చిత్తూరు: నలుగురు యువకులు పోలీసులతో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది.
బంధువుల కథనం ప్రకారం ఆటోస్టాండ్ విషయమై నలుగురు యువకులు పోలీసులతో గొడవపడ్డారు. ఆ కారణంగానే వారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసులతో గొడవ:నలుగురు ఆత్మహత్యాయత్నం
Published Wed, Aug 20 2014 5:38 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement