mahima nambiar
-
ఆ హీరోతో ఓ సినిమా చేశా.. అయినా నంబర్ బ్లాక్ చేశాడు: హీరోయిన్
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్‌పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్‌పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్‌బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది. మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకుని వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. ఆ తర్వాత ఉన్ని ఉదయన్కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా నా నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్‌ను బ్లాక్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్లో నటించి హిట్ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్‌ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్‌బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాలీవుడ్లో హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టార్ హీరో సినిమాలో..
ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగే హీరోయిన్ మహిమ నంబియార్. 12వ తరగతి చదువుతుండగానే కథానాయికగా రంగప్రవేశం చేసిందీ మాలీవుడ్ చిన్నది. సాట్టై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన మహిమా నంబియార్ ఆ తరువాత ఇక్కడ పలు చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. ఇటీవల ఈమె నటించిన చంద్రముఖి–2, రత్తం చిత్రాలు ఒకే రోజు విడుదల అవడం విశేషం. రత్తం చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించిన ఈమె చంద్రముఖి–2లో రాఘవ లారెన్స్‌కు జంటగా నటించింది. హీరోయిన్ల సమస్యలపై ఏమందంటే? ప్రస్తుతం పలు చిత్రాలతో ముఖ్యంగా మలయాళంలో ప్రముఖ నటుల సరసన నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా మహిమా నంబియార్.. హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమలో కథానాయికలు చాలా కాలంగా ఇబ్బందిపడుతున్నారంది. చాలా మంది నటీమణులు తమకు ఎదురయ్యే అరాచకాలపై పోరాడుతున్నా ఫలితం ఉండటం లేదని పేర్కొంది. ఎక్కడి వరకో ఎందుకు? తాను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ఇంతకు ముందు తెలుగులో ఒక ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో నాలుగు రోజులు నటించానని, ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగ్ చేద్దామని చిత్ర వర్గాలు చెప్పారంది. అలా కొన్ని రోజుల తరువాత ఆ చిత్ర మేనేజర్ తనకు ఫోన్ చేసి తమ చిత్రంలో ఒక పెద్ద హీరోయిన్ నటించడానికి సమ్మతించారని, అందువలన నన్ను తొలగించినట్లు చెప్పారని పేర్కొంది. ఇలాంటి అవమానాలను చాలా ఎదుర్కొన్నట్టు నటి మహిమ నంబియార్ చెప్పింది. చదవండి: ఒకే వేదికపై మహేశ్-రాజమౌళి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్ -
జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక ఇదే: మహిమా నంబియార్
మహిమా నంబియార్.. నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్స్‌తో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆమె పరిచయం క్లుప్తంగా.. కేరళలో పుట్టి పెరిగిన మహిమా హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డాన్స్ అంటే ఎంతో ఇష్టం. డాన్స్ ద్వారానే మోడలింగ్.. ఆ తర్వాత యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది. పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా మలయాళ చిత్రం ‘కార్యస్థాన్’లో కనిపించింది. తొలి చిత్రమే మంచి హిట్ కావడంతో.. కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. దాదాపుగా ఇవన్నీ కూడా సక్సెస్ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథగా తెరకెక్కిన ‘800’లోనూ మహిమా ప్రధాన పాత్ర పోషించింది. మహిమా మంచి డాన్సరే కాదు పాటలూ పాడుతుంది. తీరిక దొరికితే చాలు సోషల్ మీడియాలో మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘చంద్రముఖి 2’తో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ కనిపించింది. నా జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి నటించాలని! ఆయన చిత్రంలో ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ! – మహిమా నంబియార్ -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023 -
800 చూసి ఆశ్చర్యపోతారు
‘‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా ‘800’ రూపొందింది. బయోపిక్ కాబట్టి కథలో మార్చడానికి ఏం ఉంటుంది? ఆయన జీవితంలో కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? అన్ని అవరోధాలు ఎదుర్కొని ముత్తయ్య ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ఆశ్చర్య΄ోతారు’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్ ΄ాత్రలో మహిమా నంబియార్ నటించగా ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీపతిని మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నాం. అయితే ‘800’కి చాన్స్ వచ్చిందని చెబితే ఆ సినిమా చేసి రమ్మని నేనే చె΄్పాను. ఈ చిత్రాన్ని ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శ్రీపతితో ఓ సినిమా, ‘యశోద’ చిత్రదర్శకులతో మరో సినిమా చేస్తాను. దర్శకుడు పవన్ సాధినేనితో ఓ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
యువతకు మురళీధరన్ స్ఫూర్తి
‘‘మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, నిగర్వి. ఈ తరం యువతకు రోల్ మోడల్, స్ఫూర్తి. అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం. తనకు క్రికెట్టే జీవితం’’ అని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్‌గా మహిమా నంబి యార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘800’ ప్రీ రిలీజ్ వేడుకకి వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం. లక్ష్మణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే హీరో వెంకటేశ్‌ని కెప్టెన్ చేయాలి.. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఈ సినిమాలో మురళీధరన్ క్రికెట్ గురించి మాత్రమే కాదు. ప్రజలకు తెలియని ఆయన జీవితం ఎంతో ఉంది’’ అన్నారు మధుర్ మిట్టల్. -
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మూవీ లో..!
-
సినీ ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్? స్పందించిన హీరోయిన్
సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒకరకమైన ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అడ్జెస్ట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. అడ్జెస్ట్మెంట్ అన్న విషయం గురించి పలువురు హీరోయిన్లు ప్రస్తావిస్తూ వచ్చారు. తమకు అలాంటి అనుభవం ఎదురు కాలేదనే చాలామంది చెబుతుంటారు. నటి మహిమా నంబియార్ కూడా ఇందుకు అతీతం కాదు. ఈ కేరళ భామ మోడలింగ్ నుంచి చిత్ర రంగ ప్రవేశం చేసింది. 15 ఏళ్ల వయసులోనే అంటే 2010లోనే మాతృభాషలో నటిగా పరిచయం అయ్యింది. ఆ విధంగా ఈమె నట వయస్సు 13 ఏళ్లు. 2012లో సాట్టై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ మహిమ నంబియార్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అలా మలయాళంలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె రాఘవ లారెన్స్‌కు జంటగా నటించిన చంద్రముఖి–2 ఈనెల 28న తెరపైకి రానుంది. అదే విధంగా విజయ్ ఆంటోని సరసన నటించిన రత్తం, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కిన '800' చిత్రాలు కూడా అక్టోబర్ 6వ తేదీన విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. క్రికెట్ క్రీడాకారుడు ముత్తయ్య జీవిత చరిత్రతో రూపొందిన 800 చిత్రంలో తాను ఆయన భార్య మదిమలర్గా నటించినట్లు చెప్పింది. ఇందులో తన పాత్ర చిన్నదే అయినా ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొంది. ముత్తయ్య మురళీధరన్ ఒక క్రికెట్ క్రీడాకారుడిగానే అందరికీ తెలుసని, అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారని, అలా ఆయనలోని రియల్ కోణాన్ని చూపించే చిత్రమే 800 అని చెప్పింది. ఇకపోతే చంద్రముఖి –2 చిత్రంలో రాఘవ లారెన్స్ మాస్టర్‌కు జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. మలయాళం, తెలుగు భాషల్లో తన సినీ పయనం సాగుతున్నా, ప్రస్తుతానికి మలయాళంలో ఏ చిత్రం చేయడం లేదని చెప్పింది. సినిమా పరిశ్రమలో మహిళలకు రక్షణ ఉందా? అని అడుగుతున్నారని అయితే ఇతరుల గురించి తాను చెప్పలేనని తన వరకైతే మాత్రం ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత? -
చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ ఇప్పుడు చాలా ఖుషీగా ఉంది. ఈ మలయాళ బ్యూటీ తన 13 ఏళ్ల కెరీర్లో నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి పేరుని తెచ్చుకుంది. దీనికి కారణం మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడమే. మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మహిమా నంబియార్ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2012లో సట్టై సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైంది. (ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) ఆమె నటించిన తొలి చిత్రమే మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశం వరించింది. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ కావడం ఈమె కెరీర్‌కు ప్లస్ అయ్యింది. కాగా ప్రస్తుతం చంద్రముఖి– 2 లాంటి వంటి భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్, ప్రభు, నయనతార, జ్యోతిక, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో రజనీకాంత్ పోషించిన పాత్రలో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించడం విశేషం. అదే విధంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ్యోతిక పాత్రలో నటించగా.. లక్ష్మి మీనన్, సృష్టి డాంగే, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మహిమ నంబియార్ ఒక నాయకిగా నటిస్తోంది. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీని గురించి మహిమా నంబియార్ తన ట్విట్టర్లో చంద్రముఖి– 2 చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళుతున్నట్లు పేర్కొంది. ఒక నటిగా లారెన్‌న్స్ మాస్టర్‌తో కలిసి డాన్స్ చేయాలన్నది తన చిరకాల కలని అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్‌గా ప్రకటించిన భామ!) View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) -
స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఆసక్తిగా ఫస్ట్ లుక్!
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సాధించిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. సోమవారం (ఏప్రిల్ 17) ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఎంఎస్ శ్రీపతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో చేసిన సలీమ్ మాలిక్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మధుర్ మిట్టల్ ఈ బయోపిక్‌లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. శ్రీపతి మాట్లాడుతూ – ‘‘కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా మురళీధరన్ అరుదైన రికార్డు సాధించారు. అందుకే ఈ చిత్రానికి ‘800’నే టైటిల్‌గా పెట్టాం. మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్ వారు అక్కడి టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా ముత్తయ్య మురళీధరన్‌లోని పలు కోణాలను చూపించే చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. వివేక్ రంగాచారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
విజయం ఖాయం
‘‘కొన్నేళ్లుగా పంపిణీ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాఖ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ రేపు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ– ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే కథాంశం. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. సన్నీ లియో¯Œ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మా చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది’’ అన్నారు. -
రాజా వస్తున్నాడు
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో ‘మన్యం పులి’ ఫేమ్ వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహ’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘అదొక మారుమూల అటవీ ప్రాంతం. ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందు తాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా ఎలా తీర్చాడు? అన్నదే ఈ చిత్రకథాంశం. చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి మాస్ యాక్షన్ , జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్ పోరాటాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
రాజా నరసింహా
మమ్ముట్టి, జై, మహిమా నంబియర్ కీలక పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘మధురరాజా’. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత తెలుగులో వస్తున్న మమ్ముట్టి చిత్రమిది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో సినిమా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం ఉంది. మమ్ముట్టి, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకష్ణ. -
క్రైమ్ థ్రిల్లర్
అరుణ్ విజయ్ హీరోగా మహిమా నంబియార్, అభినయ హీరోయిన్లుగా దర్శకుడు అరివళగన్ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘కుట్రమ్ 23’. ఈ సినిమాను ‘క్రైమ్ 23’గా ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇంద్ర కుమార్ తెలుగులో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ ధర్మిరెడ్డి మాట్లాడుతూ – ‘‘బ్రూస్లీ, ఎంతవాడుగానీ’ చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న అరుణ్ విజయ్ నటించిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు అరివళగన్ సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను చక్కగా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి క్రైమ్ థ్రిల్లర్. ప్రభాస్‌గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 31న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: కేయమ్ భాస్కరన్. -
వాస్తవ సంఘటనలతో...
‘బ్రూస్ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల్లో విలన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించిన అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కుట్రమ్ 23’. ‘వైశాలి’ చిత్రం ఫేమ్ అరివళగన్ దర్శకుడు. మహిమ నంబియార్, అభినయ హీరోయిన్స్. ఈ చిత్రాన్ని అరుణ ప్రసాద్ ధర్మిరెడ్డి సమర్పణలో శ్రీ విజయ నరసింహా ఫిలింస్ పతాకంపై ‘క్రైమ్ 23’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 24న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం గురించి ప్రసాద్ ధర్మిరెడ్డి మాట్లాడుతూ– ‘‘తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎమోషన్స్‌తో అరివళగన్ బాగా తెరకెక్కించారు. అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా మంచి నటన కనబరిచాడు. ఇటీవల ప్రభాస్‌గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అన్నారు. -
‘క్రైమ్ 23’ మూవీ స్టిల్స్
-
అందరికీ మంచి పేరు రావాలి: ప్రభాస్
అరుణ్ విజయ్ హీరోగా ‘వైశాలి’ ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కుట్రమ్ 23’ని తెలుగులో ‘క్రైమ్ 23’ అనే టైటిల్‌తో అనువాదం చేస్తున్నారు. మహిమ నంబియార్, అభినయ కథానాయికలు. శ్రీమతి అరుణ ప్రసాద్ ధర్మిరెడ్డి సమర్పణలో ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్ సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘క్రైమ్ 23’ తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘ఈశ్వర్’లో అరుణ్ విజయ్ సిస్టర్ శ్రీదేవితో కలిసి నటించాను. ఇప్పుడు ‘సాహో’ చిత్రంలో అరుణ్ విజయ్‌తో కలిసి నటిస్తున్నాను. ‘క్రైమ్ 23 ట్రైలర్’ చాలా బాగుంది. హీరోగా అరుణ్ విజయ్‌కు, ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్న నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అరుణ్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ప్రభాస్ చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ పోలీస్‌గా నటించాను. ఆల్ ఎమోషన్స్‌తో అరివళగన్ బాగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘సాహో’, మణిరత్నంగారి ‘నవాబు’ సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘వైశాలి’ తర్వాత తెలుగులో రిలీజ్ అవుతున్న నా రెండో చిత్రమిది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రభాస్‌గారు ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అనువాద కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. తమిళంలో హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
ఆ హీరోకు జోడి కుదిరింది..
ఎట్టకేలకు యవ నటుడు విక్రమ్ ప్రభుకు హీరోయిన్ దొరికింది. యువ హీరో విక్రమ్‌ప్రభు, మహిమ నంబీయార్‌ల జోడీ కుదిరింది. మొదటి చిత్రం కుంకీతోనే పల్లెటూరి కుర్రాడి పాత్రలో విక్రమ్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అసుర గురు అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఏ.రాజ్‌దీప్ డైరెక్టర్. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం బాగానే అన్వేషణ జరిగిందట. చివరకు నటి మహిమ నంబీయార్ సెట్ అయ్యింది. ఈ బ్యూటీ చాలా తక్కువ చిత్రాలోనే నటించింది. కానీ అందులో విజయం సాధించినవి ఎక్కువ. ఈ చిత్రాన్ని జే. సతీశ్‌కుమార్ నిర్మించనున్నారు. దీనికి గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
ఆమె కోరిక తీరేనా?
తమిళసినిమా: మహిమానంబియార్ కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న మాలీవుడ్ కుట్టీ ఈ బ్యూటీ. సాట్టై చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయమైన మహిమకు ఆ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత ఎన్నమో నడక్కుదు, కుట్రం 23 వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నా స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అయితే తమిళం, మలమాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. మహిమానంబియార్ శశికుమార్‌తో జత కట్టిన కొడివీరన్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మహిమ పేర్కొంటూ కొడివీరన్ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించానని చెప్పింది. నటనకు అవకాశం ఉన్న పాత్ర అని చెప్పింది. కొడివీరన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. సరే స్టార్ హీరోలతో నటించాలని లేదా అన్న ప్రశ్నకు ఈ బ్యూటీ బదులిస్తూ ఎందుకు లేదూ అసలు తన పెద్ద కోరికే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని, ఆయన చిత్రంలో ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంది. ఇక అజిత్ అంటే చాలా ఇష్టం అని, ఆయనతో జత కట్టాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. అదే విధంగా ఇలయదళపతితో స్టెప్స్ వేయాలని, నటుడు ధనుష్‌తో నటించాలని ఉంది. అయితే అవకాశాలు రావాలిగా అని అంది. అయితే తనకంటూ ఒక టైమ్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న మహిమానంబియార్కు సూపర్‌స్టార్‌తో నటించాలనే కోరిక నెరవేరుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు రవిఅరసు దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఐన్గరన్, ఇరవుక్కు ఆయిరం కణ్గళ్ చిత్రంలో అరుళ్నిధితోనూ నటిస్తోంది. ఇక మాత్రభాషలో మమ్ముట్టికి జంటగా మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలు విడుదల తరువాత తన స్థాయి పెరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
విజయ్ వర్సెస్ అరుణ్‌విజయ్
చిత్ర విచిత్రాలు జరగడం సినీప్రపంచంలో షరా మామూలే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఏఏ తమిళ చిత్రాలు ఢీకొనబోతున్నాయన్నది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. దీపావళి పండగకే తెరపైకి రావలసిన విశాల్ కత్తిసండై వాయిదా పడి సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించారు. అలాంటిది అనూహ్యంగా మూడు వారాల ముందుగానే క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 23న తెరపైకి దూసుకొస్తోంది. ఇక ఈ నెల 16న విడుదల కావలసిన సూర్య ఎస్–3 చిత్రం 23కు వాయిదా పడినట్లు చిత్ర వర్గాలు వెల్ల డించాయి. అయితే ఇప్పుడు ఈ తేదీకీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి తరువాతేననే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఆయన 60వ చిత్రం భైరవా మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. దీనికి పోటీగా అనూహ్యంగా అరుణ్‌విజయ్ హీరోగా నటించిన కుట్రమ్ 23 చిత్రం తెరపైకి రానుంది. ఈ చిత్రం వర్గాలు అధికారికంగా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అరుణ్ విజయ్‌కి జంటగా మహిమా నంబియార్ నటించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకుడు. రెదర్ ది సినిమా పీపుల్ పతాకంపై ఇందర్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్‌చంద్రశేఖర్ సంగీతాన్ని, కేఎం.భాస్కరన్ ఛాయాగ్రహణం, భువనశ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఇంద్రకుమార్ తెలుపుతూ ఇది మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఒక మంచి సందర్భంలో కుట్రం 23 చిత్రాన్ని విడుదల చేయనుండడం సంతోషంగా ఉందన్నారు.ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా డబుల్ సంతోషాన్నిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది
నా దెబ్బకు విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది అంటోంది వర్ధమాన నటి మహిమ నంబియార్. విద్యార్థిని దశలోనే హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ మలయాళీ కుట్టి. సాట్టై చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించి, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో మొసకుట్టి, పురావి 150 సీసీ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. విజయ్ వసంత్ సరసన నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణను చూరగొంటోంది. దీంతో విజయానందంలో మునిగిపోయిన మహిమా నంబియార్‌ను పలకరించగా ఎన్నమో నడక్కుదు తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోతుందని పేర్కొంది. నిజం చెప్పాలంటే తాను స్టార్ నయ్యిపోవాలని కోరుకోవడం లేదంది. కథాబలం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఎన్నమో నడక్కుదు చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇందులో పూర్తిస్థారుు హీరోయిన్ పాత్ర పోషించినట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అంగీకరించినప్పుడే చిత్ర విజయంపై నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేదంది. ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ఒక సంఘటనను తానెప్పటికీ మరచిపోనని చెప్పింది. ఒక సన్నివేశంలో హీరో విజయ్ వసంత్‌ను చెంప మీద కొట్టాల్సి ఉందని ఆ సన్నివేశంలో తన ప్రమేయం లేకుండానే ఆయన చెంప చెళ్లుమనిపించానని చెప్పింది. తన దెబ్బతో విజయ్వసంత్కు దిమ్మతిరిగింది. ఆ రోజంతా ఆయన ఆ షాక్ నుంచి కోలుకోలేదంటే నమ్మండి అంటున్న మహిమ తన తదుపరి చిత్రాలకు మంచి విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందని చెప్పింది. మొసకుట్టిలో గ్రామీణ యువతిగా నటించానని తెలిపింది. ఇందులో తనకు మావయ్యగా పశుపతి నటించారని వెల్లడించింది. అలాగే పురవి 150 సీసీ చిత్రంలో చెన్నై అమ్మాయిగా వైవిధ్యభరిత పాత్రను చేస్తున్నట్లు తెలిపింది. ఇది చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు హీరో హీరోయిన్ల బైక్ పయనం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని చెప్పింది. వీటితోపాటు అగత్ ఇనై అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు మహిమా నంబియార్ వెల్లడించింది.