
బుమ్రా లేకపోతే కష్టమన్న రవిశాస్త్రి
దుబాయ్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం ఇంకా సందేహంగానే ఉంది. ఆ్రస్టేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతను ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని చెబుతున్నా దానిపైనా సందేహాలు ఉన్నాయి.
భారత జట్టుకు సంబంధించి అతని బౌలింగ్ విలువ ఎంత అమూల్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే టీమిండియా బలహీనంగా మారిపోవచ్చు. మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరు చాలా ప్రభావం చూపిస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ‘బుమ్రా ఫిట్‌గా లేకపోతే భారత జట్టు విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి.
సరిగ్గా చెప్పాలంటే 30–35 శాతం వరకు గెలుపుపై ప్రభావం పడుతుంది. అతను పూర్తి ఫిట్‌గా ఉండి బరిలోకి దిగితే ఆట స్వరూపమే మారిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను కచ్చితంగా చెలరేగి గెలిపించగలడు. అయితే బుమ్రాను ఆడించే విషయంలో తొందర పడవద్దు. లేకపోతే గాయం తీవ్రత మరింత పెరిగిపోతుంది. కెరీర్ కీలక దశలో ఉన్న అతను రాబోయే రోజుల్లో ఎంతో ఆడాల్సి ఉంది. అలాంటివాడిని ఒక్కసారిగా పిలిపించి గెలిపించమని కోరడం సరైంది కాదు. బుమ్రా చాలా విలువైనవాడు.
అతనిపై అంచనాలూ భారీగా ఉంటాయి. వచ్చి రాగానే చెలరేగిపోవాని అంతా కోరుకుంటారు. నాకు తెలిసి గాయంనుంచి కోలుకొని వచ్చి అలా ఆడటం సాధ్యం కాదు’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మొహమ్మద్ షమీపై అందరి దృష్టీ ఉంటుందని...అతని ఫిట్‌నెస్‌కు కూడా ఇది పరీక్ష కానుందని కూడా భారత మాజీ కోచ్ అభిప్రాయ పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment