altaf
-
జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్‌పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
రెచ్చగొట్టి అలజడులకు కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రజా మైనార్టీ యువతకు సూచించారు. ‘చలో నంద్యాల’ పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముస్లింలను కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే పార్టీల తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కృష్ణా జిల్లా కొండపల్లిలోని హజ్రత్ సయ్యద్ షా బుఖారి ఆస్థాన ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం మైనార్టీలతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించడం అభినందనీయమన్నారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులతో వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. పోలీసులే నిందితులుగా ఉన్న కేసులో బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వమే పిటిషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు. సలాం అత్తకు రూ.25 లక్షలు పరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఆ కార్యక్రమాలకు దూరంగా ఉందాం.. ముస్లిం యువతను రెచ్చగొట్టి ప్రభుత్వానికి దూరం చేసేందుకు కొన్ని పార్టీలు ‘చలో నంద్యాల’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అల్తాఫ్ రజా సూచించారు. కొంత మందిని అడ్డుపెట్టుకుని చేస్తున్న స్వార్థ రాజకీయాలను ఆపకుంటే రోడ్డుపైకి వచ్చి నిలదీస్తామని, గత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు చేసిన అన్యాయాలను ఎలుగెత్తి చాటుతామని హెచ్చరించారు. దోషులను తేల్చాలి.. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ముస్లింలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నారని అల్తాఫ్ తెలిపారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి గౌరవించారని, నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మైనార్టీలకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేద్దామని సూచించారు. సలాంపై మోపిన దొంగతనం కేసు, అపవాదులపై క్షుణ్నంగా విచారణ జరిపి అసలు దోషులను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశ ద్రోహం కేసులు గుర్తున్నాయ్.. ఘటనలో నిందితులైన ఇద్దరు పోలీసులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తే కొందరు రాజకీయ నేతలు వారికి బెయిల్ ఇప్పించారని అల్తాఫ్ రజా పేర్కొన్నారు. ఇప్పుడు ముస్లింలపై ప్రేమ నటిస్తున్న పార్టీ గతంలో ‘నారా హమారా’లో ప్రశ్నించిన వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం, గుంటూరు సభలో అక్రమ కేసులు బనాయించడాన్ని ఎవరూ మరచిపోలేదన్నారు. చంద్రబాబు పాలనలో ముస్లింలపై మోపిన అక్రమ కేసులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎత్తి వేశారని గుర్తు చేశారు. -
అందమైన అమ్మాయి
అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా వేముగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై దేవదాస్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవదాస్ నారాయణ మాట్లాడుతూ– ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. వేముగంటిగారి దర్శకత్వంలో ఈ సినిమా బాగా వస్తోంది. అన్ని వాణిజ్య అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టై¯Œ మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏలేంద్ర మహావీర్, కెమెరా: మురళీ కృష్ణ. వై. -
సామాన్యుడి కథ
అల్తాఫ్, శాంతిరావు, లావణ్యా రెడ్డి, సాత్విక జై ప్రధాన తారాగణంగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ ముగిసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్ నారాయణ్ మాట్లాడుతూ–‘‘మామూలుగా పెద్ద వ్యక్తుల జీవితాలు బయోపిక్స్‌గా వెండితెరపైకి వస్తుంటాయి. కానీ మేమే ఒక సామాన్యవ్యక్తి కథనే బయోపిక్‌గా తెరకెక్కించాం. ఈ సినిమాలో టైటిల్ రోల్ ఎవరూ చేశారనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం లేదు. కానీ అతను మాత్రం ఇండస్ట్రీకి మరో రాజేంద్రప్రసాద్ అవుతారని చెప్పగలను. నిర్మాత సతీష్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. కథే హీరో అని నమ్మి చేసిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవి సందర్భంగా విడుదల చేయాలనుకుటున్నాం. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘పెళ్లైన కొత్తలో కొత్తజంటకు ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుస్తుంది.. ముందుంది ముసళ్ల పండగ అని. ఈ అంశాన్నే సినిమాలో చూపించబోతున్నాం. మా చిత్రం ఈ ఏడాదిలో సర్ప్రైజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు నటుడు భద్రం. ఈ కార్యక్రమంలో శాంతిరావు, స్వాతి, కెమెరామ¯Œ కర్ణ పాల్గొన్నారు. -
బట్టల రామస్వామి బయోపిక్కు
అల్తాఫ్, శాంతీరావు, లావణ్యా రెడ్డి, సాత్వికా జై ముఖ్యతారాగణంగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సతీష్‌కుమార్ ఐ నిర్మించనున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. కెమెరామన్ జయరామ్ స్విచ్చాన్ చేశారు. దర్శకుడు చంద్రమోహన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రతిభావంతులును ప్రోత్సహించడానికే ఈ సినిమా నిర్మిస్తున్నా. విభిన్నమైన ఈ చిత్రానికి కొన్ని కమర్షియల్ హంగులు జోడించబోతున్నాం. వచ్చే వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు సతీష్ కుమార్. ఈ కార్య క్రమంలో రచయిత భాస్కరభట్ల, నటులు రామ్ కార్తీక్, గౌతమ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
బెంగుళూరు : నగరంలోని ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ ఫాంహౌస్‌పై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అల్తాఫ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి నివాసంలో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అల్తాఫ్‌ను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఏడాదిగా అల్తాఫ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆ క్రమంలో సోమవారం అల్తాఫ్ పోలీసులకు చిక్కాడు. చిత్తూరు టాస్క్‌ఫోర్స్ సీఐ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.