ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ | Red sandalwood smuggler altaf arrested in bangalore city | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

Published Mon, Oct 12 2015 10:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

బెంగుళూరు : నగరంలోని ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ ఫాంహౌస్పై సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అల్తాఫ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి నివాసంలో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.

ఆ తర్వాత అల్తాఫ్ను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏడాదిగా అల్తాఫ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆ క్రమంలో సోమవారం అల్తాఫ్ పోలీసులకు చిక్కాడు. చిత్తూరు టాస్క్ఫోర్స్ సీఐ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement