lavanya reddy
-
సామాన్యుడి కథ
అల్తాఫ్, శాంతిరావు, లావణ్యా రెడ్డి, సాత్విక జై ప్రధాన తారాగణంగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ ముగిసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్ నారాయణ్ మాట్లాడుతూ–‘‘మామూలుగా పెద్ద వ్యక్తుల జీవితాలు బయోపిక్స్‌గా వెండితెరపైకి వస్తుంటాయి. కానీ మేమే ఒక సామాన్యవ్యక్తి కథనే బయోపిక్‌గా తెరకెక్కించాం. ఈ సినిమాలో టైటిల్ రోల్ ఎవరూ చేశారనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం లేదు. కానీ అతను మాత్రం ఇండస్ట్రీకి మరో రాజేంద్రప్రసాద్ అవుతారని చెప్పగలను. నిర్మాత సతీష్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. కథే హీరో అని నమ్మి చేసిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవి సందర్భంగా విడుదల చేయాలనుకుటున్నాం. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘పెళ్లైన కొత్తలో కొత్తజంటకు ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుస్తుంది.. ముందుంది ముసళ్ల పండగ అని. ఈ అంశాన్నే సినిమాలో చూపించబోతున్నాం. మా చిత్రం ఈ ఏడాదిలో సర్ప్రైజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు నటుడు భద్రం. ఈ కార్యక్రమంలో శాంతిరావు, స్వాతి, కెమెరామ¯Œ కర్ణ పాల్గొన్నారు. -
బట్టల రామస్వామి బయోపిక్కు
అల్తాఫ్, శాంతీరావు, లావణ్యా రెడ్డి, సాత్వికా జై ముఖ్యతారాగణంగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సతీష్‌కుమార్ ఐ నిర్మించనున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. కెమెరామన్ జయరామ్ స్విచ్చాన్ చేశారు. దర్శకుడు చంద్రమోహన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రతిభావంతులును ప్రోత్సహించడానికే ఈ సినిమా నిర్మిస్తున్నా. విభిన్నమైన ఈ చిత్రానికి కొన్ని కమర్షియల్ హంగులు జోడించబోతున్నాం. వచ్చే వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు సతీష్ కుమార్. ఈ కార్య క్రమంలో రచయిత భాస్కరభట్ల, నటులు రామ్ కార్తీక్, గౌతమ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత బి. వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వీఎన్ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్ విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’ చిత్రం హీరో సాగర్ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్ జి. -
బికినీ ధరిస్తావా? అంటూ వెక్కిరించారు..
హిమాయత్‌నగర్: సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె ఒకరికి భార్యగా మెట్టినింట అడుగుపెట్టింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగిగా సేవలందిస్తూ ఇద్దరు పిల్లల తల్లిగా బరువు బాధ్యతలు చూసుకుంటూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అనూహ్యంగా బరువు పెరిగింది. తన ఆరోగ్యం కోసం బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు అమెను ప్రత్యేకంగా నిలిపాయి. ఆమె అంబరపేటకు చెందిన ఫిట్నెస్ మోడల్ లావణ్యారెడ్డి కేసరి. ఉన్నత విద్యనభ్యసించి ప్రముఖ సంస్థలో ఫైనాన్షియల్ ఎనలిసిస్ట్గా చేరింది. ఇద్దరు పిల్లలు. భర్త క్రికెట్ ప్లేయర్. ఉద్యోగ జీవితంలో బిజీ అయిన లావణ్య విపరీతంగా బరువు పెరిగారు. దీంతో ఉప్పల్‌లోని సిమ్ లయన్ ఫిట్నెస్ సెంటర్లో జయసింహ గౌడ్ వద్ద శిక్షణ తీసుకుని కొంత బరువు తగ్గారు. అక్కడితో అగిపోలేదు.. బాడీ బిల్డింగ్ పోటీల వైపు అడుగులేశారు. మూడేళ్లు సాధన చేసి 2018లో ‘ఫిమేల్ ఫిట్నెస్’ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘సంప్రదాయాన్ని వదిలేసి బికినీ ధరిస్తావా? అంటూ చాలామంది వెక్కిరించారు. నేనెంటో నా ఫ్యామిలీకి తెలుసు. అయినా అవేం పట్టించుకోను.. నన్ను నేను నిరూపించుకున్నాను. ప్రపంచ వేదికపై భారతదేశం సత్తా చాటాలని ఉంది. త్వరలో ఆ ఆశయాన్ని చేరుకుటా’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు లావణ్య. -
కంది కొనల కత్తిరింపు యంత్రం
మెదక్ రూరల్: మెదక్ వ్యవసాయ కార్యాలయానికి రెడ్‌గ్రామ్ నిప్పింగ్ యంత్రం వచ్చింది. దీన్ని వ్యవసాయ అధికారులు బుధవారం జెడ్పీటిసీ లావణ్యరెడ్డి పొలంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఏడీఏ మనోహర మాట్లాడుతూ కాలానుగుణంగా రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక యంత్రాలు అందించేందుకు వ్యవసాయ శాఖ కొత్త పరికరాలను అందుబాటులోకి తెస్తోందన్నారు. అందులో భాగంగానే తమ కార్యాలయానికి రెడ్‌గ్రామ్ నిప్పింగ్ మిషన్ (కందిపంటలో కొనలను కత్తిరించే యంత్రం) వచ్చిందన్నారు. ఒకరోజు పదిమంది కూలీలు చేసే పనిని ఈ యంత్రం ద్వారా ఒకరే ఒకరోజులో చేయవచ్చన్నారు. కంది పంటలో కొనలను కత్తించడం వల్ల చెట్లు ఏపుగా పెరిగి అధిక దిగుబడి పొందవచ్చన్నారు. ఈ యంత్రం వినియోగం వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరత ఇబ్బంది ఉండదన్నారు. త్వరలోనే వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రెబల్సన్, ఆత్మ ఏపీఎం శ్రీకాంత్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.