మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్‌పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్‌పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్‌బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది.
మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకుని వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. ఆ తర్వాత ఉన్ని ఉదయన్కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా నా నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్‌ను బ్లాక్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్లో నటించి హిట్ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్‌ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్‌బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment