
సుబ్బారావు ఆచూకీ దొరికింది!
కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్ నోట్ పెట్టిన వ్యాపారి సుబ్బారావు ఆచూకీ దొరికింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీ ప్రాంతానికి చెందిన సుబ్బారావు ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరుడికి లేఖ పెట్టి, అదృశ్యం అయిపోయిన సంగతి తెలిసిందే.
అయితే.. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అంతా కలిసి నాగ్పూర్ వెళ్తుండగా ఆదిలాబాద్లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో వాళ్ల కథ సుఖాంతం అయినట్లయింది.