సాక్షి, తిరుపతి: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతిపై దాదాపు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
వివరాల ప్రకారం..‘వేముల మండలం కొత్తపల్లికి చెందిన షర్మిలపై శనివారం సాయంత్రం ప్రేమోన్మాది కులాయప్ప దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదని షర్మిలపై 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో, బాధితురాలు.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను శనివారం రాత్రి పులివెందుల నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.
అయితే, షర్మిల.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన కులాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత కులాయప్ప పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment