మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ | Red sandalwood smuggler fayyaz arrested in ysr district | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్

Published Tue, Oct 13 2015 12:02 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Red sandalwood smuggler fayyaz arrested in ysr district

కడప : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ వెల్లడించారు. అతడి వద్ద నుంచి నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలతోపాటు 5 కార్లు, 3 వ్యాన్లు, రూ. 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం కడపలో తెలిపారు. ఢిల్లీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ హసన్కు ప్రధాన అనుచరుడైన ఫయాజ్ కడప జిల్లాలో సంచరిస్తున్నాడని తమకు సమాచారం అందిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీసులను అప్రమత్తం చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్లు నవీన్ గులాఠీ పేర్కొన్నారు. ఆ క్రమంలో జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం వేముల - పులివెందుల రహదారిపై పాలగిరి క్రాస్ వద్ద ఉన్న ఫయాజ్ను పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. పట్టుబడిన ఫయిజ్ను కడప నగరానికి తీసుకువచ్చారు. ఇతడిపై చిత్తూరు జిల్లాలో 35, వైఎస్ఆర్ జిల్లాలో 26 కేసులు మొత్తం 61 కేసులున్నాయని విశదీకరించారు. ఫయాజ్ది కర్ణాటకలోని కటికెనహళ్లి స్వగ్రామం అని పోలీసులు చెప్పారు. పట్టబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 2 కోట్లు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement