Red sandalwood smuggler
-
చెట్ల అక్రమ రవాణాను ఎవరూ అడ్డుకోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
-
ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా, ఇరుంజీ గ్రామానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ధనపాల్ రాజా కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు సోమవారం తీర్పు చెప్పినట్లు ఆ కోర్టు ఏపీపీ కె.నగేష్ తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లు నందకుమార్, శివకుమార్ తెలిపిన కేసులోని వివరాల మేరకు.. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగల రక్షణ కోసం ఎస్వీఎన్పీ శ్యామల రేంజ్ నాగపట్ల సెక్షన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హరిబాబు, సిబ్బంది 2016 ఆగస్టు 29వ తేదీ సాయంత్రం కూంబింగ్ నిర్వహించారు. చెట్లు నరుకుతున్న శబ్దం విని పోలీసులు తోళ్లగుంట రిజర్వు ఫారెస్ట్ వద్దకు వెళ్లగా సుమారు 20 నుంచి 30 మంది స్మగ్లర్లు పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు తమ రక్షణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. 2016 ఆగస్టు 30వ తేదీ రాత్రి పోలీసులు అదే ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి నిందితుడు ధనపాల్ రాజాని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి నిందితుడు ధనపాల్ రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము చెల్లించని యెడల మరో రెండేళ్లు అధికంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. -
ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: మండలంలోని బాలపల్లె రేంజ్ లో శనివారం అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఆర్ఐ కృపానంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డివిజన్ పరిధిలోని బాలపల్లి రేంజ్ శ్రీనివాసపురం ఎస్టీకాలనీ సమీపంలోని అటవీప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. సంఘటనా స్థలానికి వెళ్తుండగా కొందరు దుంగలను అక్కడే కిందపడేసి పరారయినట్టు తెలిపారు. అక్కడున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయినవారికోసం గాలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ ఆలీబాషా, ఇన్స్పెక్టర్ బాలక్రిష్ణ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయరహదారిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా అటవీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజంపేట ఫారెస్టు రేంజర్ నారాయణ శనివారం విలేకరులకు వెల్లడించారు. బొలోరో వాహనంలో అరటికాయల లోడు వస్తుండగా, ఆపి వాహనాలను తనిఖీ చేశామన్నారు. అందులో ఎర్రచందనం దుంగలు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నామన్నారు. దుంగలను వత్తలూరు నుంచి తీసుకువస్తున్నట్లుగా వారు తెలిపారన్నారు. ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచామన్నారు. పట్టుబడినవారిలో రాజంపేట మండలం డీబీఎన్పల్లెకు చెందిన కసిరెడ్డి నాగార్జునరెడ్డి, వత్తలూరుకు చెందిన రెడ్డయ్య, రాయచోటికి చెందిన వెంకటరమణల ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు, అటవీ సిబ్బంది అంజనాస్వాతి, సాయికుమార్ పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ గుణ అరెస్టు
– తిరుపతి కోర్టుకు హాజరవుతుండగా టాస్క్‌ఫోర్స్ ముట్టడి – చిత్తూరు జిల్లాలో ఇతనిపై 15కు పైగా స్మగ్లింగ్ కేసులు – దుబాయ్‌లోని షాహుభాయ్తో భారీ వ్యాపార సంబంధాలు – వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సాక్షి ప్రతినిధి, తిరుపతి : తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పేరుమోసిన గుణశేఖర్ అలియాస్ మదరపాక్కం గుణను తిరుపతి రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ æ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఆగస్టు 10న ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న తమిళ కూలీలకు జామీను ఇచ్చేందుకు తిరుపతి కోర్టుకు హాజరవుతుండగా లక్ష్మీపురం సర్కిల్ దగ్గర గుణ ప్రయాణిస్తోన్న ఫార్చ్యూనర్ వాహనాన్ని ముట్టడించి అరెస్టు చేశారు. అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌గా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన గుణశేఖర్‌పై చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, మదనపల్లి స్టేషన్లలో 15కి పైగా స్మగ్లింగ్ కేసులున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు వివరాలను వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్‌గా గుణÔó ఖర్ బాగా ఎదిగాడు. చిత్తూరు, కడప జిల్లాల్లోని ఏర్పేడు, వెంకటగిరి, రైల్వేకోడూరు ప్రాంతాలకు చెందిన శ్రీనివాసరెడ్డి, కొండయ్య, రాజు, శేఖర్, గిరి, గోపాల్‌రెడ్డిలతో గుణకు మంచి వ్యాపార సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 10న తమిళనాడు నుంచి 10 మంది కూలీలను తన వాహనంలో ఎక్కించుకుని రాత్రి 10 గంటలకు తిరుపతి బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లాడు. అదే రోజు రాత్రి ఆయా కూలీలందరూ శేషాచలంలోనికి ప్రవేశిస్తూ టాస్క్ఫోర్సు పోలీసులకు చిక్కారు. కూలీలకు నాయకత్వం వహించిన శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు స్మగ్లింగ్ కేసులో గుణశేఖర్పైన కూడా కేసు నమోదు చేశారు. దుబాయ్ షాహుభాయ్తో సంబంధాలు... కాగా గుణశేఖర్ ఇప్పటి వరకూ సుమారు 200 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని దుబాయ్, సింగపూర్, చైనా దేశాలకు సరఫరా చేశాడని డీఐజీ కాంతారావు వెల్లడించారు. దుబాయ్‌లో పేరు మోసిన రెడ్‌శాండిల్ వ్యాపారి షాహుభాయ్, అలీభాయ్లతో గుణకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. శేషాచలం నుంచి బయటకు తీసుకెళ్లిన ఎర్రచందనం దుంగలను చెన్నై పోర్టుకి అక్కడి నుంచి సముద్ర మార్గాన దుబాయ్, చైనాలకు చేరవేస్తుంటారన్నారు. షాహుభాయ్, అతని కుమారుడిపైనా నిఘా పెట్టామన్నారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు అంతర్జాతీయ స్మగ్లర్లపైన కూడా నిఘా పెట్టామన్నారు. రెండు నెలల కిందట కొత్తగా వచ్చిన జీవో కారణంగా టాస్క్ఫోర్సుకు విస్తృత విచారణాధికారాలు వచ్చాయనీ, ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. ఇటీవల కాలంలో మైదాన ప్రాంతాల్లోనూ ఎర్రచందనం డంప్‌ల కోసం ప్రత్యేక తనిఖీలు జరుపుతున్నామనీ, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. కాగా అరెస్టయిన గుణశేఖర్ తమిళనాడులోని డీఎంకే పార్టీలో రాష్ట్రస్థాయి నేతగా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా గుణ అరెస్టులో కీలకపాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని డీఐజీ అభినందించారు. మీడియా సమావేశంలో డీఐజీతో పాటు తిరుపతి డీఎస్పీ శ్రీధర్‌రావు కూడా పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
కర్నూలు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన దావుద్ జాకీర్ ఎర్రచందనం స్మగ్లింగ్ దందా నడుపుతున్నాడని రాయలసీమ ఐజీ శ్రీధర్ రావు తెలిపారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక ఫిరోజ్ దస్తగీర్తో కలిసి విలువైన ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్నాడన్నారు. గత కొంత కాలంగా జాకీర్‌పై రాయలసీమ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు ఈ ఇద్దరినీ శనివారం అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5.8 టన్నుల ఎర్రచందనం దుంగలు, ఓ లారీ, ఓ ఐచర్ వాహనం, రెండు కార్లు, రెండు సెల్ఫోన్లు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. -
ఎర్రస్మగ్లర్ వెంకటేశ్‌పై పీడీయాక్ట్ నమోదు
శేషాచలం అటవీప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న జీఎం వెంకటేష్ పై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు...ఎర్రచందనం కేసులో పట్టుబడిన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా , హొస్కోట తాలూకా, జగదానహల్లీ, గోవిందపురం గ్రామానికి చెందిన జి.ఎం. వెంకటేష్ (30), తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి (33), రేణిగుంట మండలం కురకాల్వకు చెందిన బాలాజీ అలియాస్ బాల (31), తిరుపతిలోని లీలామహల్ వద్ద నివాసం ఉంటున్న హరిబాబు(29)లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో... 2016 ఏప్రెల్ 7వ తేదీన సాయంత్రం తిరుచానూరు గ్రామ పంచాయితీ సమీపంలోని చైతన్యపురం ప్రైమరీ స్కూల్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. రబ్బరుచెట్ల పొదల వద్ద వీరంతా దాంకొని ఉండగా పట్టుకోవడం జరిగింది. ఎర్రచందనం రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్న స్కార్పియోతో పాటు 206 కేజీల బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అయితే జీఎం. వెంకటేష్ గతంలో కూడా తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని రేణిగుంట అర్బన్ పీఎస్ , చిత్తూరు జిల్లా పీలేరు పీఎస్, యర్రావారిపాళ్యం పీఎస్, కలకడ పీఎస్ ఇలా 6 కేసుల్లో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడుపై పీటీ ఆరెంట్ అరెస్ట్ కాబడి ప్రస్తుతం తిరుపతి సబ్జైల్లో ఉన్నాడు. ఇలా పలుకేసుల్లో నేరస్థులుగా ఉన్న వెంకటేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ అర్బన్ జిల్లా పోలీసులు కలెక్టర్ సిద్దార్థజైన్‌కు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు మేరకు సోమవారం జీఎం వెంకటేష్‌పై పీడీయాక్ట్ నమోదు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అతని పై పీడీయాక్ట్ నమోదు చేసి తిరుపతి సబ్‌జైల్ నుంచి కడప సెంట్రల్ జైల్‌కు తరలించామన్నారు. -
చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, ఎన్కౌంటర్ పేరుతో మట్టుపెట్టేందుకు కుట్ర జరుగుతోందని కొల్లం గంగిరెడ్డి సతీమణి కొల్లం మాళవిక ఆరోపించారు. తన భర్తను కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆమె తాజాగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జైల్లో ఉన్న తన భర్తకు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని, చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల ఎస్పీలు, కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. చంద్రబాబు కక్ష పెంచుకున్నారు వ్యాపారవేత్త అయిన తన భర్త కొల్లం గంగిరెడ్డిని రాజకీయ కారణాలతో అన్యాయంగా కేసుల్లో ఇరికించారని మాళవిక తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో తన భర్తను ఇరికించారని, అయితే కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తన భర్తపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందులో భాగంగానే గతేడాది మేలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారని తెలిపారు. మా కుటుంబ సభ్యులనూ తప్పుడు కేసుల్లో ఇరికించారు ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నా భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. నా భర్తపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆ కేసులు జరిగే సమయానికి ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా తప్పుడు కేసులు బనాయించారు. నా భర్తను మాత్రమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా తప్పుడు కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రత్యక్షంగా నా భర్తపై కేసులు పెట్టేందుకు ఆధారాలు లేకపోవడంతో సహ నిందితులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కేసులు పెడుతున్నారు. ఎన్కౌంటర్ పేరుతో ఆయనను అంతమొందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జైల్లో గానీ, కోర్టులకు తీసుకొచ్చే దారిలోగానీ హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఈ నెల 20న గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశాను. పోలీసులు నా భర్తను ఎర్ర చందనం స్మగ్లర్‌గా చిత్రీకరిస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనపై 28 కేసులున్నట్లు ఈ నెల 15న మీడియా సమావేశంలోప్రకటించారు. తన ప్రాణాలను కాపాడాలని నా భర్త కోరారు. కాబట్టి ఆయనను ప్రస్తుతం ఉన్న కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వాలి. తనకు ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు నా భర్త చేత బలవంతంగా చెప్పించారు. ఈ విషయాన్ని ఆయనే నాకు చెప్పారు. నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయ జోక్యాన్ని కూడా కోరారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీలు ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. అందులో భాగంగా మీడియా పరేడ్ నిర్వహించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని తెలిసినా చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి’’ అని కొల్లం మాళవిక తన పిటిషన్లో విన్నవించారు. -
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
కడప : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ వెల్లడించారు. అతడి వద్ద నుంచి నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలతోపాటు 5 కార్లు, 3 వ్యాన్లు, రూ. 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం కడపలో తెలిపారు. ఢిల్లీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ హసన్‌కు ప్రధాన అనుచరుడైన ఫయాజ్ కడప జిల్లాలో సంచరిస్తున్నాడని తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీసులను అప్రమత్తం చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్లు నవీన్ గులాఠీ పేర్కొన్నారు. ఆ క్రమంలో జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం వేముల - పులివెందుల రహదారిపై పాలగిరి క్రాస్ వద్ద ఉన్న ఫయాజ్ను పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. పట్టుబడిన ఫయిజ్ను కడప నగరానికి తీసుకువచ్చారు. ఇతడిపై చిత్తూరు జిల్లాలో 35, వైఎస్ఆర్ జిల్లాలో 26 కేసులు మొత్తం 61 కేసులున్నాయని విశదీకరించారు. ఫయాజ్‌ది కర్ణాటకలోని కటికెనహళ్లి స్వగ్రామం అని పోలీసులు చెప్పారు. పట్టబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 2 కోట్లు ఉంటుందన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
బెంగుళూరు : నగరంలోని ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ ఫాంహౌస్‌పై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అల్తాఫ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి నివాసంలో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అల్తాఫ్‌ను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఏడాదిగా అల్తాఫ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆ క్రమంలో సోమవారం అల్తాఫ్ పోలీసులకు చిక్కాడు. చిత్తూరు టాస్క్‌ఫోర్స్ సీఐ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. -
పోలీసుల అదుపులో మాజీ మంత్రి?
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ శరవణన్‌ను అరెస్టు చేసి... అతడు చెప్పిన సమాచారం మేరకు పలు డంప్‌లలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆపరేషన్ రెడ్‌లో భాగంగా జిల్లా పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు, పట్టుబడ్డ స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై, వేలూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వీళ్ల ప్రయేయం, పాత్రపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని చిత్తూరు జిల్లా పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. మూడు కంటైనర్లలో ఎర్రదుంగలు నాలుగు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ భారీ ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు మూడు కంటైనర్లలో చిత్తూరుకు తరలిస్తున్నారు. పశ్చిమబెంగాల్ భూటాన్ సరిహద్దులో ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లాకు చెందిన పోలీసులు దాడులు చేసి సౌందర్‌రాజన్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకోవడమేగాక కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. వీటిని రోడ్డు మార్గంలో అత్యంత భద్రత నడుమ చిత్తూరు జిల్లాకు తీసుకొస్తున్నారు. -
ఎన్‌కౌంటర్‌కి ముందే అరెస్ట్ చేశారు
-
ఎర్ర ‘కింగ్‌పిన్’ అరెస్ట్
చిత్తూరు(అర్బన్): ఆంధ్ర, కర్ణాటక రా ష్ట్రాల్లో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్‌ను జిల్లా టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ‘కింగ్‌పిన్’గా పేరొందిన బెంగళూరుకు చెందిన కే.రామకృష్ణ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను చిత్తూరులో సో మవారం అరెస్టు చూపించారు. ఇతనితో పాటు చెన్నైకు చెందిన అయ్యప్పన్ గౌండర్ (34), తిరువళ్లూరుకు చెందిన జీ.కుమార్ (30), తిరునల్వేలికి చెందిన ఎస్.మురుగన్ (41), క్రిష్ణగిరికి చెందిన ఏ. గోవిందరాజ్ (21)ను కుప్పం-క్రిష్ణగిరి ఘాట్ రోడ్డు, వి.