ఒడిషాలోని రాయగడలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
(సిహెచ్.అప్పారావు-సాక్షి)
విశాఖపట్నం: ఒడిషాలోని రాయగడలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. శరీరం తీవ్రంగా కాలిపోయి ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఇక్కడకు తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి అతి ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రాయగడలో ఉపాధ్యాయురాలయిన ఇతిశ్రూ ప్రధాన్ (29) ఈ నెల 27వ తేదీ రాత్రి ఒంటిపై పెట్రోల్ పో్సుకొని నిప్పంటించుకుంది. ఆమె శరీరం చాలావరకు కాలిపోయింది. వెంటనే ఆమె అక్కడ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ తీసుకువచ్చి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.