
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు.
తిరుపతి : అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటగిరి అటవీ ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. అధికారులు వారిని వెంటకగిరి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లలో రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.