రాజా నరసింహా | Madhura raja dubbing on jai narasimha | Sakshi
Sakshi News home page

రాజా నరసింహా

Published Tue, Jun 18 2019 3:23 AM | Last Updated on Tue, Jun 18 2019 3:23 AM

Madhura raja dubbing on  jai narasimha - Sakshi

మమ్ముట్టి

మమ్ముట్టి, జై, మహిమా నంబియర్‌ కీలక పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘మధురరాజా’. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధుశేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు.  ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత తెలుగులో వస్తున్న మమ్ముట్టి చిత్రమిది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.

జూలైలో సినిమా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధు శేఖర్‌ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌ ఇది. చక్కని సందేశం ఉంది. మమ్ముట్టి, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీ లియోన్‌  ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకష్ణ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement