వేర్వేరు పెళ్లిళ్లు చేశారని వారు మనస్తాపం చెందారు. దీంతో ఆస్పత్రి వద్ద ఆదివారం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు.