అశ్విన్, దిగంగనా సూర్యవన్షీ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్‌గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర.
Comments
Please login to add a commentAdd a comment