
పాకిస్తాన్‌కు చెందిన సీమా, యూపీకి చెందిన సచిన్ ప్రేమ కథ, అనంతర పరిణామాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పోలాండ్ మహిళ బార్బరా, జార్ఖండ్ యువకుడు షాబాద్‌ల ప్రేమ కథ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు.
ప్రియురాలు బార్బరా యూరోపియన్ దేశమైన పోలాండ్‌కు చెందినది. ప్రియుడు జార్ఖండ్‌లోని కటకంసాండీ బ్లాక్ పరిధిలోని బరతువా గ్రామానికి చెందినవాడు. వీరికి సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2021లో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. అంతే.. ఆమె పోలాండ్ విడిచిపెట్టి తన ఆరేళ్ల కుమార్తె అనన్యతో పాటు బరతువా గ్రామానికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె ప్రియుని ఇంటిలోనే ఉంటోంది. త్వరలో వీర్దిదరూ వివాహం చేసుకోనున్నారు.
గ్రామంలో వీరి వివాహానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. బార్బరా కుమార్తె ఇప్పటి నుంచే షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. తనకు భారత్ ఎంతో నచ్చిందని, తాను ఇక్కడికి రాగానే తనను స్థానికులు ఒక సెలబ్రిటీగా చూస్తున్నారని బార్బరాతెలిపింది.
ఇది కూడా చదవండి: 36 ఏళ్లుగా అతనినే తండ్రి అనుకుంది.. తల్లి అసలు రహస్యం చెప్పగానే..
Comments
Please login to add a commentAdd a comment