కోట-కుప్పం రోడ్డుల్లో అరెస్టు చేసినట్టు చిత్తూరు ఓఎస్డీ రత్న ప్రకటించారు. వీరి నుంచి పెట్రోలి యం ట్యాంకరు, మహీంద్ర కారు, ఓ లారీ, రూ.2.40 లక్షల నగదు, 34 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న, సీఐ రిషికేశవ్ వివరాలు వెల్లడించారు. స్మగ్లర్ల బయోడేటా రామకృష్ణ ఇతనిది బెంగళూరులోని ముల్బాగిల్. మదనపల్లెలో నివాసముంటున్నాడు. 9వ తరగతి చదువుకుని లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ రియల్ ఎస్టేట్‌లోకి దిగాడు. అక్కడ లాభాలు రాకపోవడంతో 2008 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 1500 టన్నుల ఎర్రచంద నాన్ని జిల్లా నుంచి ఎగుమతి చేశాడు. ఇతనికి అంతర్జాతీ య స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎర్రచందనం నిల్వచేసే గో డౌన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఇతనిపై 14 కేసులు ఉన్నాయి. 2010లో ఎర్రచందనం కేసులో ఇతను జైలు శిక్ష అనుభవించాడు. ఎర్రచందనం రవాణా లో ఆరితేరడంతో ఇతన్ని అందరూ ‘కిం గ్పిన్’గా పిలుస్తుంటారు. వార్షిక ఆదా యం రూ.6 కోట్లు. అయ్యప్ప గౌండర్.. చెన్నైలోని కొడియంగన్ను ప్రాంతానికి చెందిన అయ్యప్పగౌండర్ దుస్తుల వ్యా పారి. చెన్నైకు చెందిన బట్టల వ్యాపారి శేఖర్ ద్వారా 2008లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి వచ్చాడు. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ స్మగ్లర్లకు ఎర్రచందనం సరఫరా చేయడం మొదలు పెట్టాడు. దాదాపు వంద టన్నుల వరకు రవాణా చేశాడు. వార్షిక ఆదాయం రూ.2.50 కో ట్లు. ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. కుమార్ తమిళనాడులోని తిరువళ్లూరుకు చెంది న ఇతను పదో తరగతి చదువుకుని డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణాలోకి వ చ్చాడు. ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. వార్షిక ఆదాయం రూ.60 లక్షలు. మురుగన్ ఇతనిది తమిళనాడులోని తరునల్వేలి జిల్లా. బీ.కామ్ వరకు చదువుకుని ట్రా వెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉం డేవాడు. అక్రమంగా డబ్బు సంపాదిం చాలని ఎర్రచందనం అక్రమ రవాణాలోకి వచ్చాడు. వంద టన్నులు ఇతర ప్రదేశాలకు తరలించాడు. జిల్లాలో ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. వార్షిక ఆదాయం రూ.2.50 కోట్లు. గోవిందరాజ్ తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్ వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనిపై జిల్లాలో ఆరు కేసులు ఉన్నాయి. ఇతని వార్షిక ఆదాయం రూ.12 లక్షలు. ఇద్దరు ‘ఎర్ర’దొంగల అరెస్ట్ వి.కోట: వి.కోట మీదుగా తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివాంజనేయుులు తెలిపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు రహస్య సవూచారం అందింది. పోలీసులు కుప్పం రహదారిలో కాపుగాశారు. పలవునేరు వూర్గం నుంచి కుప్పం వైపునకు వేగంగా వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్‌ను, వుహీంద్రా ఎక్స్యుూవీని అనువూనంతో నిలి పారు. వాహనంలో ఉన్నవారు పొంతన లేని సవూధానం చెప్పడంతో తనిఖీ చేశారు. వాహనాల్లో ఎర్రచందనం దుంగలు ఉండడంతో డ్రరుువర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు వుదనపల్లెకు చెందిన రావుకృష్ణ, తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన గోవిందరాజ్గా తేలింది. వారిని రివూం డుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
-
ఎర్ర చందనం స్మగ్లర్ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : అటవీ శాఖ కార్యాలయంలో ఓ ఎర్ర చందనం స్మగ్లర్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటగిరి అటవీ ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. అధికారులు వారిని వెంటకగిరి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లలో రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. -
స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అరెస్ట్
తిరుపతి : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాను శ్రీను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పోలీసులు అతడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇతడు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు.