ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం | Mother attempt to suicide along with three daughters | Sakshi
Sakshi News home page

ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం

Published Wed, Nov 26 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం

ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం

తిమ్మాజీపేట: కుటుంబ కలహాలకు తాళలేక ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లల జీవితాలకు ముగింపు పలికింది. మరో కూతురుతో పాటు ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం మరి కల్ గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మ భర్తతో గొడవపడి సోమవారం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.

తర్వాత తానూ అంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురినీ మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం నందిని (6), విజయలక్ష్మి (4)లు మరణించారు. తల్లి భీమమ్మతో పాటు మరో కూతురు శ్రీలక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement