బికినీ ధరిస్తావా? అంటూ వెక్కిరించారు.. | Fitness Model Lavanya Reddy Special Story World Womens Day | Sakshi
Sakshi News home page

షీ ఈజ్‌ పవర్‌ఫుల్‌..

Published Fri, Mar 8 2019 10:51 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

Fitness Model Lavanya Reddy Special Story World Womens Day - Sakshi

ఫిట్‌నెస్‌ మోడల్‌ లావణ్యారెడ్డి

హిమాయత్‌నగర్‌: సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె ఒకరికి భార్యగా మెట్టినింట అడుగుపెట్టింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగిగా సేవలందిస్తూ ఇద్దరు పిల్లల తల్లిగా బరువు బాధ్యతలు చూసుకుంటూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అనూహ్యంగా బరువు పెరిగింది. తన ఆరోగ్యం కోసం బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు అమెను ప్రత్యేకంగా నిలిపాయి. ఆమె అంబరపేటకు చెందిన ఫిట్‌నెస్‌ మోడల్‌ లావణ్యారెడ్డి కేసరి. ఉన్నత విద్యనభ్యసించి ప్రముఖ సంస్థలో ఫైనాన్షియల్‌ ఎనలిసిస్ట్‌గా చేరింది.

ఇద్దరు పిల్లలు. భర్త క్రికెట్‌ ప్లేయర్‌. ఉద్యోగ జీవితంలో బిజీ అయిన లావణ్య విపరీతంగా బరువు పెరిగారు. దీంతో ఉప్పల్‌లోని సిమ్‌ లయన్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌లో జయసింహ గౌడ్‌ వద్ద శిక్షణ తీసుకుని కొంత బరువు తగ్గారు. అక్కడితో అగిపోలేదు.. బాడీ బిల్డింగ్‌ పోటీల వైపు అడుగులేశారు. మూడేళ్లు సాధన చేసి 2018లో ‘ఫిమేల్‌ ఫిట్‌నెస్‌’ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘సంప్రదాయాన్ని వదిలేసి బికినీ ధరిస్తావా? అంటూ చాలామంది వెక్కిరించారు. నేనెంటో నా ఫ్యామిలీకి తెలుసు. అయినా అవేం పట్టించుకోను.. నన్ను నేను నిరూపించుకున్నాను. ప్రపంచ వేదికపై భారతదేశం సత్తా చాటాలని ఉంది. త్వరలో ఆ ఆశయాన్ని చేరుకుటా’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు లావణ్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement