బట్టల రామస్వామి బయోపిక్కు | Battala Ramaswamy Biopic movie launch | Sakshi
Sakshi News home page

బట్టల రామస్వామి బయోపిక్కు

Published Sun, Nov 3 2019 12:36 AM | Last Updated on Sun, Nov 3 2019 12:36 AM

Battala Ramaswamy Biopic movie launch - Sakshi

రామ్‌నారాయణ్, సతీష్‌కుమార్‌

అల్తాఫ్, శాంతీరావు, లావణ్యా రెడ్డి, సాత్వికా జై ముఖ్యతారాగణంగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో సతీష్‌కుమార్‌ ఐ నిర్మించనున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్‌ క్లాప్‌ ఇచ్చారు. కెమెరామన్‌ జయరామ్‌ స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు చంద్రమోహన్‌ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రతిభావంతులును ప్రోత్సహించడానికే ఈ సినిమా నిర్మిస్తున్నా. విభిన్నమైన ఈ చిత్రానికి కొన్ని కమర్షియల్‌ హంగులు జోడించబోతున్నాం. వచ్చే వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు సతీష్‌ కుమార్‌. ఈ కార్య క్రమంలో రచయిత భాస్కరభట్ల, నటులు రామ్‌ కార్తీక్, గౌతమ్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement