Three daughters
-
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
తల్లిని హత్య చేయించిన తనయ
గుంతకల్లు టౌన్: ఆస్తి కోసం కన్నతల్లినే దారుణంగా హత్య చేయించింది ఓ కసాయి కూ తు రు. కనిపించకుం డా పోయిన తల్లి కోసం చిన్న కూతురు ఫిర్యాదు చేయడం తో నెలన్నర తరువాత మిస్సింగ్ మిస్టరీ వీడింది. రూరల్ సీఐ గురునాథబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని భాగ్యనగర్ యస్జెపి స్కూల్ సమీపంలో సుశీలమ్మ(65) తన సొంతింట్లో నివాసముండేది. ఈమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఒక కుమారుడు చనిపోగా, మరో కుమారుడు 20 యేళ్లక్రితం తప్పిపోయాడు. పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. భర్తను కోల్పోయిన రెండో కుమార్తె లక్ష్మి తల్లి వద్దనే ఉంటోంది. తల్లికున్న ఆస్తిని, బంగారాన్ని కాజేయాలని కుట్రపన్నిన లక్ష్మి ఇంట్లో అద్దెకుంటున్న బోడిసానిపల్లికి చెందిన అల్లిస్వామితో తల్లి హత్యకు పథకం రచించింది. అల్లిస్వామి చిప్పగిరి మండలం గుమ్మనూర్కి చెందిన మంజునాథ్, తిమ్మయ్యకు పథకాన్ని వివరించి రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 15న 20 యేళ్ల క్రితం తప్పిపోయిన సుశీలమ్మ పెద్దకుమారుడు బళ్లారిలో ఉన్నాడని సుశీలమ్మను నమ్మించారు. దీంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన సుశీలమ్మ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది ఆమెను ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లారు. గుమ్మనూర్ గ్రామ శివార్లలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె తనను వదిలేయాలని ప్రాధేయపడింది. అయినా కనికరం చూపని కర్కశకులు ఆమె తలపై బండరాయితో మోది హత్య చేసి ఓ గుంత తవ్వి శవాన్ని పాతిపెట్టారు. తల్లి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురైన చివరి కూతురు సుజాత బంధువులను విచారించింది. అయినా ఎక్కడా తన తల్లి ఆచూకీ లభించకపోవడంతో జూన్ 12న వన్‌టౌన్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. వృద్ధురాలు అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఏమీ తెలియనట్టు నటిస్తున్న కూతురు లక్ష్మి, ఆ ఇంట్లో అద్దెకుండి మూడు రోజులకే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిన అల్లిస్వామిపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. చివరకు సుశీలమ్మను కిరాయి హంతకులతో హత్యచేయించినట్లు నేరాన్ని అంగీకరించినట్లు సీఐ గురునాథబాబూ పేర్కొన్నారు. వన్‌టౌన్ ఎస్ఐ నగేష్బాబూ, సిబ్బందితో శనివారం నిందితులను వెంటబెట్టుకుని గుమ్మనూర్కి వెళ్లి గ్రామ శివార్లోని ముళ్లపొదల్లో పూడ్చిపెట్టిన సుశీలమ్మ మృతదేహాన్ని చిప్పగిరి తహశీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికి తీయించి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించినట్లు ఆయన తెలియజేశారు. శ్యాంపిల్స్‌ను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ ఇంటి కూతుళ్లు ముగ్గురూ డాక్టర్లే!
కూతురంటే గుండెమీద కుంపటి కాదు.. కూతురంటే కొండంత అండ. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు కూతుళ్లుంటే..! అది కూడా ముగ్గురూ డాక్టర్లయితే.. ఇంకేం కావాలా తండ్రికి? తాజాగా విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో.. పటాన్‌చెరుకు చెందిన మందముల నివార్తిదేవ్ కుమార్తె ఎం.చరిష్మా 390 ర్యాంకు సాధించింది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన చరిష్మా... స్థానిక కార్పొరేటర్ సపాన్‌దేవ్ సోదరుడి కుమార్తె. నివార్తిదేవ్‌కు ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు షాలిని గాంధీలో హౌస్ సర్జన్‌గా చేస్తున్నారు. రెండో అమ్మాయి శ్రవంతి గాంధీలోనే ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. మూడో కుమార్తె చరిష్మా. తాజాగా ఈమె కూడా మెడిసిన్‌లో చేరబోతోంది. అంటే ఈ ఇంట్లో ముగ్గురూ డాక్టర్లేనన్నమాట. నివార్తిదేవ్ పటాన్చెరు ఉపసర్పంచ్‌గా పనిచేశారు. 'ఒక కూతురన్నా డాక్టరైతే బాగుండనుకున్నా. కానీ... ముగ్గురూ అదే రంగంలోకి రావడం సంతోషంగా ఉంది. వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పీజీ చేయిస్తా. మిగిలింది కుమారుడు సాయికౌశిక్... సివిల్స్ సాధించాలని కోరుకుంటున్నాం' అన్నారు నివార్తిదేవ్. 'ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అక్కలే స్ఫూర్తి, అమ్మానాన్నల ఆశీస్సులతో ఈ ఘనత సాధించా. గైనకాలజిస్టునయ్యి నిస్వార్థ సేవ చేయాలని కోరుకుంటున్నా. అందుకు అహర్నిశలూ శ్రమిస్తా' అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది చరిష్మా. -
ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం
తిమ్మాజీపేట: కుటుంబ కలహాలకు తాళలేక ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లల జీవితాలకు ముగింపు పలికింది. మరో కూతురుతో పాటు ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం మరి కల్ గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మ భర్తతో గొడవపడి సోమవారం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తర్వాత తానూ అంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురినీ మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం నందిని (6), విజయలక్ష్మి (4)లు మరణించారు. తల్లి భీమమ్మతో పాటు మరో కూతురు శ్రీలక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. -
ఏం కష్టమొచ్చిందో!
రాయచోటిటౌన్: వారికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వారి దాంపత్య జీవ నం అన్యోన్యంగా సాగుతోంది. కానీ ఏం కష్టమొచ్చిందో తెలియదు. విషం తీసుకుని నిండుప్రాణాలు తీసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని అనాథను చేసి వెళ్లిపోయారు. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాయుడి కాలనీకి చెందిన ఎం. కోటయ్య నాయక్, సునీతలకు ముగ్గరు కుమార్తెలు (ఝాన్సీ, శ్రీవాణి, శిరీషా), కుమారుడు అంజి గోపాల్‌నాయక్ (27). వారి స్వగ్రామం సుండుపల్లె మండలం ఫించా సమీపంలోని కటారుమడుగు. వీరు సుమారు 15 ఏళ్లు క్రితం బ్రదుకుతెరువు కోసం రాయచోటికి వచ్చారు. ఇక్కడే ఉంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అంజిగోపాల్ నాయక్‌కు సంబేపల్లె మండలం బిడికీకి చెందిన కాంతమ్మ, శేఖర్నాయక్ల కుమార్తె రజని(23)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అంజిగోపాల్ నాయక్ సుమారు పదేళ్లుగా ఆటోను నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. ఈ మధ్య కాలంలో సకాలంలో ఆటో ఫైనాన్స్ బకాయిలు చెల్లించక పోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లారు. దీంతో కోటయ్య కుమారుడికి ఒక ఎద్దుల బండి కొనిచ్చాడు. దీనినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తూ ఎస్ఎన్ కాలనీ లోని చెక్ పోస్టు వద్ద కాపురం ఉండేవాడు. కోటయ్య మాత్రం రాయుడి కాలనీలోనే ఉండేవాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం తన భార్య బిడ్డతో కలసి తండ్రి ఉన్న ఇంటిలోకే గోపాల్‌నాయక్ మకాం మార్చాడు. అందరూ కలిసే ఉంటున్నారు. అయితే గత నాలుగు రోజులుగా కుమారుడు మౌనంగా ఉంటుండటాన్ని గమనించిన తండ్రి ఆరా తీశాడు. అయినా కొడుకు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కోటయ్య భార్య తన కుమార్తెతో కలిసి తిరుపతికి వెళ్లింది. ఇదే సమయంలో తండ్రి కూలిపనికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వీరు వీరు తమ పక్కింటి వాళ్ల సెల్‌ఫోన్ మళ్లీ ఇస్తామని తీసుకెళ్లారు. ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ ఎంతకు ఫోన్ ఇవ్వక పోవడంతో తమ ఫోన్ కోసం పక్కింటి మహిళ వెళ్లింది. అమ్మానాన్నల మధ్య వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి ఏడుపులు వినిపించాయి. తన ఫోన్ ఇవ్వాలని కోరగా అంజిగోపాల్ నాయక్ తన 6నెలల కుమార్తెను తీసుకొచ్చి ఆమె చేతికిచ్చి ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి పరిస్థితి గమనించి వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా మార్గ మధ్యంలోనే భార్య మృతి చెందగా అంజి గోపాల్ నాయక్ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.