సామాన్యుడి కథ | Battala Ramaswamy Biopic Movie Press Meet | Sakshi
Sakshi News home page

సామాన్యుడి కథ

Published Mon, Jan 13 2020 12:18 AM | Last Updated on Mon, Jan 13 2020 12:18 AM

Battala Ramaswamy Biopic Movie Press Meet - Sakshi

సాత్విక, రామ్‌ నారాయణ్, సతీష్, శాంతి రావ్‌

అల్తాఫ్, శాంతిరావు, లావణ్యా రెడ్డి, సాత్విక జై ప్రధాన తారాగణంగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ ముగిసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ–‘‘మామూలుగా పెద్ద వ్యక్తుల జీవితాలు బయోపిక్స్‌గా వెండితెరపైకి వస్తుంటాయి. కానీ మేమే ఒక సామాన్యవ్యక్తి కథనే బయోపిక్‌గా తెరకెక్కించాం. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ ఎవరూ చేశారనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం లేదు. కానీ అతను మాత్రం ఇండస్ట్రీకి మరో రాజేంద్రప్రసాద్‌ అవుతారని చెప్పగలను. నిర్మాత సతీష్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.

పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. కథే హీరో అని నమ్మి చేసిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవి సందర్భంగా విడుదల చేయాలనుకుటున్నాం. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత సతీష్‌. ‘‘పెళ్లైన కొత్తలో కొత్తజంటకు ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుస్తుంది.. ముందుంది ముసళ్ల పండగ అని. ఈ అంశాన్నే సినిమాలో చూపించబోతున్నాం. మా చిత్రం ఈ ఏడాదిలో సర్‌ప్రైజ్‌ హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు నటుడు భద్రం. ఈ కార్యక్రమంలో శాంతిరావు, స్వాతి, కెమెరామ¯Œ  కర్ణ పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement